Posts

Showing posts from January 27, 2026

ADITYAHRDAYAMU-09

Image
  ఆదిత్యహృ%దయము-09 ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి. పూర్వరంగము ************ అద్వితీయమైనపరమాత్మ "రశ్మిభావన"తో సముద్యంతుడై పునః సృష్టిని కావించి,పాలించుటకై,తన నుండి కొన్ని అద్భుతశక్తులను కిరణములగా భూమిపైప్రసరింపచేయుచు వాటికి బ్రహ్మ-మహేశ్వర-విష్ణు-స్కంద ఇత్యాది నామములను ప్రసాదించినాడు. ప్రస్తుత శ్లోకములో ఉద్భవించిన ఆ శక్తులకు సహాయకారులుగా మరికొన్ని శక్తిబృందములను విస్తరించినాడు. వానికి వివిధ సార్థకనామములను-స్వభావములను ప్రకటించినారు. ఐతిహాసికపరముగా సమన్వయ కథనమున్నప్పటికిని మనకు వాటిని కార్యనిర్వహణశక్తులుగా/ప్రాణశక్తులుగా వైజ్ఞానిక శాస్త్రము వివిధశాఖలను అప్పగిస్తుంది. శ్లోకము ***** " పితరో వసవ సాధ్యా యశ్వినో మరుతో మనుః వాయుర్వహ్ని"ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః" ముఖ్యపదము"-వాయుర్వహ్ని ప్రజాప్రాణా" ప్రజలప్రాణశక్తులు-అగ్ని/చైతన్యము-వాయువు గాలి. పరమాత్మ అన్ని ఉపాధులలో అగ్నిస్వరూపముగా దాగి-దానిని ఉచ్చ్వాస-నిశ్వాసములను వాయు ప్రక్రియ ద్వారా ...

ADITYAHRDAYAMU-08

Image
  ఆదిత్యహృ%దయము-08 ***************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి. పూర్వరంగము ********* పరమాత్మ రశ్మిభావనతో సముద్యంతుడై సకల చరాచరములను సృష్టించి-పోషించుటకు తన నుండి వివిధ శక్తివంతములైన కిరనములను ప్రసరింపచేస్తూ,వానికి సంకేత నామములను అనుగ్రహించి,మరికొన్ని సహాయక బృంద శక్తులను వాటికి ఏర్పరచి,తాను "వాయుర్వహ్ని ప్రజారూప" గా పరిఢవిల్లుతున్నాడన్న భగవాన్ అగస్త్యుడు, ప్రస్తుత శ్లోకములో ఏ విధముగా , అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్త నారాయణో హరిః అన్నట్లుగా హిరణ్యగర్భుడై విరాజిల్లుతూ,అనేకానేక దివ్యశక్తులను వెదజల్లుతున్నాడన్న అనుగ్రహమును అనేకానేక సాంకేతిక నామములో సంకీర్తిస్తున్నాడు. శ్లోకము ****** "ఆదిత్య సవితా సూర్యః ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః." ప్రస్తుత శ్లోకము స్వామి అనుగ్రహిస్తున్న శక్తుల సామర్థ్యమునకు సంకేత నామములే. పరమాత్మ, 1.ఆదిత్యుడు 2.సవిత్రుడు 3.సూర్యుడు 4.ఖగుడు 5.పూషుడు 6.గభస్తుడు 7.సువర్ణసదృశుడు 8భానుడు 9.హిరణ్యరేతస్కుడు 10.దివాకరు...

