మీఢుష్టమ శివతమ-15
*********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవింపలేడు.
తెల్లారిందా? మీ అల్లరికి,మొదలెట్టేసారు.అర్థాంగి అంతటితో ఆగకుందా...
అదృష్టవంతులు మీ నాన్న.
బారెడు పొద్దెక్కినా..ఏ బాదరబందీ లేకుండ..
ఒక్కసారిగా మెళుకువ వచ్చింది సాధకునికి.
అంటే-
ఇప్పటివరకు నేననుభవించినది,
సత్యమా? లేక స్వప్నమా?
"నమ స్స్వపధ్యో జాగ్రదభ్యశ్చవో నమః".
నిద్రించుచున్న రుద్రునికి నమస్కారము.మేల్కాంచుచున్న రుద్రునికి నమస్కారము వినబడుతోంది రుద్రము సాధకుని సందేహమునకు మరింత సందడి చేస్తూ.
కనికట్టుచేస్తున్నావన్నానని,ఈ రుద్రుడు ఏకంగా,
నా కలలలోనే అలజడిని తెప్పిస్తున్నాడు.అమ్మో! అమ్మో! సామాన్యుడు కాడు.కానే కాడు.
నేను గీసినగీత జవదాటనట్లే ఉంటాడు.తనకు నచ్చిన పనులు నా చేత చేయించుకుంటూనే ఉంటాడు.
అమ్మ సంగతి నాకు చెప్పనేలేదు.ఎంతసేపు తానే అనుగ్రహించువాడిగా అనిపిస్తుంటాడు.
అమ్మ దగ్గర ఎన్ని నాటకాలాడాడు.నన్ను ఎన్ని మాటలన్నాడు.రెండు చేతులను కొంచము కొంచము జరుపుతు ,
ఇంతనా? ఇంతనా? ఇంకొంచమా? అంటు ఎంత కావాలోచెప్పమంటు ఎన్ని తిప్పలు పెట్టాడు.
" నమోవంచతే పరివంచయే స్తాయునాం పతయే నమః" అని కొలుస్తున్నారు కొందరు అక్కడ అసలు విషయమును గ్రహించలేక.
ఊసుపోక నాదగ్గరికి వస్తుంటాడు.ప్రతివిషయములోను నన్ను మోసగిస్తూనే ఉంటాడు అనుకుంటూ అడుగులు కదుపుతున్నాడు సాధకుడు.
పావులను కదుపుతున్నాడు రుద్రుడు.
వాడిని బాగుచేసే పనిలో భాగస్వాములా అన్నట్లు అక్కడ బాల బ్రహ్మచారులు
మతిశ్చమే-సుమతిశ్చమే పఠనమును చేస్తున్నారు.
అంతే కదా.అది నాదగ్గరలేదనేగా ఆ రుద్రునికి అంత అలుసు నేనంటే.
అయినా రుద్రుని అనుకొని ఏమిలాభం? ఏదడిగితే అది ఇస్తానన్నాడుగా.నేనే అడగలేదు.
కాదు-కాదు. అడగాలనిపించ
నీయలేదు ఆ రుద్రుడు.
నేనే కనుక సక్రమముగా ఆలోచించగలిగితే నా మనసును ఎవరు ఆక్రమించగలరు?
నన్ను మోసగించుటకు ఉపక్రమించగలరు?
సాగుతోంది చమకము రాగధారలా
" సంవితశ్చమే-జ్ఞాత్రంచమే " అంటూ.
రానీ రుద్రుని.నన్ను వదిలి వెళ్ళనీయను.ఉడుము పట్టులా పట్టుకుంటాను అనుకుంటున్నాడు సాధకుడు.
రానీ జ్ఞానము ఒడుపుగా పట్టిస్తాను అనుకున్నాడు రుద్రుడు .
సాధకుని చేతిని వదిలివేస్తూ-చేతలను చూపుతూ.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే- అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
No comments:
Post a Comment