మీఢుష్టమ శివతమ-16.
*******************
నన్ను వదిలి వెళ్ళిపోకయా-కైలాసవాసా
నన్ను వదిలి వెళ్ళిపోకు కన్నతండ్రి నీవు కాద
నన్ను వదిలి వెళ్ళిపోకయా.
రుద్రా! నేను పిలువకున్నా వచ్చేవాడివి.ఇప్పుడు ప్రేమతో రమ్మన్నా రావటములేదు.
మనసంతా చిందర-వందర.
కాసేపు పార్కుదాకా వెళ్ళివస్తాను అంటు అడుగులను కదుపుతున్నాడు.
*******************
మైకులో వినిపిస్తున్నది.ఇది ప్రకృతి నియమము.ఆకలి వేసినపుడు మనము ఆహారము వద్దకు వెళ్ళాలి కాని అది మన దగ్గరకు రాదు.
అలాగే నది తన మార్గములో తాను ప్రవహిస్తూ ఉంటుంది.దాహము వేస్తే మనమే దానిదగ్గరకు వెళ్ళాలి.అది మన దగ్గరకు రాదు కాని మనము వెళితే నీళ్ళను తాగనీయను,-దాహము తీర్చను అనదు..
నమో భవాయచ-రుద్రాయచ.
ప్రాణులందరికి కారణమైన భవునకు నమస్కారము.రోదనమునకు హేతువైన కారణమును
పోగొట్టు రుద్రునకు నమస్కారము.
జ్ఞానము అంతే-జతగా నడుస్తూ అన్నాడు రుద్రుడు.
అంతే-అంతే అన్నాడు. సాధకుడు.
పార్కులోని టి.వి నుండి వయోజనవిద్య ప్రాయోజిత కార్యక్రమము మాత్రము నేరుగా మీ దగ్గరికేవస్తున్నది.
మిత్రులారా! నమస్కారము.
ఇది ఏమిటో కాసేపు కూర్చుని చూద్దాము అన్నాడు రుద్రుడు.
" కాచేది నీవైతే-కాసేపే ఎందుకు? "కళ్ళప్పగించి చూస్తున్నాడు సాధకుడు రుద్రుని.
నమ శ్శ్లోక్యాయచ -అవసాన్యాయచ.
వేదమంత్రములందు-వేదాంతముచే చెప్పబడు రుద్రానీకు నమస్కారములు.
కాయకష్టం చేసివచ్చి కాగితాలు చేతిలో పట్టుకొని కూర్చున్నారు కొందరు యువకులు.
ముందుగా ఇంటిపని పరిశీలన.
వారు కాగితములను తిప్పి చూపించారు.
అందరు అ నుండి అః వరకు అచ్చులను వ్రాసారు.
కాని,పాపం,
కొందరు ఇ తో ప్రారంభించారు.ఇంకొందరు అ తరువాత ఎ వ్రాసారు.మరికొందరు ఈ తరువాత ఇ ,ఇలా అన్ని అక్షరములను వ్రాసినప్పటికిని అమరికలేదు.
అర్థంకాక చూస్తున్నాడు తన తికమకను తలుస్తూ,సాధకుడు
అంతకన్నా అమాయకముగా చూస్తున్నాడు రుద్రుడు..
నమశ్సంభవేచ-మయోభవేచ.
ఇంతలో మాస్టారు వచ్చారు.టేపులను.చార్టులను తీసుకుని.పాట మొదలైనది. చార్టు గోడను అలంకరించినది.
అ-అమ్మ-ఆ- ఆవు, ఇ-ఇల్లు,ఈ-ఈగ...
చూస్తూ వెంటనే సవరించుకుంటున్నారు-చదివేసుకుంటున్నారు సంతోషముగా.
గట్టిగా రుద్రుని చేతిని పట్టుకుంటూ,
నాకు ఇలా తెలియచేసే గురువు కావాలి అన్నాడు.
యన్ తాచమే-యన్ తాచమే అంటు.
అలాగే చూస్తాలే ఎవరినైనా, ,ఏమి తెలియని వాడులా అన్నాడు రుద్రుడు.
ఎవరినైనా ఏమిటి? ఏమనుకుంటున్నావు.?
నాకు కావలిసినది నామమాత్రపు గురువు కాదు.నాకు బోధచేసిన జ్ఞానమును పోషింపగల గురువు.
నీ తమాషాలు నాదగ్గర కాదు.కనుక నువ్వే!నువ్వే నాకు గురువు కావాలి.
.అంతే! ముమ్మాటికి! అన్నాడు సాధకుడు .
నువ్వే నువ్వే నాకు గురువుగా.........
యన్ తాచమే-ధర్తాచమే ఎన్నిసార్లు అంటున్నాడో ఏమో
ప్రసన్న దరహాసము పరమార్థమునందించుటకు తలపంకించినది..
గురుతు పట్టాడు గురువుని సాధకుడు.
మెరుగు పెట్టాలనుకున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment