Friday, November 26, 2021

cheramaan naayanaar

చేరమాన్ నాయనార్ *************** " ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. పెరుముక్కో అడయార్ నాయనార్ కేరల రాష్ట్రములోని చేర రాజ్య వంశములో జన్మించినప్పటికిని రాజ్యమును తృణప్రాయముగా నంచి,శివభక్తిని పెంపొందించుటకు తన జీవితమును అర్పింపదలచినాదు. కాని శివుడు తన భక్తునకు ఎవ్వరి మనసులోని భావములను కాని,ఏ స్థలము-వస్తువు మొదలగు వాని స్వరూప-స్వభావములౌ చిటికెలో గ్రహించగల వరమును ప్రసాదించి,రాజ్యాభిషిక్తుని చేసెను. ఎవరి మనౌలోని భావములనైన గ్రహించగల శక్తిమంతుడు కనుక పెరుముక్కూ అడయర్ గా ప్రైధ్ధిని పొందెను. రాజ్యము వీర భోజ్యము అన్నది ఆర్యోక్తి.బలపరాక్రమములు-కళరిర్-దయాదాక్షిణ్యములు కల నాయనారును, కళరిర్-అరివర్ గా కీర్తింపబడుచున్నాడు. చేరరాజ్య ప్రభువు కనుక చేరమాన్ నాయనారుగాను ఖ్యాతికెక్కినాడు. సగౌరవ సూచకముగా చేరమాన్ నాయనార్ గజారోహుడై నగరవెధులలో,ఇరుపక్కల శాంతిహిహ్నములుగా సత్వగుణ శోభితుని తెల్లనివింజామరలు వీచుచుచుండగా, రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లున్న సమయమున తెల్లనివిభూతిరేఖలను ధరించిన ఫాలభాగముతో,మెడలో అలంకరించుకొనిన రుద్రాక్ష మాలలతో,అనవరతము అజపా మంత్రమువలె ఆగక జరుగుచున్న/జరుపుచున్న శివనామ స్మరణముతో ఒక రజకుడు/చాకలివాడు రాజునకు గుడ్దలమూటనెత్తుకుని ఎదురుపడెను. నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన గలశివుడు నాలోన గల శివుడు నిండార రక్షించగలడు అన్న కీర్తిని నిజము చేస్తూ, త్వమేవాహం-నీవే నేను-నేనే నీవు, అన్న సత్యమును నిరూపిస్తూ రూప-ప్రతిరూపములు-బింబ-ప్రతిబింబములు పరమ శివుని లీలగా కాదు కాదు అవలీలగా పరస్పరము నమస్కార-ప్రతినంస్కారములను చేసుకొనినవి. ఏనుగు అంబారీనిదిగి నాయనారు ఎదురుపడిన రజకునికి నమస్కరించుచున్నాడు. ఏకాదశ రుద్రమును కూడి నందనారు రాజునకు నమస్కరించుచున్నాడు. ఎంతటి మనోహర దృశ్యమది.ఎంతటి మమకార చిత్రమది.ఆడువాడు-ఆడించేవానిని-ఆడించేవాడు ఆడువానిని గుర్తించి,గౌరవించుకునే అద్భుత సన్నివేశము. అంతటితో అయిపోలేదు అద్భుత లీల.అమృత వర్షిణియై దశదిసలను ధన్యతనొందునట్లు చేసినది. రజకుడు రాజుతో అయ్యా! మీరు చేరదేశ ప్రభువులు.నేను పాలితుడను కనుక ధర్మశాస్త్రముల ప్రకారము పాలితులు ప్రభువులకు నంస్కరించవలెను.ఇది మీకు తెలియని కాదు.కనక నాకు మీరు నమస్కరించకూడదు అంటూ వినయముగా మందలించాడు. రాజు రజకునితో సమాధానముగా అయ్యా మీరు చెప్పినది సత్యమే కాదనను.నేను చేర దేశమునకు బానిసను.మీరు ఒక భాగము.కనుక నేను మీకు నమస్కరించుట సమంజసమే అని విధేయునిగా సమాధానమినిచ్చెను. తనతో పాటుగా రాజసభకు తీసుకుని వెళ్లి సేవించుకొనెను.సంతుష్టుడైన రక్జకుని రూపములో నున్న శివుడు చిందంబరములోని కనక సభలో తాను తాండవించువేళ ,తన మువ్వల సవ్వడి చేరమానుకు వినపడునట్లు వరమిచ్చెను. ఎంతటి భాగ్యమును చేసుకున్నవో మన నాయనారు శ్రవణేంద్రియములు.ప్రతి ప్రదోష సమయముననటరాజు నర్తనమును పలుకరించుచు,పరవశించుచున్నవి. ఉన్న నిండుతనముకన్నా లేని వెలితి బాగా అర్థమవుతుందంటారు పెద్దలు. సాయం సమయమైనది.చెవులు చేటలంతవుతున్నయి మువ్వల సవ్వడికై. ఆటలేదు-పాట లేదు.నాయనారు మనసు మనసులో లేదు స్వామి మంజీరనాదము వినని చెవులు, ఏ నీ గుణములు కర్ణేంద్రియముల సోక దేహతాపంబులు తీరిపోవు, అన్నట్లుగా ,స్వామి మువ్వలసవ్వడి వినిపించని కారణము ు స్వామిపట్ల తాను చేసిన అపచారమని దుఃఖించసాగెను. దయాంతరంగుడైన పరమేశ్వరుడు స్వామికి అపచారము జరిగినదేమో అని చింతించుచున్న నాయనారుతో స్వామి,తాను తన మిత్రుడు బత్తిరణార్ సంకీర్తనములో మైమరచి మువ్వలసవ్వడిచేయుటలో ఆలస్యము జరిగినదని చెప్పగానే కుదుటపడ్డాడు. పరమదయాళుడైన పరమేశుడు నాయనారును అనుగ్రహించినట్లు మనలనందరిని అనిశము రక్షించును గాక . ఏక బిల్వం శివార్పణం

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...