శ్రీ మాత్రే నమః
గం గణపతియే నమః
****************
అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ దయతో,
'దేవు ఖడ్గమాల స్తోత్రము" శుద్ధసక్తి మహామాల" అంటే ఏమిటి?తెలుసుకోవాలనే జిజ్ఞాసను నాలో అంకురింపచేసిన ఆ అమ్మయే"అమ్మ దయ ఉంటేఅన్నె ఉన్నట్లే" అన్న నానుడిని మరొకసారినిరూపిస్తూ,నాచేతిని పట్టుకుని,నన్నొకకలముగా మలచుకొని తన దివ్యమహిమానుభవములను తానే తెలియచేస్తుందన్న ప్రగాఢ విశ్వాసముతో అమ్మను ప్రార్థిస్తూ,అడుగులను కదుపుదాము.
"Yఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః"
ఖడ్గమాల అంటే ఏమిటి?
ఖండించగలిగే శక్తికల ఆయుధము ఖడ్గము.అజ్ఞానమును-అధర్మమును-అయోమయమును ఖండించకలిగేది.అదే అమ్మానుగ్రహము.అమ్మ అనుగ్రహమును వివరముగా తెలియచేయు స్తోత్రము
" దేవిఖడ్గమాలస్తోత్రము.
మూలశక్తితో పాటుగా నున్న పరివారశక్తులను తెలిసికుని,వారిప్రాముఖ్యమును సైతము గుర్తించి,ఆరాధించు అర్చనావిధానమును తెలియచేయు స్తోత్రము"దేవిఖడ్గమాల స్తోత్రము."
మనము చర్మచక్షువులతో నేరుగా చూసి తెలిసికోలేని అపరిమిత అనుగ్రహ శక్తులను తెలిసికొనుటకు మార్గదర్శకము "దేవిఖడ్గమాలా స్తోత్రము."
బిందువు ద్వారా సింధువు తత్త్వమును గ్రహించునట్లు మన శరీరములోని శక్తులద్వారా సూక్ష్మ సక్తులద్వారా స్థూలజగతిని పరిచయము చేయించునది"దేవి ఖడ్గమాలాస్తోత్రము."
బురదలో వికసించిన పద్మము వలె తంత్రశాస్త్ర ప్రధానమైన "వామకేశ్వర తంత్రములో"ప్రకాశించుచున్న మహామంత్రము"దేవిఖడ్గమాలా స్తోత్రము."
తొమ్మిది ఆవరనములతో ప్రకాశిస్తున్న మహాకామేశ్వరి/మహా త్రిపుర సుందరి నిత్య నివాసమును నిస్తుల వైభవమును వివరించునది
"దేవి ఖడ్గమాల స్తోత్రము.
ప్రతి స్తోత్రమునకు దేవత దానిని ఆవిష్కరించిన ఋషి,ఛందస్సు,బీజము,శక్తి,కీలకము ఉంటాయి.