Sunday, December 3, 2017

CHIDAANAMDAROOPAA-BAANABHADRUDU.


 చిదానందరూపా-బాణ భద్రుడు
 ********************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 మీనాక్షి-సుందరేశ్వర  మధుర నివాసి బాణ భద్రుడు
 సుందరత్వముతో కూడిన మథుర కీర్తనా శివభక్తుడు

 సంగీతముతో పరమాద్భుతములే చేసెను హేమనాథ భాగవతారు
 అంగరంగ వైభవకీర్తికి ఆశగ అరుదెంచెను పాండ్యదేశము

 రాజసభావము నిండిన మదితో రాజ్యములె పందెము వేసెను
 యోగముగా బాణభడ్రుడు పోటిచేయగ నియమితుడాయెగ

 గట్టెంకించగ భక్తుని కట్టెలమ్ము వానిగ స్వామి కదిలెగ
 పట్టిన పాద సన్నిధి చేరగ సంకీర్తనలే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.


 మీనాక్షి-సుందరేశ్వర విరాజితమైన మధుర క్షేత్రములో పాండ్యరాజుల కాలమున సంగీత సాహిత్య నృత్యములకు ఆలవాలమై అప్రతిహతముగా అలరారుచుండెడిది.ఆ నగరములో అననవరతము ఆ సుందరేశుని తన అంతరంగముననిలుపుకొని కీర్తనలను స్వయముగా వ్రాయుచు,భక్తి పరవశముతో కీర్తించుచుండెడి వాడు బాణభద్రుడు.అతనిసమకాలీనుడైన హేమనాథ భాగవతారు దైవదత్తముగా లభించిన తన సంగీతముతో వర్షములను కురిపించుచు,పుష్పములు వికసించునట్లు చేయుచు,రాలను సైతము ద్రవించ చేసెడివాడు.అతని శక్తిసామర్థ్యములు అతనికి అనంత కీర్తితో పాటు అన్నిరాజ్యములకు వెళ్ళి అక్కడి సంగీత విద్వాంసులతో పోటిపడి,పందెములు వేయుచు తన రాజ్యమును విస్తరించవలెనని కోరికను తోడు తెచ్చినది.దానితో అతనికి పాంద్యదేశమును సైతము తన విద్యతో కైవశము చేసుకోవలెనను ఆలోచన వచ్చినది.తక్షణమే రాజును దర్శించి తన పందెం విషయమును తెలియచేసెను.పాండ్యరాజు హేమనాథునకు బసను ఏర్పాటుచేసి,మరునాటి ఉదయమున పోటిని ఏర్పాటుచేసి,బాణభద్రుని ప్రత్యర్థిగ నియమించెను.రాజాజ్ఞ కావున ధిక్కరించలేక తన స్వామియైన సుందరేశ్వరును ప్రార్థించి,తెలివితప్పి అక్కదే పడిపోయెను.కట్టెలమ్ము వానిగా హేమనథ బసను సమీపించి ఆలాపన చేయగ ప్రకృతి పరవశించెను.అతడు ఆపినంతనే స్తభించెను.ఇదిచూచి పరమాశ్చరయ చకితుడైన హేమనాథుడు కట్టెలమ్ము వానిని వివరమడుగగా,తాను బాణభద్రుని కీర్తనలను దూరమునుండి విని ఆలపించుటకు ప్రయత్నించితిననెను.మరునాటి ఉదయము సభలో జరుగు పోటిలో వినవలెనను కుతూహలముతో ఉన్నాననెను.అంతటితో బాణభద్రునితో పోటి చేయుటకు అనర్హుడనని,ఓటమి పత్రమును స్వచ్చందముగా వ్రాసి అక్కడినుండి నిష్క్రమించెను.పని అయినదికదా! భక్తునకు తెలివి వచ్చి,సుందరేశ్వరునితో రాజభటులు వచ్చెదరని చింతించుచున్న సమయమున సుందరేశ్వరుడు చిరునవ్వుతో జరిగిన విషయములను చెప్పి,అంత్యకాలమున వారిని తనలో ఐక్యముచేసుకొనెను.ఓం నమః శివాయ.

  ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...