TIRUVEMBAVAY-09
తిరువ్రంబావాయ్-09 **************** కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి. సందర్భము ****** భక్తి, శ్రవణ-స్మరణ-మనన-నిధిధ్యాసమునల అధిగమించి ఆత్మజ్ఞానమను శివజ్ఞానములోనికి ప్రవేశించుచున్నది.స్వ-పర భేదములను తోసివేసి,భగవంతునికి-భాగవాతారునకు అభేదమును గ్రహించగలుగుతున్నది.భాగవతుల సేవనము భగవత్సేవగా గ్రహించే భాగ్యమును పొందుచున్నది.మున్నాడి-పిన్నాడి ఆది-అంతములు లేని శివస్వరూపమును గుర్తించగలుగుతున్నది. పాశురము-09 *********** మున్నై పళం పొరుక్కుం మున్నై పళం పొరుళై పిన్నై పుదుమైక్కుం పేత్తుం ప్పెట్రియెనె ఉన్నై పిరానాగ పెట్రవుం శీరడియో ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపాంగావో అణ్ణవరె ఎణకణవర్ ఆవార్ అవర ఉగందు శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్ ఎన్న కురయుం ఏలో ఎమక్కేలోరెంబావాయ్ భక్తి యోగము స్వామి అనుగ్రహముతో జ్ఞానయోగముగా రూపుదిద్దుకుంటున్నది. "నీ పాద కమ...