Tuesday, October 4, 2022

PAAHIMAAM SREE RAAJARAJESVARI-KRPAAKARI SANKARI.

 


పాహిమాం-పాహిమాం-పాహి పాహి పరమేశ్వరి

 *********************************

 " అజితానామ పాశ్వేతు-దక్షిణేచ అపరాజితా

   శిఖామాద్యోజనీ రక్షత్-ఉమాముద్నిర్ వ్యవస్థితా

   మాలాధరి లలాటేచ-భృవౌ రక్షతు యశస్విని

   త్రినేత్రంచ భృవోర్మధ్యే-యమఘంటాచ నాసికే

   శంఖిణి చక్షుసోర్మధ్యే-శ్రోత్రయోద్వారవాసిని

   కపోలో కాళికా రక్షేత్-కర్ణమూలేతు శాంకరి

   నాసికాయాం సుగంధాచ-ఉత్తరోష్ఠోచ చండికాం

   అధరేచ అమృతకళా-జిహ్వాయాంచ సరస్వతీ

   దంతాం రక్షతు కౌమారీ-కంఠదేశేతు చండికా

    ఘంటికా(కంఠము) చిత్రఘంటాచ-మహామాయంచ తాలుకే

   కామాక్షీ చుబుకం రక్షేత్-వాచం మే సర్వ మ0గళా అంటూ

  బ్రహ్మప్రోక్త దేవీకవచమును భక్తితో పఠిస్తున్న దేవతలను చూసి,పరమేశ్వరి ప్రసన్నయై ఇట్లనెను.

  "రక్షాంసి యత్రోగ్ర విషాశ్చ నాగా

   యత్రారయో దస్యు బలాని యత్రః"

  ఎక్కడెక్కడ రక్కసులు,,విషసర్పములు,శత్రువులు,దొంగలుజనించెదరో,దావానలము జనించునో అప్పుడు నేను కొత్తవతారములతో ప్రకటితమయి కాపాడెదను.


 అంతేకాదు.శ్రద్ధతో వినుడు.

 


 "వైవస్వేంతరే ప్రాప్తే అష్టావింశతిమేయుగే

  శుంభనిశుంభశ్చైవాన్యాత్ వ్యుత్పత్తేతే మహ అసురౌ"


  వైవస్వర మన్వంతరమున ఇరువది ఎనిమిదవ యుగమున ఇప్పటి (హతముచేయబడిన/దుర్గుణములు) వేరొక రూపములో పుట్టబోవుచున్నారు.ఆ సమయమునందు నేను భూమియందు అతిరౌద్రమైన రూపముతో అవతరించి వారిని నమిలివేయుదును.అప్పుడు నా తెల్లని దంతములు దానిమ్మగింజలవర్ణముతో ప్రకాశించును.నేను వారి రక్తమును పానముచేసి"రక్తదంతిక" అను నామముతో కీర్తించబడెదను.

 ఇంకొక విషయము

 నీటిచుక్కలేకుండా భూమిపై నూరేండ్లు అనావృష్టి వచ్చును.అప్పుడు నేను మునుల ప్రార్థనలకు సంతసించి అయోనిజగా ప్రకటింపబడుతూ "శతాక్షి" నామముతో వారిచే కీర్తింపబడెదను.

   ఆ సమయమునందు పంటలు పండకపోవుటచే నేను నాదేహమునుండి అనేకానేక శాకములను ప్రకటింపచేసి,


"శాకంభరి" నామముతో శ్లాఘింపబడెదను.


 దుర్గముడను రాక్షసుని వధించి దుర్గాదేవిగా ప్రసిద్ధికెక్కెదను.


 భీమరూపముతో హిమాలయములందు మునులను రక్షించుటకై సంచరించుచూభీమాక్షి" గా కొలువబడెదను.


 అరుణుడు అను రాక్షసుని వధించి "భ్రామరి"గా భక్తులచే కొలువబడెదను.

