మీఢుష్టమ శివతమ-13.
**********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడుకానివాడు రుద్రుని దర్శింపలేడు.దయను పొందలేడు.
అమ్మో రుద్రా! నువ్వెంత గడుసరివి.నేరుగానీవు నాతో చెబితే ఎక్కడ కాదంటానేమోనని,నా కన్నుకు కట్టు వేస్తూ,మొత్తానికి నిన్ననాచే మట్టి గొప్పదని గట్టిగానే ఒప్పించావు.
ఆలయములో నుండి అత్యంత మధురముగా,
" నమః ఉర్వర్యాయచ-ఖల్యాయచ" అని వినిపిస్తోంది.
పంటలతో-ధాన్యముతో నిండియున్నా భూమిగా-దానిలోని ధాన్యముగా నుండియున్నావాడు అని.
కాని ఇప్పుడేమో ఒకటే క్షామము.ఎక్కడి ధాన్యరాశులు?ఏమాయిపోయాయి?
అడుగుతున్నారు భాగవతారుని అసహనముగా భక్తులు.
ఏమయినాయంటే పరమాత్మ ఎందుకో,
" వర్షాయచ-అవర్షాయచ" గా తన రూపమును మార్చుకున్నాడు.వర్షపుజలాలను సముద్రజలముగా మార్చివేసాడు.అందుకు.అందులోను ఏదో పరమార్థము దాగిఉంటుంది అంటూ ఏదో చెప్పబోతున్నాడు
.
చిర్రెత్తుకొచ్చింది సాధకుని.నేరుగా ఆలయములోని వెళ్ళాడు.సూటిగా చురకత్తి చూపులతో నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను.రోజుకొక మాట చెబుతారు.దానికి మీరు చెప్పే వివరణ క్షణ-క్షణము పరీక్షలనే మిగులుస్తున్నది.
బిత్తరపోయి చూస్తున్నాడు భాగవతారు.తత్తరపాటుతో ధైర్యమును కూడతీసుకొని ప్రత్యుత్తరమీయబోయాడు.
ఇకచాలు మీ హితోక్తులు.నా సందేహమును తీర్చకుంటే మిమ్మలిని ఇక్కడ నుండి కదలనిచ్చేదేలేదు అంటూ,
అక్కడున్నవారివంక చూస్తూ,
అయ్యలారా!
ఈ పెద్దమనిషి నిన్నగాక మొన్న పరమాత్మ నివాసమును గురించి చెబుతానంటు,
" నమ స్సోభ్యాయచ-ప్రతిసర్యాయచ" అన్నాడు.
పైగా,స ఉభయ అనగా పాపము-పుణ్యము అను రెండు మిళితమై యున్న/పాప-పుణ్యములు సమానముగా వర్తించుచున్న మన,అదే మన మనుష్యలోకమునందుంటాడట.అదే కనుక నిజమైతే,
ఆకలిదప్పులతో అందరిని అలమటించేటట్లు చేస్తాడా? ఆహారమును అందరికి పంచకుండా,తాను మాత్రము నిత్య నైవేద్యములతో ....అంటూ అటుచూడగానే భాగవతారు అక్కడ బ్రహ్మాండముగా
ఆరగింపులను సమర్పిస్తున్నాడు.
వేదికపై వేడుకగా వేవేల వెలుగులతో కూర్చుని
వేదపఠనమును చేస్తున్నాడు రుద్రుడు.
ఒళ్ళు జలదరింపుతో నున్నాడు సాధకుడు.
ముళ్ళు జరిపేయాలనుకున్నాడు రుద్రుడు.
కదిలేవన్నీ కథలు-కదిలించేది కరుణ.
అణువు-అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment