మీఢుష్టమ శివతమ-03
************************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవింపలేడు.
తింటున్నాడు.తిరుగుతున్నాడు.ధనముతో కావలిసినవి కొనుగోలు చేసుకుంటున్నాడు.సాధననే మరిచాడు.రోజురోజుకి వాడి జీర్ణశక్తి తగ్గుతోంది.శరీర రుగ్మతలు చోటుచేసుకున్నాయి.ఒకసారి జ్వరము-మరొకసారి జలుబు-కడుపునొప్పి-కాలునొప్పి శరీరము సహకరించటములేదు.అన్నీ ఇస్తాను అంటూ నన్నే మోసముచేస్తావా రుద్రా! అంటూ ఎన్నో దుర్భాషలాడసాగాడు.సహనము నశిస్తోంది సహకారము దూరము కాగానే.
ఇదియే కదా రుద్రుని కావలిసినది కూడా.ఆలస్యము చేయకుండా సాధకుని అందుబాటులోనికి వచ్చాడు.మందహాసముతో క్షేమమడిగాడు.
ఎంతటి వాక్చాతుర్యము.వరములనిస్తాడు.వానితో పాటుగ కలవరమును కూడా ఇస్తాడు.కపటవేషధారి గొణుక్కుంటున్నాడు తనలో తాను .
ఏమయ్యా సాధకా! ఏమీ వద్దా.సరే మరి అంటూ కదలబోయాడు రుద్రుడు.
తోకతొక్కిన తాచులా బుసలుకొడుతూ మా మంచివాడివే.నన్ను చూస్తే నీకు తెలియటంలేదా? శరీర రుగ్మతలు నన్నెంత బాధిస్తున్నాయో.దానికి తోడు ఊరంతా దీర్ఘవ్యాధులు ప్రబలుతున్నాయి.నీ ఏమి పట్టనట్లుంటావు ఎదురుగానే చూస్తూ.
అర్థమయ్యింది అసలువిషయము.అయినా అమాయకంగా సాధకునితో అదేమిటయ్యా అలా అంటావు.నీవడిగినవన్ని అనుగ్రహించానుకదా.నీకు నేనేమి తక్కువ చేసానని ఈ నిష్ఠూరాలు,నీవే చెప్పు అన్నాడు రుద్రుడు.
అదేనయ్యా నీ చమత్కారము.నేనడిగినవి ఇచ్చి వెళ్ళిపోయావు.వాటి పరిణామాలు-పరిష్కారాలు నాకు తెలియకుండా చేసావు.అది కాదురా అబ్బాయి ఇలా అన్ని తింటు ఉంటే అజీర్ణము, అనేక ఇబ్బందులు వస్తాయి నన్ను హెచ్చరించలేదు.వీడి తిప్పలు వీడు పదనీ అనుకుంటు ఇచ్చినట్లే ఇచ్చి చల్లగా జారుకున్నావు పిల్లిలా చప్పుడు చేయకుండా.
సరేలే ఇప్పుడు నీ ఎదురుగానేఉన్ననుకడా.ఆలస్యముచేయకుండా అడుగు.అనుగ్రహిస్తాను అన్నడు రుద్రుడు.
వినబడుతోంది రుద్రము ఆలయము నుండి సాధకునికీనుగుణముగా,
"అయక్ష్మంచమే-అనామయశ్చమే" అంటూ,అర్థమును స్పురింపచేస్తున్నాడు వానికి రుద్రుడు అలవోకగా.
.
అదేనయ్యా చిన్నచిన్న శరీరరుగ్మతలు నా దరిచేరకూడదు.
కనుక-అనామయశ్చమే.
అంతేకాదు దీర్ఘకాలిక ప్రమాదకరమైన అనారోగ్యములు నన్ను సమీపించకూడదు.కనుక. "అయక్ష్మంచమే".అడగలేదనేగా వాటిని నాకు నీవు అనుగ్రహించలేదు ఆరోపించాడు తప్పును రుద్రునిపై.
నీకు వాటి అవసరములేదనుకున్నానయ్య.ఇప్పుడు అడిగావుగా.అందిస్తానులే వాటిని.
నేను వెళ్ళేముందు మరొక్కసారి చెబుతున్నాను.బాగా ఆలోచించు.ఇవేనా/వీటికి తోడుగా ఇంకేమైనా కావాలా?ప్రశ్నించాడు రుద్రుడు,చిలిపిగా.
ఎందుకైనా మంచిది.నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను కదా అంటాడు.కనుక ముందుచూపుతో మరికొన్ని అడిగేస్తాను తనను తానే మెచ్చుకుంటున్నాడు సాధకుడు.
కాని పైకి మాత్రము
ఇవి ఎలా సరిపోతాయయ్యా? అనుభవమైనదిగాను.అడుగుతాను ఇంకా నిన్ను రెండు వరములు.అనుగ్రహించు అర్థించాడు సాధకుడు.
మెండైన ప్రీతితో నిండైన కరుణతో నిలబడ్డాడు రుద్రుడు.
ఒకవేళ నా ప్రారబ్దము ప్రకారము రుగ్మతలు నన్ను చేరినాయే అనుకో వాటిని పోగొట్టుకొనుటకు ఔషధములు కావాలి కనుక-"జీవాతుశ్చమే" అని అడుగుతున్నాను
తథాస్తు-లభించుగాక అంటున్నాడు రుద్రుడు.
అయినా నిన్ని నమ్మకూడదు.రోగమిస్తావు-అది తగ్గేందుకు మందులిస్తావు.అమ్మయ్య ఆరోగ్యాంగానే ఉన్నామనుకునేలోపుల వాడిని పంపిస్తావు పట్టుకురమ్మని.
అయ్యో! అయ్యో! ఎంతమాటన్నావయ్యా! అంత దయలేనివాడినా నేను చెప్పు? అన్నాడు రుద్రుడు .
అయినా అవన్నీ నాకెందుకులే.కావలిసినది అడుగుతున్నాను.కాదనకు అంటూ,
.వ్యాధి నయమైనప్పటికిని ,అపమృత్యువు లేకుండా దీర్ఘాయువు కావాలి అంటూ ప్రార్థిస్తున్నాడు సాధకుడు.
తనతెలివికి పొంగిపోతున్నాడు సాధకుడు.
తథాస్తు అంటు పయనమయ్యాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment