Monday, December 14, 2020

ALO REMBAAVAI-03






 మూడవ పాశురం

***************

ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి

నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్

తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు

ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్

పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్తములై పట్రి

వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.



  ఓం నమో భగవతే వాసుదేవాయ.







  నంబావైక్కు-మనము వ్రతమును
  చ్చాత్తి-చేద్దాము.
   దేనిని ముగించిన తరువాత?

    నీరాడినాల్-యమునలో స్నానము చేసిన తరువాత.
  ఏ విధముగా నోమును చేద్దాము అంటే,

  అళంద-కొలిచిన. దేనిని కొలిచిన?
  ఉలగం-లోకములను, ఏ విధముగా?
  ఓంగి-తనకు తానే తనరూపమును విస్తరించుకొనిన,
  ఉత్తమన్-పరమాత్మను,
  పేర్పాడి-నామ సంకీర్తనముచేస్తుంటే,

  గోదమ్మ నవవిధ భక్తులలోని నామసంకీర్తన ప్రాశస్త్యమును మనకు తెలియచేస్తున్నది.త్రేతా యుగములో రాముని కన్న రామనామము అత్యంత మహిమాన్వితమైనదని చాటాడుగా.



   అద్భుతములు ఆవిష్కరింపబడుతాయి అంటున్నది గోదమ్మ-గోపకాంతలతో.

 మొదటిది-
   తీంగిన్రి-దురితములు తొలగిపోతాయి/దుష్టత్వము వీడి పోతుంది.
  అన్ని చోట్ల-
 తింగళ్-నెలకు/మాసమునకు,
ముమ్మరిపెదు-మూడు వానలు కురుస్తాయి.
  అప్పుడు,
 ఓంగు పెరుం శెన్నల్-

  పెరుం-పెద్దదైన/విశేషమైన,
 ఓంగుశెన్నల్-పండిన పంట చేలు మనకు దర్శనమిస్తాయి.
 విచిత్రం,
 ఊడు-పంట చేల మధ్యలలో,

  మళ్ళించిన నీటి ప్రవాహములలో,
 కయిల్-చేపపిల్లలు,
 ఉగళ్-కేరింతలు కొడుతు కనిపిస్తాయి.

 రెండవది-


 పూంగువళ్ళె ప్పోదిల్-
   మధువును ఆస్వాదించుటకు పూలగుత్తుల మధ్యలో నున్న,

 పొరివండు-ప్రకాశించుచున్న తుమ్మెదలు,

 కణ్పడప్పల్-వీడలేక అక్కడే నిద్రిస్తుంటాయి.

 మూడవది-

  తీంగాదె పుక్కిరిందు-
  
     స్థిరమైన గోశాలయందున్న గోవులు,

   శీర్తములై పట్రి
  చేపుకొని పాలతో నిండియున్న శిరములతో,

   వాంగక్కడం-పాలు పితుకు కడవలను (తమకు తామే) 

 నిరైక్కుం-పాలతో నింపుతాయి.

      ఎందుకంటే-అవి

పెరు పశుక్కళ్-ఉన్నతమైన/శ్రేష్ఠమైన గోవులు.


 గో శబ్దమునకు వేదములు అని కూడ భావిస్తారు.కనుక గోకులము-గోశాల-గోక్షీరము-గోవిందుడు-గోపికలు-గోదమ్మ సర్వము వేదమయమే-నాదమయమే-మోదమయమే.



  అవి పాలను కడవలలో ఎలా వర్షిస్తాయంటే,
   వల్లాల్-అతిశయించిన ఉదారతతో,

     తరగని సంపదలనుగ్రహించు స్వామి కరుణను గోపికలకు చెబుతున్న గోదమ్మ ,

   ఈ పాశురములో ఆచార్యులను తమ శిష్యుల జ్ఞానసమృధ్ధి అను పుష్కలమైన పంటచేలను చూసి వాటి మధ్యలో ప్రవహించు (తమ హృదయ సంతోషములో) జలములలో ఎగురుచున్న చేప పిల్లలతో పోల్చి,మత్స్యావతారమును మర్మగర్భముగా కీర్తించినది.


    స్వామి నామ సంకీర్తనమను ఝంకారముతో స్వామి దివ్యమంగళస్వరూపానుభూతిని వీడలేక ఉన్న తుమ్మెదలుగాను ప్రస్తుతించినది.

