పాశురము-16
***********
హరి
"నీవేకావాలంటున్నది ప్రతితలపు
నీవెవరవంటున్నది ప్రతి తలుపు"
ఆ తలుపు
1 అష్టాక్షరి-ప్రణవము ఒక రెక్క-మంత్రశేషము మరొకటి
2.ద్వయి మంత్రము-పూర్వ ఖండము ఒక రెక్క-ఉత్తరఖండము మరొకటి
3.చరమశ్లోకము-పూర్వార్థము ఒక రెక్క-ఉత్తరార్థము మరొకటి.
ఆ తలుపు "నేశన్నిలైకడవం-గట్టుగా బిగించబడిన గడియను కలిగిఉంది.అన్వయప్రధానమైన
ఆ తలుపునకు "ఆచార్యసిద్ధి" అను గడియవేసిఉన్నది.దానిని తెరచుశక్తి" ఆచార్య సమాశ్రణమే" కలిగియున్నది.
"ఉన్నిమీషతి-అథోనిమీషతి" భగవాన్ అన్న ఆర్యోక్తిని సవరిస్తూ "ఆచార్యాన్ సర్వం ఉన్నిమీషతి"
బుద్ధి కర్మానుసారిణి -కర్మఫలితములను అనుభవించుటకు తగిన బుద్ధులను ప్రసాదించువాడు భగవంతుడైతే,బుద్ధులను సవరించి ఉద్ధరించువాడు ఆచార్యుడు
అన్న ఆచార్యవైభవ ప్రస్తావనమును తెలిపిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ.అనుగ్రహించినంతమేరకు అనుసంధానమును చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ
కోయిల్ కాప్పానే కొడితోన్రుం తోరణ
వాశల్ కాప్పానేమణిక్కదవం తాళ్తిరవాయ్
ఆయర్ శిరుమియరో ముక్కు అరైపరై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరిందాన్
తూయోమాయ్ వందోం తుయల్ ఎళుప్పాడువాన్
వాయాల్ మున్న మున్నం మాట్రారేఅమ్మ నీ
నేశన్నిలై కదవం నీక్కేలో రెంబావాయ్.
స్వామి నిత్యప్రత్యక్షసేవాసౌభాగ్యమును పొందిన ధన్యులు నిత్యసూరిగణము.వారి స్వామి ప్రకతింపబడుచున్న అవతారముతో పాటుగా వారును వివిధ ఉపాధులలో ప్రకటనమగుతూ,పరమాత్మనే ఉపాయముగా సేవిస్తూ తిరిగి పరమాత్మతో పాటు తరలిపోయెదరు.అట్టి ద్వారపాలకుని,నందగోపాలుని,వారున్న దివ్యదేశమును,దానికి ఉన్న ప్రాకారమును-ప్రాసాదమును,వాటిని కావలి కాస్తున్న ద్వారశేషులను వారితో పరిశుద్ధులై వచ్చినవారి వినయపూర్వక సంభాషణమును గోదమ్మ వివరిస్తున్నది.మర్యాదగానే వారిని,
వాయాల్ మున్న మున్నం మాట్రారేఅమ్మ -మాటి మాటికి లోనికి పోనివ్వమని మమ్ములను అడ్దగించకండి అని చెప్పుచున్నది.
గోదమ్మతో సహా గోపికలు శ్రీకృష్ణుడు నిన్ననే వారికి అనుగ్రహిస్తానన్న "పర" అను వాయిద్యమును స్వీకరించుటకు,తూయోమాయ్-పరిశుభ్రులై,జితేంద్రియులై వచ్చి,
వారి నాయగనాయ్-నాయకుడైన
నందగోపన్ కోయిల్-నందగోపుని ఇంటి ముంగిట
అరై-పరై-అనుగ్రహిస్తానన్న పఱను
నోమునకు తీసుకువెళ్లుటకు
నిన్ర-నిలబడియున్నామని చెప్పారు
వారి ప్రాకారద్వారము -కోయిల్ కాప్పానే- దగ్గర ఇద్దరు ద్వారపాలకులున్నారు.బాహ్యమునకు సంబంధించినది.
