Saturday, June 24, 2017

దేశభక్తి పాట

దేశ భక్తి పాట  

 భలె భలె సంబరం
 దిగి రాగా అంబరం
 కలిమితో,చెలిమితో
 కదిలేలా నవతరం..2.
.......
 నాడూ నేడూ ఏనాడు
 చూడు దేశం బాగోగు..2..
....
 కులములు మతములు వదిలేసి తెలివిగా హే హే
 మనసులు మమతలు జతచేసి బలముగ
...
 సాగు అదరక బెదరక ఎదురుగ నిలబడి
 చూడగ దేశము వేడుక ఆదే ఆత..భలె..
........
 నేనూ నీవూ మీరంత
 కాగా దేశం బాగోగు.2.
.....
 కలతలు,కపటము వదిలేసి తెలివిగ హే హే
 ప్రతిభలు పనితనం జతచేసి బలముగ
.....
సాగు అలసట ఎరుగక ముసిముసి నగవుల
భరత మాతను చూదగ రాజా బాట .భలె..

ఎగురుతోంది పతాక

69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
దేశ విదేశాలలో దేదీప్య మానముగా
ఎల్లలే ఎరుగని అల్లరి చల్లని తల్లిగా
పాప బోసినవ్వులా పరిమళపు పువ్వులా
ఏలిక సంకేతముగా ఎగురుతోంది పతాక
......
కమ్ముకున్న చీకట్లకు కమ్మని వేకువగా
కలవరపు ఇక్కట్లకు చెల్లింపు సంతకముగా
నింగికెగురు గువ్వలా నినదించు మువ్వలా
ఏరువాకగా మారి ఎగురుతోంది పతాక
.......
జనగణమన మన గళముగ జనగణముల మంగళముగా
జై కిసాన్ పొలముగా జై జవాన్ బలముగా
తెలుగింటి అమ్మాయిగా వెలుగుచిమ్ము కొమ్మగా
ఎగురుతోంది పతాక ఎద నిండిన ప్రియ గీతిక
.........
అమ్మ లార రండి రండి అయ్యలార రారండి
పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి
శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకిం చంద్ర చటర్జీ
ఠాగూరు,ఇక్బాలు ఎందరో దేశ భక్తులు
........
తిలకిస్తున్నారు తన్మయత్వముతో తీరైన పండుగను
దేశ భక్తి గీతాలను ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో
దేశాభివృద్ధి చేతలను ఆశీర్వదిస్తారు ఆనంద హృదయముతో
మనల చేరు వాత్సల్యము మహి స్వర్గ తుల్యము

svaatantrya dinoetsavamu

70 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
********************************************
శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా
చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక.
అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము
భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ
"తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను
కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు."
బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు
తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా
"వందేం అహింసా పరమో ధర్మ:" అను
శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".
పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ
కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా
"సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను
పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు."
నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో
వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో
ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో
జనగణమన గళముతో జనగణముల మంగళముతో
"జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో
కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో
ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక.
అమ్మలార రండి రండి-అయ్యలార రారండి
పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి
శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ
శ్రీ రవీంద్ర నాథుడు, శ్రీ మహమ్మద్ ఇక్బాలు
ఎందరో మహనీయులు కొలువుదీరి ఉన్నారు
"70 వ స్వాతంత్ర జెండాను ఎగురవేద్దాము
అజెండాను తిరిగి వ్రాద్దాము
దేశభక్తి గీతాలను ఆలపిస్తుంటే వారు
ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో
దేశభక్తి చేతలను ఆచరిస్తుంటే వారు
ఆశీర్వదిస్తారు హర్షాతిరేకముతో.
జైహింద్

August-15

సాహో స్వాతంత్రమా ! జయహో గణతంత్రమా!
******************************************
శ్రీ అంబేడ్కర్ అందించిన అద్భుత అభంగమా
భారత రాజ్యాంగమను భవితవ్యపు మంత్రాంగమా
అణువణువున గణగణమని జనగణమన పాడుతుంటే
సాహో స్వాతంత్రమా ! జయహో గణతంత్రమా!
అల్లూరి వీరత్వము _ ఆనందుని వివేకము
కలనేతగ నేసినది ఆ కాషాయపు రంగు
ఆ గాంధీ ఆశయాలు _ ఆ థెరెసా ఆచరణలను
మగ్గముపై నేసినది మధ్యనున్న తెలుపు రంగు
పంచ భూతములు శుచిగ- పంచ భక్ష్య రుచులుగ
పల్లెరైతు నేసినది ఆ ఆకుపచ్చ రంగు
ఇరవై నాలుగు ఆకులు -ఇరవై నాలుగు గంటలు
నీలివృత్త నృత్యము నిరంతర ప్రయత్నము
ఆకులన్ని సమానము వ్యాకులతా నిర్మూలనము
ధర్మపు నడిబొడ్డు చూడు అశోక ధర్మచక్రము
నేతల చాతుర్యమనే నేతగల మన పతాక
ఉయ్యాల-జంపాల నేల-నింగి ఊగుతుంటే
ప్రగతికి ప్రతీకగా పైపైకి ఎగురుతుంటే
గణనీయము కాదా మన గణతంత్ర దినోత్సవము.
జైహింద్.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...