మీఢుష్టమ శివతమ-11
***********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని దర్శించలేడు.దయను పొందలేడు.
అమ్మో రుద్రా! ఎంత గడసరివి.నా దగ్గరికి నిన్ను మాటిమాటికి రావద్దన్నానని ,నేరుగా నన్నే నీ దగ్గరికి రప్పించుకొని,నీ ముందు కూర్చోవాలా అని నా చేతనే అభ్యర్థించి,లింగడుగా ఎన్నో విషయములను సోదాహరణముగా చెప్పుచున్నట్లు నటించి,
నేను నీతో తడబడకుండా అన్నీ అప్పచెప్పేద్దామనుకున సమయములో( ఇంకా తరణ సమయమైన తరుణము రాలేదుకదా)
చూడప్పా సరిగ్గా నన్ను! అంటూ,నన్ను పప్పులో కాలేసేటట్లు చేస్తావా..చాలా గొప్పతనమేలే నీది.చాలించలేని నీ అల్లరి నీది.
" నమః శూరాయచ-అవభిందతేచ"
తన భక్తులను ఇబ్బందిపెట్టు శత్రువులను రహస్యముగా మట్టుపెట్టు రుద్రుడు సాధకుని విషయములో అంటి-ముట్టనట్లుండగలడా?
అసలే చీకటి? అభిషేకజలములతో పునీతమైనది పుడమి.ఈదలేకపోతున్నాడంటు వీడు, అంటు వాడికాలిని పట్టుకుండి బురద ఆ ఆదమరుపు ఏమిటని?
తెలిసినది సాధకునికి తనకాలు బురదలో ఇరుక్కుపోయిందని/బయటకు రావట్లేదని.
"నమః సూద్యాయచ-వైశంపాయచ"
బురద తానైన రుద్రుడు సాధకునికి తన చేయినందించాడు ప్రీతితో.
చేసేదిలేక దానినందుకుని బయటకు వచ్చి,నడకను ప్రారంభించాడు రుద్రునితో.
సాయం చేసాడుకదా రుద్రుని పై కోపం మాయమైనది వానికి.
తెలిసిందయ్యా రుద్రా! ఆభరణము వంటిది శరీరము.దానికే నామ-రూపములు.నానా రూపములు.కాని అవి శాశ్వతము కాదు.
ఆత్మ మేలిమి పసిడి వంటిది.నామరూప రహితము.అవునా ఇంకా ఏమి తెలిసింది నీకు? ఆసక్తిగా అడిగాడు రుద్రుడు.
మేలిమి చెప్పినట్లు ఆభరణము మెలగాలి.ఆభరణమునకు మేలిమిని శాసించే అధికారము లేదు.ఇది నిజం.
అవును.ముమ్మాటికిని.అని స్పష్టముగా చెప్పాడు సాధకుడు.
" నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ".
ఆ మాటలు రుచించలేదు రుద్రునికి..అడిగితే అపార్థాలు వస్తాయేమో అనుకుంటున్నాడు.
ఏమిటి రుద్రా! ఆలోచిస్తున్నావు? అన్నాడు సాధకుడు.
చిలిపి ఆలోచనకు పిలుపునిచ్చాడు రుద్రుడు.
మరేమో నిన్న సాయంత్రము నేను నీ దగ్గరకు వస్తున్నప్పుడు గుడి దగ్గర ఇద్దరు వ్యక్తులు సంభాషించుకొనుచున్నారు.వారికి నేనేమి తెలియదుగా.అందుకే గట్టిగానే. వారిలో ఒకడు వేరొకనితో,
నీలాగానే-అచ్చం నీలాగానే అపరంజికి అగ్రతాంబూలమన్నాడు.అందుకే చమకము హిరణ్యంచమే అని పేర్కొందని పొగిడాడు.కాని,....
కాని, ఏమయింది చెప్పు రుద్రా
రెండో వాడు దానిని ఖండిస్తూ,అపరంజి కంటె మన్ను చాలా గొప్పదన్నాడయ్యా.అంతటితో ఆగక, ఒకవేళ నాకు ఒకేఒక వరమును కోరుకునే అవకాశము కనుక వస్తే,
నేను మాత్రము తప్పక క్షేత్రంచమే అని అర్థిస్తాను కాని, హిరణ్యమును మాత్రము కాదు అన్నాడు కన్నులు పెద్దవిచేసి అదోలా పక్కవాడిని చూస్తూ.
ఎవరిది సమర్థనీయమో తెలియక తెగ తికమకపడుతున్నాననుకో.నువ్వు కనపడ్డావు కదా.ఇక నా సమస్య తీరినట్లే అన్నాడు ఆనందముగా.
ఏదో ఒక ప్రస్తావన తేకుండా ఉండడుకద ఈ రుద్రుడు అనుకుంటు విస్తుబోయి చూస్తున్నాడు.
తిక్కలోడు వీడు !
తనపధ్ధతినిమార్చుకోడుఅనుకున్నాడుసాధకుడు.
చెక్కుతాను వీడిని పధ్ధతిగా అనుకున్నాడు రుద్రుడు.
( ఎంతైనా స్థపతి కద)
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
రేపు శివానుగ్రహముతో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment