Posts

Showing posts from August 20, 2017

USH----GAPCHIP

Image
 ప్రాజ్ఙ్నన్నయ  యుగము నుండి  ప్రస్తుత  సమయము వరకు  పథకాలు తెలుగేనట  పతకాలు  తెలుగుకేనట  తెలిమంచు తెరలనుండి  మలిసంజె గుంకు వరకు  పెదవంచున తెలుగేనట  నయవంచన  తెలుగుకేనట  గుంజలు పాతుట నుండి  గురిగింజలు మాటలతో  పందిళ్ళు తెలుగేనట  సందళ్ళు   తెలుగుకేనట  పోకడలు తెలియువరకు  లోకులు నమ్మే వరకు  మైకులలో  తెలుగేనట  పైకము తెలుగునకేనట  జ్యోతి  ప్రజ్వలనము నుండి  భరత వాక్యము వరకు  ప్రసంగములు  తెలుగేనట  ప్రచారము తెలుగుకేనట  నోరు మాట్లాడుతుంటే  నొసల వెక్కిరింపులేనట  యాసలలో  తెలుగేనట  ఆశలన్ని  తెలుగుభాషకేనట  కూసింతైన వినబడని తెలుగు ఊసు  అమ్మతో చెప్పింది  నమ్మరాని పలుకులని.