పెరు పశుక్కళ్ అంటు స్థితి కర్తను -మనకు అందించుచున్న అవ్యాజ కరుణ అను క్షీరమును ప్రస్తావించినది.

  ప్రకృతిని పరమాత్మ స్వరూపముగా గుర్తించి సేవించుటయే సౌభాగ్యము.

 త్రివిక్రముడు వామన మూర్తిగామూడు అడుగులతో ముక్తిప్రదాత అయినాడు.

  గోకులములో మూడు వరములను అనుగ్రహించుటకు ముక్కుపచ్చలారని ముద్దుకృష్ణుడై మనలను మురిపిస్తున్నాడు.


 అవి-
1-తారకము-అనగా అన్నము.

   అహమన్నం-అహమన్నం
   అహమన్నాద-అహమన్నాద.
 ఇక్కడ గోవును-గోక్షీరము-దానిని గ్రహించువాడును పరమాత్మయే.

2.భోగ్యము-పాలు-నెయ్యి.

    పాలతో ప్రారంభమై నెయ్యిగా మారువరకు జరుగు మార్పులు,

  మనము ఐహికముతో ప్రారంభించి ఆధ్యాత్మికమునకు చేరు గమ్యము.

 అంటే సంసారము సంస్కారముగా పరిణమించుట.

3.-పోషకము-అనగా అనుగ్రహఫలమైన తాంబూలము. ఆ పరమాత్మ కటాక్షమును అందుకొనగలుగుట.

  వాటిని అందుకొనుటకు మనము అమ్మ చేతిని పట్టుకుని అడుగులను కదుపుదాము.

  ఆండాళ్ తిరువడిగళే శరణం.





 
   

 
   

ALO REMBAAVAI-02

రెండవ పాశురము
***************
వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు
చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి
నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం
శెయ్యదన్ శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం
ఐయయుం పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి
ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో 

 

 కేళీరో-వినండి. ఎవరు వినాలి?

   వైయత్తు వాళ్వీర్గాళ్-ప్రపంచములో నున్న జనులారా. ఏమి వినాలి?

 పార్కడలుళ్-పాల కడలిలో

   పైయెత్తు ఇన్రా-విలాసముగా పడుకొని ఉన్నవాడు. వాదే,

  నాముం-మనలను,
నం పావైక్కు-మనలను కరుణతో చూచేవాడు.
                        వాడు,

  పరమన్-పరమాత్మ. అంతేకాదు,కిరిశైగళ్ సెయ్యుం-మనలను రక్షించే పనులనే చేయువాడు.

  వాడి,
 
   అడిపాడి-పాదపద్మములను విడువద్దు.

   మనము కొన్నింటిని పరిత్యజిద్దాము.మరి కొన్నింటిని పరిగ్రహిద్దాము.

  మొదటగా     పరిత్యజించ  వలసిన వాటి గురించి,

 నెయ్యినోం-నెయ్యిని తినవద్దు.
 పాలున్నోం-పాలను స్వీకరించవద్దు
 మై ఇట్టు ఎళుదం-అలంకరణలు వద్దు
 మలరిట్టు నా ముడియం.-పూలను సిగలో ముడుచుకోవద్దు
 శెయ్యదన్ శెయ్యాం-చేయకూదని/చెడు పనులను చేయవద్దు.
  తీక్కరళై శ్శెన్రుదోం-చెడు మాటలను చెవికి రానీయవద్దు-వాటిని ఇంకొక చెవికి చేర్చవద్దు.

 కళ్ళకు కాటుకవద్దు.స్వామిని చూసటప్పుడు అది అడ్డము వస్తుంది.
 సిగలో పూవులు తురుముకోవద్దు.అది నాసికను తన సువాసనతో అధీనము చేసుకుంటుంది.
  చెడు మాటలను వినవద్దు.అవి       వినికిడి శక్తిని       దుర్వినియోగపరుస్తాయి.

   చెడు మాటలను ఇంకొక చెవికి చేర్చవద్దు.ఆ పని నీ వాక్కును నిర్వీర్యము చేస్తుంది.అప్పుడు అవి స్వామిసేవకు సంపూర్ణముగా సహకరించలేవు.

