TIRUVEMBAAVAAY-02
తిరువెంబావాయ్-02 ***************** " కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృదిభావయామి." సందర్భము మొదటి పాశురములో విన్సెవియో అంటూ శ్రవణేంద్రియ పరమార్థమును శ్రవణభక్తి విశేషములను "భద్రం కర్ణాణి శ్రుణు" అన్న ఆర్యోక్తిని తెలియచేసిన తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ఆత్మజ్ఞాన అధ్యయనమును ప్రస్తావించుచున్నారు. మనము గ్రహించవలసిన విషయము ఏమిటంటే ఈ సఖులు వారి విచిత్ర ప్రవర్తనము మన మనోవృత్తుల విధానమునకు సంకేతములే.దానిని గ్రహించి జన్మసార్థకతను పొందమని సందేశము. "పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్ చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి ఏశుం ఇడమిదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు కూశుం మలర్పాదం తందరుళ వందరుళం దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్ ఈశనార్కు అంబార్ యాం ఆడేలో రెంబావాయ్" కూసుం మలర్ పాదం" స్వామి పాదపద్మములు" మనము సేవించుకొను...