ADITYAHRDAYAMU-07

Image
  ఆదిత్యహృదయం-శ్లోకం-07 ****************** ప్రార్థన **** " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** స్వామి తన రశ్ములనే కరములతో తిరోధాన స్థితి నుండి పునఃసృషిని అనుగ్రహించినవేళ ఉత్పన్నమైన దేవాసురగణములచే నమస్కరింపబడుతున్నాడు.స్వామి రశ్మిభావనయే చైతన్యమును అనేకానేక విధములుగా ప్రకటింపచేస్తున్నది. ప్రస్తుతశ్లోకములో విస్తృతింపబడిన శక్తులు వివిధ నామరూపములతో పరమాత్మ అనుగ్రహమును మరింత వివరిస్తున్నది. శ్లోకము ***** " ఏష బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః." ఏష అను సంబోధనము పరమాత్మ ఏకత్వమును-మహత్వమును -పోషణత్వమును సూచిస్తున్నది. శబ్దము, 1.ధ్వని అర్థము 2.శబ్ద అర్థము 3.గూఢ అర్థమును కలిగి ఉంటుంది. ఏష-ఇతడే ధ్వనినిబట్టి, మంచిచెడులను-తెలియచేస్తుంది. శబ్దమును బట్టి గౌరవమును సూచిస్తుంది. గూఢార్థమును గ్రహించగలిగితే, " యతోవా ఇమానిభూతాని-జాయతే' ఎవని వలను జగములు సృష్టించబడి-సంరక్షించబడి-లయముచేయబడుతున్నాయో,ఏవనియందు దాచబడుతున...

ADITYAHRDAYAMU-06

Image
  ఆదిత్యహృదయము-06 **************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి. స్వామి రశ్ములు సర్వలోకములపై సంపూర్ణముగా విస్తరించి, చైతన్యపరుస్తున్నాయన్న మహర్షి,ప్రస్తుత శ్లోకములో"రశ్మిభావనను" విశదీకరిస్తున్నారు. నిద్రయను స్వల్పకాలిక లయము,ప్రళయము అను దీర్ఘకాలిక లయములను తదుపరిజాగృతమును తేజస్విగా (మూలబీజముగా)నిర్వహించు స్వామిని ప్రస్తుతిస్తున్నాడు. శ్లోకము ******* " సర్వదేవాత్మకోహ్యేష తేజస్వి రశ్మిభావనః ఏష దేవాం సురగణాంలోకాన్ పాతి గభస్తిభిః" సర్వదేవతా అసురశక్తుల సమన్వితమైన లోకములను చైతన్యపరచుటకు మూలకారణమే "రశ్మి భావనము" రశ్మిభావనము అనగా, "లోకంబులు లోకేశుడు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెంచీకటి అవ్వలనెవ్వండేకాకృతి ' పరమాత్మను సేవిస్తానన్నాడు బమ్మెర పోతనామాత్యుడు. " న ఉదయితి-నాస్తమేతి: స్వల్పకాలిక లయ (రేయిం-పగలు)దేశ.కాలగమనములో ఆదిత్యునకు ఉదయాస్తమానములుండవు. కాని దీర్ఘకాలికలయమునందు లోకములు-లోకస్థులు కానరావు.అవి అసలున్నవోలేవో కూడా తెలియదు...

ADITYAHRDAYAMU-05

Image
  ఆదిత్యహృదయము-05 **************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము స్తోత్ర పరిచయము-ఆత్మ స్వరూపము-అర్చనావిధానము-ఫలసిద్ధి మొదలగు విషయములను అగస్త్యమహర్షి రామ చంద్రునకు/మనకు వివరించినారు. ఒక సిద్ధాంతము ప్రకారము ప్రస్తుత శ్లోకమును, "ఆదిత్యహృదయ స్తోత్ర" ప్రారంభశ్లోకముగా పరిగణిస్తారు. నిజమునకు ప్రస్తుత శ్లోకము,"పరమాత్మకు-ప్రపంచమునకు వారథి వంటిది.దీనిని ఆలంబన శ్లోకముగా కూడా భావిస్తారు. ఖగోళ సౌరశక్తిని భూగోళమునకు చేర్చు సహాయకారులు "కిరణములు" వాటి ప్రసక్తి ఈ శ్లోకమునుండి ప్రారంభమవుతుంది. శ్లోకము ****** "రశ్మిమంతం-సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్య -వివశ్వంతం భాస్కరం-భువనేశ్వరం" తన కిరణములను పూర్తిగా విస్తరింపచేసి అంతకు ముందున్న చీకట్లను దాచివేసి దేవతలచే-అసురులచే నంస్కరింపబడుచున్న ,భువనేశ్వరుడైన భాస్కరుని , ఓ రామా!-పూజింపుము అని అగస్త్యుడు పలుకుచున్నారు. "స్వామి" వేటిద్వారా సర్వమును-సకలమును అనుగ్రహిస్తున్నాడో అవి "రశ్...