   పరిగ్రహించవలసిన పనులు మూడు.అవి 1. కాయకము.2.వాచకము.3.మానసం


 ప్రాతఃస్నానము-చేయిచాచి వితరణగా   దాన  ధర్మములు చేయుట-కాయకము.

 దానధర్మములను ,

 ఐయము-భాగవతులకు-పిచ్చయుం-పేదలకు-ఆందనతుం-యోగులకు వితరనగా,లోభను విడిచి చేయాలి.

   త్రికరణ నామ సంకీర్తన -వాచకము.


 పరమాత్మ చింతనము-ఆంతరంగిక దర్శనము మానసికము.

  ఎణ్ణె- కొంచము ఆలోచించు.


   ఈ పాశురములో అమ్మ మనకు ఏయే పనులను ఆచరించాలో-ఆచరించకూడదో తెలియచేసినది.

 మన అజ్ఞానము అసలు ఎందుకు చేయాలి? అనే ప్రశ్నను మనలో కలిగించ వచ్చును.ఎందుకంటే మనము తమోగుణ పూరితమైన సంసారములో/జగతిలో నున్నవారలము కనుక.

 అందుకే గోదమ్మ తమోగుణ/చీకటి నిండిన భూమండలమందుండియును ఆనందముగా నున్న గోపికలారా! అంటు,

  నిశ్చయజ్ఞానముతో మనకూ నారాయణనే" నారాయణుడొక్కడే" శరణము అంటు అనన్యశరణత్వమును ప్రస్తావించినది.

 అన్యధా శరణం నాస్తి-త్వమేవ శరణం మమ"అంటు, అమ్మ చేతిని పట్టుకుని ,అడుగులను కదుపుదాము.
 
   ఎందుకు అంటే, ఇవి నీకు ,ఉయ్యుమారు-ముక్తిమార్గములు.
  ఉగందు-సంతోష ప్రదములు.కనుక,

   భగవతుని దయ ప్రసరించిన ఓ భాగ్యశీలులారా-
  వ్రతమును చిత్తశుధ్ధితో చేసుకొనుటకు  తరలి రండి.

     రేలో -ఓ జనులారా,
  ఎన్-పావో-వ్రతమునకు రండి,అని పిలుచుచున్న ఆండాళ్ తల్లి దివ్యచరణములే           మాకు  శరణము.

  ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.

.

 

.

 

ALO REMBAAVAI-01


  ఓం నమో నారాయణాయ.
  *****************


 ద్రవిడ సంప్రదాయము పరమాత్మను గుర్తిస్తూ-కీర్తిస్తూ-తరిస్తూ-తరింపచేసే సాహిత్య గాన ప్రక్రియను పాశురముగా పరిగణిస్తారు.

    పన్నెండు మంది ఆళ్వారులు అనుభవించి,అందించిన పాశురముల సమాహారమును నాలాయిరం అని కీర్తిస్తారు. 

   ద్వాదశాళ్వారులలో పరమ పునీత ఆండాళ్ తల్లి అవ్యాజకరుణతో అనుగ్రహించినది ఈ ముప్పది పాశురముల ముక్తిమాలిక.
  
   ఇంకొక విషయము ఏమిటంటే పరమాత్మ యొక్కడేపురుషుడు.మనమందరము జీవులము.

 అమ్మ దయతో పరమాత్మ తత్త్వమును అర్థముచేసుకుంటూ, ఆచరిస్తూ,ఆస్వాదిస్తూ,అనుభవిస్తూ,
అడుగులను కదుపుదాము.


 


     ఏలో రెంబావై-01

     *****************



   మొదటి పాశురం.

***************



 "మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్

  నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్

  శీర్మల్లుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్కాళ్

  కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్

  ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం

  కార్మేని చ్చెంగణ్ కదిర్ మదియంపోల్ 
 ముగత్తాన్



   నారాయణనే నమక్కే పరైదరువాన్

  పారోర్ పుగళప్పడిందు ఏలోరెంబావాయ్."



  ఓం నమో భగవతే  వాసుదేవాయ
  ********************************



  నేరిళైయీర్-సుగుణాభరణభూషితులైన బాలికలారా,

  నన్నానాళ్- ఇవి పవిత్రమైన రోజులు/సమయము.



  ఎందుకు అంటే,

 మార్గళి తింగళ్- మాసాలలోకెల్ల మహత్తరమైన మార్గశీర్ష మాసము.

 అంతేకాదు, ఈ రోజు,



   మధినినంధ-నిండు పున్నమి.మనసులో ఆచార్యుల ఆశీర్వచనముతో అమృతత్త్వము అందుకొనబోవు సుదినము.




   ఇంకో విశేషము కూడా ఉంది.అదేమిటంటే,



   ఇలం సింగం-యువకిశోరమును మనము చూడవచ్చును.వాడు,




 తొళిన్-భుజము మీద,

 కూర్వేల్-వేలాయుధమును పట్టుకుని,శత్రువులనుండి మనలను రక్షించు నందమహారాజు కుమారుడు.



  అంతేకాదు,

   

   ఏరారంద కణ్ణి-పద్మములవంటి కన్నులుకల,వైజయంతిమాలను ధరించిన,మహిమాన్వితమైన,



   యశోదై-కీర్తిని స్వంతము చేసుకొనిన-కీర్తియే తానైన 



   యశోదమ్మ ముద్దుల కన్నడు.



  వాడి సౌందర్యము చెప్పనలవికాదు.



  కతిర్ పోల్-సూర్యుని ప్రకాశమును పోలిన ప్రకాశము కలవి వాడి




   శెం కణ్-అందమైన కన్నులు.

 మదియుం పోల్-చంద్రుని పోలినది 

  

   ముగత్తాన్-వాడి ముఖము.చల్లదనమును వెదజల్లుతుంటుంది.




   కార్మేనిం-వాడు నీలమేఘశ్యాముడు.



 మనమా,



 ఆయ్పాడి-సంసారమనే చీకటిలో మునిగియున్నాము.



   వాడు అందగాడే కాదు- అనుగ్రహించుటకు పఱ అను వాయిద్యముతో( పరమును) సిధ్ధముగా నున్నాడు (మనలకు.)




   శీర్మల్గుం-మనము అనుగ్రహమునకు అనువైన ప్రదేశములో నున్న వారలము.



 పోదువీర్-పోదుమినో-ఎవరు బయలుదేరి వద్దామనుకుంటున్నారో రండి.ఎక్కడికి అని అడుగుతారేమో,




 నీరాడ-యమునలో స్నానము చేసి,



 నమక్కే-మనలను అనుగ్రహించి,



పఱై తరువాన్-పఱను ఇచ్చే,



 నారాయణనే-నారాయణుని,

  పుగళ్-ప్రస్తుతించు/కీర్తించు,



   పావై-నోమునకు,

 ఎన్-రండి.



   గోదమ్మ తానొక గోపికగా మారి,(పరమాత్మ ప్రకృతిగా ప్రకటనమగుతు-తన అంశద్వారా)

 గోకులములోని తోటి గోపికలతో ఆడుతూ-పాడుతూ స్వామిని వేడుకునేటట్లు చేయాలని నిశ్చయించుకుంది.అందరము కలిసి సిరినోమును నోచుకుందామని చెబుతున్నది.దానికి అనుకూలమైన సమయ-సందర్భములను వివరిస్తున్నది.యశోదా-నందులను ప్రస్తుతిస్తున్నది..బాలకృష్ణుని రూపలావణ్యములనే కాదు,అనుగ్రహ స్వభావమును తెలియచేస్తూ,అసలే,

  మనము చీకటితో నిండిన సంసారములోనున్నవారమని,అయినప్పటికిని మన భాగ్యవశమున పరమాత్మ నదయాదు నందవ్రజమున నున్నామని తెలియచేస్తూ,వారిని వ్రతోన్ముఖులను చేస్తున్నది.

ఇది సామాన్యార్థము.వాచ్యార్థము..



   శ్రీకృష్ణం శరణం మమ.



   సర్వాభరణభూషితులైన గోపకాంతలట.వారు ధరించిన భూషణములు-నవవిధభక్తులు అను నాణ్యమైనవి.


 వారు పున్నమి చంద్రుని వెన్నెలలో తడుస్తున్నారంటే,స్వామి సుగుణ నామ సంకీర్తములో మునిగియున్నారు.ఆ వెన్నెల జ్ఞానగుణ అనుగ్రహము.



 వారు యమునలో మునిగి చేయు మార్గళి స్నానము భవబంధములను మురికిని తొలగచించుకొను వైనము. 



   వారెంతటి జ్ఞానులంటే వారు సంసారమనే చీకటిలో నున్నామను తెలివికలవారు.దానికి ప్రకాశమునిచ్చు సూర్యుని వంటి నేత్రములు-ప్రశాంతతనిచ్చు చంద్రునిముఖము గల కృష్ణుని శరణుకోరు స్పృహ వున్నవారు.



   పరమాత్మలోని చైతన్యమే పరమసాధ్వి గోదమ్మ.పరమార్థమును పంచుటకు అవతరించిన ఆండాళ్ దివ్య చరణములకు నమస్కారములు.

  అమ్మ చేతిని పట్టుకొని అడుగులను
 కదుపుదాము.



   ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.



   

 



   

 



ALO REMBAAVAI-INTRODUCTION.


 




    ఏలో రెంబావై-


        వ్రతమునకు రండు.




  *************************




 శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే


*********************************




" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం


శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం


సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం


గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".




శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు/ఘనులు.




             .బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు .




" భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ


శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్


భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్


శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."




ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభావములు కలిగిన గోపికలను ఎంతో ఓర్పుతో-నేర్పుతో తనతో కలుపుకొనుచు,అందరు కలిసి పర వాయిద్యమును స్వామి దగ్గర నుండి ( పరము అను సాయుద్యమును) పొందుటకు చేయు వ్రతము( పావై)ఇది.ఇది ఎటువంటి వ్రతము? తిరు వ్రతము.అనగా శ్రీకరము-శుభకరము.దీనిని ముప్పదిరోజులు ముప్పది పాశురములను కీర్తిస్తు,చేయవలసిన పనులను చేస్తూ,చేయకూడని వానిని విసర్జిస్తూ చేసే సర్వస్య శరణాగతి అను సత్సంప్రదాయము.




మార్గశీర్ష మాసము మాధవునికి ప్రీతికర సమయము.ప్రకృతిపచ్చగా నుండి పరమాత్మను ప్రశంసిస్తుంది..సూర్యుడు ధనుః రాశిలోనికి 


,ప్రవేశిస్తాడు. కనుక ఈ పవిత్ర సమయమును ధనుర్మాసము అనగా ధన్యతను అందించగల సమయమని భావిస్తారు.మూలద్రావిడములో తల్లి కీర్తించిన పాశురములు ( వాక్పుష్పమాలలను. మాలను) పూమాలలతో పాటుగా రంగనాథస్వామికి భక్తి-ప్రపత్తులతో సమర్పిస్తారు.


రేపల్లెలోని గోపికలను వారి తల్లితండ్రులు శ్రీకృష్ణుని సామాన్య పురుషునిగా భావించి వారి పిల్లలైన గొల్లెతలను స్వామిని కలవకుండా కట్టుదిట్టము చేసినారట.ఆ సమయమున విపరీత వర్షాభావ పరిస్థితి ఏర్పడుట వలన,పెద్దల సూచన ప్రకారము కన్నెపిల్లలు కాత్యాయినీవ్రతమును భక్తిశ్రధ్ధలతో చేసిన ఎడల వర్షములు కురిసి సుభిక్షత కలుగునని,శ్రీకృష్ణుని వ్రత నిర్వాహకునిగా ,గోపికలచే వ్రతమును జరిపించి ధన్యులైనారట.


 ఆ విషయమును మన తల్లి" కోదై" స్వామి కరుణామృత వర్షమునకై తనను రేపల్లెలోని ఒక గోపికగా భావించుకొని,తన చెలికత్తెలను కలుపుకొని మార్గళి వ్రతమును, కుసుమ మాలలతో-పాశురములతో ముప్పదిరోజుల శ్రీవ్రత విధానమును,దాని పరిపూర్ణ ఫలితములను అత్యంత దయతో మనకు అందించినది తల్లి.కోదై (పూలమాలిక) అను నామము గల ఆముక్తమాల్యద.




సరళముగా చెప్పుకోవాలంటే,




మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.




క్షమాపణ నమస్కారములతో " ఏలో రెంబావై" దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్షణము/           లక్ష్యము కనుక.




