మీఢుష్టమ శివతమ-17
*************************
నన్ను వదిలి వెళ్ళిపోకయా-కైలాసవాసా
నన్ను వదిలి వెళ్ళిపోకు కన్నతండ్రి నీవు కాద
నన్ను వదిలి వెళ్ళిపోకయా.
రుద్రా! ఇంట్లోపిల్లలు ఒకటే హడావిడి చేస్తున్నారు.ఇవ్వాళ ఉపాధ్యాయ దినోత్సవమట.
రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ,వారు ప్రస్తుత ఉపాధ్యాయులను శ్రోతలు-ప్రేక్షకులను చేసి,వారు ఉపాధ్యాయులై ప్రవర్తిస్తారట.వింటుంటేనే వింతగా ఉంది.
మనిద్దరము వెళ్ళి చూసి వద్దామా?ఆశగా అడిగాడు రుద్రుని సాధకుడు.
( ఎక్కడ పారిపోతాడో-పక్కనే కూర్చోపెట్టుకుంటే పోలా)
మక్కువగా పిలుస్తున్నాడు.వెళ్ళి పక్కన కూర్చుంటే పోలా అనుకున్నాడు రుద్రుడు.
ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.
" శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షిణాంగే వహంతం
నాగం పాశంచ ఘంటాం డమరుక సహితం చాంకుశం వామభాగే
నానాలంకారదీప్తం స్పటిక మణినిభం పార్వతీశం నమామి."
ఒక విధ్యార్థిని వచ్చి సభకు నమస్కరించి,మొదటగ మనము "యజ్ఞం" సినిమా నిర్మాత-దర్శకుడు ఇంద్రగారితో మాటా-మంతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.( పరిచయము అవసరములేని వ్యక్తి) వెనుక నుండి వినిపిస్తున్నది.)
ఆలస్యములేకుండా తెరను పైకెత్తారు.
ఒక వాక్చమత్కారము, వినయ సంపద కలిగిన విద్యార్థి,పూలగుచ్చమునిచ్చి,సాదర నమస్కారములతో ఆహ్వానించింది వారిని.
" నమో అగ్రియాయచ-ప్రథమాయచ."
మొదటినుండి నున్నవాడు-ప్రముఖుడైన రుద్రునకు నమస్కారములు.
చాలా ఠీవిగా ఆమెకు-సభకు ప్రతి నమస్కారము చేస్తు మరికొంతమందిని తన వెంట తీసుకుని వచ్చి-వారిని తన యజ్ఞ సినిమా భాగస్వామ్యులుగా పరిచయము చేసాడు..
అందరు అక్కడున్న ఆసనములై కూర్చున్నారు
.
పక్కకు తిరిగి చూసుకుంటున్నాడు సాధకుడు రుద్రుని.
" నమః సహమానాయ."
తనకంటె వ్యతిరిక్తముగా భావించు ( తనను ఇంకా నమ్మలేని)సాధకుని సమస్తమును లోబరచుకొను రుద్రునకు నమస్కారము.
చక్కటి రూపము కదా అతనిది అన్నాడు రుద్రుడు సాధకునితో.
నచ్చినట్లుంది.ఎక్కడికి పోడులే స్థిమిత పడ్ద మనసుతో తిలకించసాగాడు.
" నమస్తిష్ఠభ్యో ధావద్భ్యశ్చవో నమః"
నిలుచున్న-పరుగెత్తుచున్న -అనగా పరిపరి విధములుగా పరుగుతీయు మనసును నియంత్రించు రుద్రునకు నమస్కారము.
ప్రశ్న పారంభమైనది అత్యంతాసక్తికరముగా.
అందరు మీకు అగ్రతాంబూలం అంటున్నారు.అదెంతవరకు నిజం? దీనిని మీరు సమర్థిస్తారా? ఖండిస్తారా?
సభ అనుమతితో మీ ప్రశ్నకు సమాధానము చివరికి చెప్పుకుందాము.అని జవాబు వచ్చింది గంభీరముగా.
ఇది మా తొలిప్రయత్నము కనుక సాధారణ ప్రశ్నలతోనే సంభాషణను కొనసాగిద్దాము.
అయ్యా! మీ అసలు పేరు ఇంద్ర యేనా లేక సినీపరిశ్రమకు వచ్చినప్పుడు పెట్టుకున్నదా?
ప్రసన్నముగా ప్రారంభించాడు తన జవాబును జనాలవంక చూస్తూ.
అమ్మా నాన్న పెట్టినపేరు మహేశ్వర-ఈ రంగానికి రమ్మని ప్రోత్సహించి-ఆశీర్వదించిన నాకు అత్యంత గౌరవనీయులైన వ్యక్తి నన్ను మహేంద్ర గా మార్చారు.
నమో ధృష్ణవేచ ప్రమృశాయచ.
పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించేటప్పుడు ఇంద్రుడుగా కీర్తింపబడతారని,
అటువంటి సౌభాగ్యమును నానుండి ఆశిస్తూ ఇంద్ర గా నన్ను పరిచయముచేసారు.,
సమిష్టికృషి సమర్థవంతనీయము అను సూక్తిని నమ్మిన నేను ,నా యజ్ఞం సినిమా భాగస్వాములందరికి సమాన గౌరవములను అందించు పధ్ధతి నన్ను వారిని మీకు పరిచయము చేస్తున్నది,అంటూ వారి వైపు తిరిగాడు.
ఇంతలోనే పక్కతరగతి పిల్లలు వారి తరగతికి ఆహ్వానించటానికి వచ్చారు.
కుడి-ఎడమల సూర్యచంద్రులను కూడి కదిలినాడు ఇంద్రుడు పక్క తరగతిలోనికి.
కన్నులు తిప్పుకోలేక పోతున్నారు ప్రేక్షకులు.
అభద్రతా భావము తొలగినది సాధకునికి.
ఆశీర్వచన భావము కలిగినది రుద్రునికి.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment