ALO REMBAVAY-26

ఇరువది ఆరవ పాశురం ********************* మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్ మేలైయార్ సేవననగళ్ వేండువన కేట్టియేన్ ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు డయనవే శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే, కోళ విళక్కే,కొడియే,వితానమే ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్! " వనమాలి గదీశార్ఞీ శంఖీ చక్రీచ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు." ఆశ్రిత వాత్సల్య ఫలప్రదాయనమః ***************************** స్వామి అనుగ్రహముతో గోదమ్మతో పాటుగా వ్రతమును చేయుచున్న గోపికలు సామీప్య సంభాషణ భాగ్యమును పొందినారు.వారి మనసులు స్వామితో సారూప్యతకై ఎదురుచున్నవి. కనుకనే వారు మీకు పఱ కావాల/నేను మీ వ్రతమునకు రావాలా? అని ప్రశ్నించి ,నేను వస్తుంటే మీకు పఱతోఏమిపని? అని అనగానే వారు వినయముతో మీరు మా నోమును ఆవిష్కరించుట ఆనందదాయకము. మా పెద్దలు ఈ నోమును తాము నోచుకొనుట వలననె, మేలైయార్ సేవనగళ్-వర్షములను పొంది సుభిక్షువులై యున్నారని చెప్పగా...