  భాషకన్న భావము-భక్తి ప్రధానమనే నమ్మకముతో నేను ఈ దుస్సాహసమును చేస్తున్నాను.ఇందులో ఎన్నో తప్పులు కుప్పలుకుప్పలుగా జొరపడి పాలుపంచుకొనినను, వానిని క్షమించి సహించుట ఆ మాధవుని దయాహృదయతను చాటుటకేనేమో.ఈ నా ప్రయత్నములోని దోషములను సవరించి,వ్రతమును సుసంపన్నము చేస్తారని ఆశిస్తున్నాను..




 




ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో,వారికి 


 ఎన్ తిరు వణక్కములు.




.


" అందరికి వందనములు."




అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,ఏలో రెంబావై"అనుగ్రహించుచున్నది..






" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం


శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం


సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం


గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".




శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు/ఘనులు.


       .బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులు. సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు .




" భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ


శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్


భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్


శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."




ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభావములు కలిగిన గోపికలను ఎంతో ఓర్పుతో-నేర్పుతో తనతో కలుపుకొనుచు,అందరు కలిసి పర వాయిద్యమును స్వామి దగ్గర నుండి ( పరము అను సాయుద్యమును) పొందుటకు చేయు వ్రతము( పావై)ఇది.ఇది ఎటువంటి వ్రతము? తిరు వ్రతము/సిరి వ్రతము.


 ముప్పదిరోజులు ముప్పది పాశురములను కీర్తిస్తు,చేయవలసిన పనులను చేస్తూ,చేయకూడని వానిని విసర్జిస్తూ చేసే సర్వస్య శరణాగతి అను సత్సంప్రదాయము.




మార్గశీర్ష మాసము మాధవునికి ప్రీతికర సమయము.ప్రకృతిపచ్చగా నుండి పరమాత్మను ప్రశంసిస్తుంది..సూర్యుడు ధనుః రాశిలోనికి 

,ప్రవేశిస్తాడు. కనుక ఈ పవిత్ర సమయమును ధనుర్మాసము అనగా ధన్యతను అందించగల సమయమని భావిస్తారు.మూలద్రావిడములో తల్లి కీర్తించిన పాశురములు ( వాక్పుష్పమాలలను. మాలను) పూమాలలతో పాటుగా రంగనాథస్వామికి భక్తి-ప్రపత్తులతో సమర్పిస్తారు.


రేపల్లెలోని గోపికలను వారి తల్లితండ్రులు శ్రీకృష్ణుని సామాన్య పురుషునిగా భావించి వారి పిల్లలైన గొల్లెతలను స్వామిని కలవకుండా కట్టుదిట్టము చేసినారట.ఆ సమయమున విపరీత వర్షాభావ పరిస్థితి ఏర్పడుట వలన,పెద్దల సూచన ప్రకారము కన్నెపిల్లలు కాత్యాయినీవ్రతమును భక్తిశ్రధ్ధలతో చేసిన ఎడల వర్షములు కురిసి సుభిక్షత కలుగునని,శ్రీకృష్ణుని వ్రత నిర్వాహకునిగా ,గోపికలచే వ్రతమును జరిపించి ధన్యులైనారట. ఆ విషయమును మన తల్లి" కోదై" స్వామి కరుణామృత వర్షమునకై తనను రేపల్లెలోని ఒక గోపికగా భావించుకొని,తన చెలికత్తెలను కలుపుకొని మార్గళి వ్రతమును, కుసుమ మాలలతో-పాశురములతో ముప్పదిరోజుల శ్రీవ్రత విధానమును,దాని పరిపూర్ణ ఫలితములను,తానును వారితో కూడి ఆచరించి,

      అత్యంత దయతో మనకు అందించినది తల్లి.కోదై (పూలమాలిక) అను నామము గల ఆముక్తమాల్యద.




సరళముగా చెప్పుకోవాలంటే,




మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.




క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరు-పావై దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్షణము/           లక్ష్యము కనుక.పరమాద్భుతమైన ఈ ద్రవిడ ప్రబంధము నవవిధభక్తి సమ్మేళనము.నవనీతచోరుని దివ్యలీలా తరంగము.







.







కావున సత్ చిద్రూపులారా! అన్యధా భావించక,దోషములను సవరించి,

 సంస్కరించుటను," శ్రీ గోదా-రంగనాథుల సేవ" గా భావించి,సహకరించగలరని ఆశిస్తూ,



సవినయ నమస్కారములతో -మీ సోదరి.


సద్గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు.


( ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.) 







TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...