PRAPASYANTEE MAATAA-08

ప్రపశ్యంతీ మాతా-08 ******************** యాదేవి సర్వభూతేషు బగలముఖి రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః సమ్మోహనము-సంస్తంభనము అను విరుధ్ధకార్యముల విశేష అనుగ్రహమే బగలముఖి మాత.బగల అను పదమునకు వధువు,తాడు అను అర్థములను పెద్దలు చెబుతారు.ఏ విధముగా పాశముతో తన భక్తులను రక్షిస్తూ,పశుపతిగా పరమాత్మ కీర్తింపబడుతున్నాడో.అదేవిధముగా తల్లి సమ్మోహనపరచి తన పిల్లలను నొచ్చుకొనునట్లుచేయువారి వాక్కును స్తంభింపచేస్తుంది.విజ్ఞానశాస్త్ర పరముగా ఆలోచిస్తే,ఈ దేవి శబ్ద-కాంతుల సమన్వయమును చేస్తూ, శిష్ట రక్షణ-దుష్ట శిక్షణ గావిస్తూ,ధర్మసంస్థాపనను చేస్తుంది. స్థూలముగా ఆలోచిస్తే పరాశక్తి విశ్వపాలనకై ఉత్కృష్ట స్థూల రూపముగా ఉర్వి నిండి ఉండగలగు. జ్ఞానుల కొరకు నిరాకారముగా,అజ్ఞానులమీద కరుణతో సాకారముగా ప్రకటింబడుతూ హద్దులు మీరిన అరాచకములను అణచివేస్తూ,వాటిని సత్కర్మలుగా మలుస్తూ,ప్రకృతిని సస్యశ్యామలము చేస్తుంది.ఉదాహరణకు పంచభూతములలోని జలము ఉదృతమై చెలియలి కట్తను తెంచుకొని వరదలై పంటభూములను ధ్వంసముచేస్తుంటే,తల్లి తన తాడుతో ఆ నీటిఉద్రిక్తతను ఆనకట్తలవైపునకు మళ్ళించి పంటభూములకు మరింత సాయపడుతుంది.దు...