SAUNDARYA LAHARI-KALI-83

సౌందర్య లహరి-మహాకాళి పరమ పావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము క్షిప్ర నదీతీరమున నెలకొనె- క్షిప్ర దయా స్వభావము కాలాతీతురాలు కాళి- ప్రళయ రౌద్ర స్వరూపము సాందీపని-విక్రముడు-కాళిదాసాదు లను బ్రోచిన సకల విద్యాప్రదానము హరసిద్ధిమాతా క్షేత్రము మన తమస్సు తాకెనమ్మ తల్లికి నల్లని రూపిక క్రిందకు సాగిన నాలుక తల్లి నిత్యత్వపు ప్రతీక మాయాసతి పైపలువరుస మహాకాల మూర్తిగా తేజోమయమై నా కుజదోషమును తొలగించు వేళ నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ! ఓ సౌందర్య లహరి. "ఉజ్జయిన్యాం మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని" కాలము అనగా తరిగిపోవునది.మింగివేయునది."కలయతీతి కాళి" కాలములోనున్న అఖండశక్తియే కాళిక.కలయతి నియతి కాళి అని కూడా అంటారు.కాలగతిని నడిపించునది.అయ్యవారు మహాకాళుడు.అమ్మవారు మహా కాళీ.లింగభేదమును పరిగణనలోనికి తీసుకోకుంటే కాలము/సమయమే కాళి.వస్తువుల ప...