KASMEERAETU SARASVATEE.

కాశ్మీరేతు సరస్వతి " శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు కల్గు భారతీ" అని, శ్రీమదాంధ్ర మహాభాగవతములో పోతనామాత్యునిచే కీర్తింపబడిన సరస్వతి పీఠము మాయాసతి కుడిచేయి పడిన ప్రదేశముగా చెబుతారు. సర్వస్వాత్ సరస్వతి అను నానుడి కలదు.స్వాత్ లోపల నిండియున్న సర సర్వము.మనలోపలనిండి సమయ సందర్భానుసారము ప్రకటితమయే శక్తియే సరస్వతి అని సారస్వతమని పండితులు భావిస్తారు. సంగీతములో సాహిత్యములో నిండియున్నా స్వర ప్రస్థానములే సరస్వతీ రూపముగా భావించే శాక్తేయ సంప్రదాయము కలదు. " అక్షరాభ్యాసములోనే" యోగశక్తి నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు.సర్వశుక్లా సరస్వతీ అన్న సూక్తిని గ్రహించినట్లయితే అమ్మవారు శుద్ధసత్వమైన తెల్లనితెలుపు రంగు.కనుక సర్వ వర్ణోప శోభితా అను స్తుతి వాక్యమును మనము అన్ని అక్షరముల స్వరూపముగా భావించినట...