 ఇంకా అని చెప్పబోవు వేళ,వారు భక్తితో ,

 త్రిపురసుందరి,శిరోదేవి,శిఖాదేవి,నేత్రదేవి,కవచదేవి,భగమాలిని అంటూ,

"షడంగదేవతాయుక్తా-షాడ్గుణ్య పరిపూరితను,తమ అవయవములలో న్యాసము చేసుకొని, కొలుచువేళ,

   తల్లి మరింత కరుణతో 

 " శరత్కాలే మహాపూజా క్రియతే యాచ వార్షికే

   తస్యాం మమైతన్మహాత్మ్యాం శృత్వా భక్తి సమన్వితా"


 ఏటేటా శరదృతువునందు ఆశ్వయుజమున నన్ను పూజించినా, ఆ కథలు విన్నా,స్మరించినా,(భక్తితో) వారు నా అనుగ్రహమునకు పాత్రులు కాగలరని తెలుపెను.

   సురథునకు-సమాథికి అమ్మ ముందరే అవి రాకుండా/నష్టము కాకుండా చేయవచ్చును కదా అను సంశయము కలిగినది.

 దానిని గ్రహించిన సుమేథుడు అమ్మ ఆజ్ఞను పాటించిన మిగిలిన అసురులు పాతాళమునకు పోయి సుఖశాంతులతో నుండిరి.

   అమ్మ తానను నిత్య అయినప్పటికిని పలుమారులు పలురూపములతో అసుర 

 ఉపాధులను-అమర ఉపాధులను సృష్టించి వాటి మధ్య త్రిగుణములను అరిషడ్వర్గములతో జతచేసి ఆడించుట ఆమె పంచకృత్యములలోనిఒక పార్శ్వము.


" సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా"

తాను సాక్షిగా అన్నింటిని చూస్తూ,విద్వేషములను సృష్టిస్తూ,విశ్లేషణలను వివరిస్తూ లీలా వినోదిని జగత్పరిపాలన/ ఆటలాడిస్తూ,అల్లాడిస్తూ,ఆదుకుంటూ జరిపే నిరంతర హేలయే ఈ జగన్నాటకము.

 అంతేకాదు.ఆ ఆటలోని ఆటగాళ్లే మీరుకూడా."ఆదుకునే ముందర అమ్మ ఆడుకుంది మీతో".మోహమనే తెర నిలిపి దాగుమూతలుల్

 అనగానే,


 వారిద్దరు కర్తవ్యోన్ముఖులై ఋషికి నమస్కరించిరి.

" తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వాం మూర్తిం మహీమయీం

  అర్హణాం చక్ర తుస్తస్యాః తన్మనస్కౌ సమాహితా"

  వారిరువురు ఆ ఇసుక తిన్నెలపై,మట్టితో దేవీమూర్తిని చేసుకొని,వివిధ ఉపచారములో ఆరాధించిరి.ప్రీతిచెందిన దేవి ప్రత్యక్షమై,

 సురథునితో(రాజుతో)

"మృతశ్చ భూయః సంప్రాప్య జన్మదేవాత్ వివస్వతః

 సావర్ణికో నామ మనుర్ధవాన్ భువి భవిష్యతి."

  ఓ రాజా! ఈ శరీరము విడిచిన తదుపరి నీవు సూర్యుని వలన "సావర్ణికుడు" అనుపేర మనువు కాగలవని ఆశీర్వదించెను.

 సమాధి అను (వైశ్యునకు) జ్ఞానధనమును ప్రసాదించెను.

  పరమానందభరితాంతరంగులై వారు దేవిని

  

 పాహిమాం శ్రీరాజరాజేశ్వరి-కృపాకరిశంకరి

 పాహిమాం శ్రీరాజరాజేశ్వరి...

 ఏహిసుఖం-దేహి,సింహవాహిని

 దయాప్రవాహిని-మోహిని  పాహిమాం

 ...

 భండ చండ ముండ ఖండని

  మహిషభంజని

 జనరంజని-నిరంజని

 పండిత శ్రీ గుహదాస పోషిణి

 సుభాషిణి-రిపుభీషిణి-వరభూషణి


  పాహిమాం-పాహిమాం-పాహిమాం

   అని ప్రస్తుతించుచుండగా అమ్మ ప్రసన్న వదనముతో వారిని,వారితో పాటుగా మనలనందరిని ఆశీర్వదిస్తూ,అంతర్హితమైనది.


 



  సర్వేజనా సుఖినో భవంతు.స్వస్తి.

 సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.

 అంతర్ముఖసమారాధ్య అనుగ్రహప్రాప్తిరస్తు.

 


 



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...