భవనము మీద కట్టీణా కేతనము పరాక్రమమును చాటుతూ ఎగురుచున్నది.భగవత్తత్త్వ ప్రతీకగా వారిని అక్కడికి చేర్చినది.
కొంచము బ్రతిమిలాడగనే కావలివారు వీరిని,
ఆయర్ శిరుమియరో ముక్కు-ముక్కుపచ్చలారని గొల్లపడుచులని లోనికి ప్రవేశించుటకు అనుమతించారు.
వీరు బాహ్యరుగ్మతలను విడిచిన పరిశుద్ధులు కనుక బాహ్యద్వారా-ప్రాకార ద్వార ప్రవేశము లభించినది.
కాని అక్కడ వారికి మరియొక తలుపు కనిపించినది.దాని గడప అత్యంత మనోహరముగా ఉన్నది
.తలుపువైన కళాత్మకముగా చెక్కిన తోరణ శిల్పములు మరింత ఆకర్షణీయముగా నున్నది.గడియ సంగతి సరేసరి.మణులతో మెరిసిపోతు గట్టిగా బిగించియున్నది.దానిని కావలి కాస్తున్న-వాశల్ కాప్పానే - ద్వారశేషులు సామాన్యులు కారు.
వీరిని శీఘ్రముగా లోనికి అనుమతించలేదు.దానికి కారణము అది నందగోపుని మందిరము.మనస్వామి ఉంటున్న దివ్యదేశము.అసలు నందుడు-అనవచ్చుగా,లేదా నందప్రభువు అనవచ్చుగా
కాని గోదమ్మ నందగోపన్ నాయగనై అని సంబోధించినది.ఇది ఒక సంకేత నామము.
1.ఆనందకారకుడైన గోవిందుని గోప్యతను రక్షించువాడు.
2.బ్రహ్మవాక్యముగా గోకులమున జన్మించి శ్రీకృష్ణునిచే తండ్రిగా సేవింపబడుతున్న పుణ్యాత్ముడు.
2.అనవరతము బ్రహ్మానందములో రమించుచు,బాహ్యమునకు గోకులనాయకుడిగా ధర్మరక్షణమును గావించువాడు.
ఈ భవనము మణిమయము.తలుపు మణిమయము.గడియ మణిమయము.
బాహ్యబంధములు విడినంతమాత్రమున సరికాదు.బాహ్యాకర్షణలను సైతము జయించి భగవత్తత్త్వమునకై తపించుచుండాలి.మణుల భ్రాంతిని అధిగమించి మనసు మణివర్ణునిపై మరలగలగాలి.
మొదటిది-స్వయం ప్రకాశకత్వము.
రెండవది సర్వ ప్రసాద గుణత్వము.స్వామి వైభవమని గుర్తించగలగాలి.భావబంధములు సైతము దూరమయిన నాడే భాగవదనుగ్రహమును పొందగలము.
ప్రస్తుత పాశురములో గోపికలు పఱను తీసుకు వెళ్ళుటకు వచ్చామన్నారు.అది బాహ్యము.కనుక ద్వారపాలకులు అనుమతించలేదు.
రవ్వంత బాహ్యము వీడిపోయినది.వారిని/మనలను వీడవలసినది భావ బంధములు.అదియును వీడినది కనుకనే పఱ ప్రస్తావనను మరచి,
తుయల్ ఎళుప్పాడువాన్-స్వామి నిద్రావైభవమును వీక్షిస్తూ,సుప్రభాతమును పాడుటకు వచ్చామని అడ్డుపెట్టవద్దని ,అనుమతించమని అర్థిస్తున్నది గోదమ్మ.ఆచార్యానుగ్రహమనే గడియను తెరిచే ఉపాయముతో స్వామి రూప గు ణ లీలా విశేషములనుమాయాన్-మణివణ్ణన్- మమ్ములను అనుగ్రహించు స్వామిఅనుటకై, క్షేత్రపాలకుని సేవించి అనుమతిని పొంది వారిని దర్శించుటకు
,గోపికలతో పాటుగా మనలను తీసుకుని వెళుతున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం