మీఢుష్టమ శివతమ-04
*****************
మీడుష్టమ శివతమ-04
***********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవించలేడు.
సాధకునికి రుద్రునిదయతో ఆకలిబాధలేదు.ఆరోగ్య సమస్యలులేవు.ఆనందముగా తనపని తాను చేసుకోవచ్చును కడా.రుద్రుడు వానిని గెలిపించటానికి ఆడిస్తున్నాడు.
అంతే.
వాడికి వాడి ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే ఆలోచన వచ్చింది.బయలుదేరాడు అడిగినవారికి/అడగని వారికి రుద్రుడు-వాడు సంభాషించుకోవడము,తాను వరములను అడగటము,రుద్రుడు అనుగ్రహించటము నొక్కి నొక్కి చెప్పసాగాడు.
విన్నవాడు అసూయనిండిన కళ్ళతో అలాగా అన్నాడు.ఎదురింటి వాడు ఎగతాళిగా నవ్వాడు.పక్కింటివాడి నావి ఎకసక్కెపు మాటలంటున్నాడు.పార్కులో కలిసినవాడయితే మరీ విడ్డూరం.అసలు లెక్కచేయటమే లేదు.వాడి పక్కవాడు పోరా పొమ్మంటు ఉరిమిఉరిమి చూస్తున్నాడు,చేసేదిలేక నిరాశగా ఇంటికివచ్చాడు.సాధకుడు.
చింతాక్రాంతుడయ్యాడు.ఎంత కుత్సితులు వీళ్ళు.
మరీ నాపై ఇంత మాత్సర్యమా.రానీ రుద్రుని.కానిస్తాను వీళ్ళపని అనుకుంటుండంగానే చెంతనే నిలిచాడు రుద్రుడు.
గత అనుభమములలో మునిగి గమనించనేలేదు సాధకుడు.పనిజరగాలంటే పలుకరించాలికదా! అనుకొని రుద్రుడు అంతా సుభిక్షమే కదా! సంపూర్ణారోగ్యమేకదా అన్నాడు , సాధకుని బహిర్ముఖుని చేస్తూ.
రుద్రుని చూడగానే సంతోషముతో వెలిగిపోతున్నాడు.రుద్రా! నీకీ విషయము తెలుసా? అంటు ఆగాడు.
ఏ విషయమయ్య! ఏమి తెలియనివాడిలా అడిగాడు.మన సంభాషణలను-సంతోషమును-సంపదలను చూసి ఇక్కడి వాళ్ళు ఈసుతో ఓర్వలేకపోతున్నారు.నేరుగా మాటల్లోనే చెబుతున్నారయ్యా అన్నాడు ఆదుకుంటాడని.
అలాగా! అయితే ఇంక నేను రానులే అన్నాడు రుద్రుడు.
అంతే.అయోమయములో పడ్డాడు సాధకుడు.
అంతలోనే తేరుకొని, అదేమిటి రుద్రా! అలా అంటావు.
వస్తుంటావు-ఇస్తుంటావు-పోతుంటావు.ఇప్పుడేమో రానేరానంటున్నావు.ఇంతపిరికివాడివా నువ్వు.నా వైపుండి వారి సంగతి చూస్తావనుకున్నాను.నువ్వేమో ఇలా..అంటు మూతిని ముడిచాడు ముద్దుగా.
ముగ్ధుడైనాడు రుద్రుడు.మాటాడబోతున్నాడు.మౌనముగా ఉంటున్నాడు
.తటపటాయిస్తున్నాడు.వారిని తప్పిస్తానంటున్నాడు.కాని....కాని
కాని ఏమిటయ్య కాదా నీతో కస్సుమన్నాడు సాధకుడు.లెస్స పలికాడు రుద్రుడు.
నాకు వారెవరో తెలియదుకదా.అందుకు నీ మిత్రులు
ఎవరో/మిత్రులు కానివారెవరో పట్టికచేసి నేను మళ్ళీవచ్చేటప్పటికల్లా తయారుచేయి అనిచెప్పి తరలిపోయాడు రుద్రుడు.
ఆ పనిలో పడ్డాడు సాధకుడు.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
.
*******
No comments:
Post a Comment