మృత సంజీవని స్తోత్రము
**********************
శివ మయమే ఈ పంచభూతాత్మక ప్రపంచము
శివ దయయే మృత్యుంజయ రక్షకవచము.
పరమపుణ్యము రహస్యములకే రహస్యము
మహాదేవుని మృత సంజీవని స్తోత్రరాజము
శుభకరమీ స్తోత్ర శ్రవణము భవ హరణము
కాలభీకరము మృత్యువు ఇక కడు దూరము
సర్వదేవ సంసేవిత వరదుడు శంకరుడు
కూరిమితో తూరుపు దిక్కును చూస్తుంటాదు
మూడుముఖములతో, ఆరుచేతుల రేడు చూడు
చేతిలో అగ్గిని దాచి ఆగ్నేయము రక్షిస్తాడు
ఖడ్గముచేత ధరించి గణములు పాలిస్తాడు
రక్షోరూపిగ కరుణను నైరుతి రక్షిస్తాడు
పదునెనిమిది భుజముల వాడు, కరుణను
దక్షత గల శివుడు దక్షిణము రక్షిస్తాడు
పాశాభయ కరములు సముద్రుడు పూజిస్తాడు
విలుకాడై నిలకడ పడమర రక్షిస్తాడు
అభయము తానౌతాడు అరులను తుంచేస్తాడు
అవ్యయుడైన వాడు వాయవ్యమును రక్షిస్తాడు
కరమున శంఖము వాడు కలతలు తీసేస్తాడు
దక్షత గల శివుడు దక్షిణము రక్షిస్తాడు
శూలము ధరియిస్తాడు ఈశాన్యము రక్షిస్తాడు
విద్యలకధినాయకుడు వాడే విశ్వేశ్వరుడు
బ్రహ్మగ రూపము మార్చి ఊర్థ్వము రక్షిస్తాడు
విశ్వాత్మకుడిగ మారి అథోభాగము చూస్తాడు
వరముగ శివుడు నా శిరమును పాలిస్తాడు
బాల చంద్రశేఖరుడు లలాటము తానౌతాడు
కనుబొమల నడుమను కనులతో చూసేస్తాడు
కనుబొమల ద్వయము కరుణను రక్షిస్తాడు
ఆ కర్ణాంత నయనుడు కర్ణములు రక్షిస్తాడు
మహాదేవుడు నిత్యం మన నాసిక తానౌతాడు
వృషభజుడుగ మారి పెదవిని పాలిస్తాడు
దక్షిణామూర్తి దయతో జిహ్వను తానుంటాడు
అంతములేనివాడు దంతములు రక్షిస్తాడు
మృత్యుంజయుడు శివుడు ముఖమును రక్షిస్తాడు
నీలకంఠుడు అనిశము నా కంఠము తానౌవుతాడు
త్రిశూలి చెలిమిని నా హృదయము తానుంటాడు
ఐదు నాలుకలవాడు స్తనములు రక్షిస్తాడు
లంబోదరుని తండ్రి నా ఉదరము తానవుతాడు
పినాకపాణి నా కరములు రక్షిస్తాడు
పార్వతి పతి కరుణ నా ప్రక్క తానుంటాడు
భ్రమరాంబపతి భవుడు నాభిని రక్షిస్తాడు
గుహుని జనకుడు శివుడు గుహ్యము తానౌవుతాడు
ప్రమథులు కొలిచేవాడు పిరుదులు రక్షిస్తాడు
ఇడుములు కాచేవాడు నడుమును పాలిస్తాడు
బూడిదపూతలవాడు తొడలను రక్షిస్తాడు
సదాశివుడు చూడు పాదముగ నడిపిస్తాడు
అర్థాంగిలో దాగినవాడు అర్థాంగిని రక్షిస్తాడు
జగముల పితగ మారి సుతులను రక్షిస్తాడు
చిత్తము దాగినవాడు నా ఆయువు పెంచేస్తాడు
సర్వాంతర్యామి తానై సర్వాంగములు రక్షిస్తాడు
మృత సంజీవని కవచం మహాదేవ ప్రసాదితం
రణరంగే సదా విజయం సంతతం సంపత్ప్రదం
ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో పఠించినను-వినినను-స్మరించినను శివానుగ్రహము పొందెదరనుట శివ వాక్యము.
( ఏక బిల్వం శివార్పణం.)
తత్ సత్.
శివస్వరూపులారా,
స్తోత్రమును సంస్కరించుట శివసేవగా భావించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.
శివార్పణం.
**********************
శివ మయమే ఈ పంచభూతాత్మక ప్రపంచము
శివ దయయే మృత్యుంజయ రక్షకవచము.
పరమపుణ్యము రహస్యములకే రహస్యము
మహాదేవుని మృత సంజీవని స్తోత్రరాజము
శుభకరమీ స్తోత్ర శ్రవణము భవ హరణము
కాలభీకరము మృత్యువు ఇక కడు దూరము
సర్వదేవ సంసేవిత వరదుడు శంకరుడు
కూరిమితో తూరుపు దిక్కును చూస్తుంటాదు
మూడుముఖములతో, ఆరుచేతుల రేడు చూడు
చేతిలో అగ్గిని దాచి ఆగ్నేయము రక్షిస్తాడు
ఖడ్గముచేత ధరించి గణములు పాలిస్తాడు
రక్షోరూపిగ కరుణను నైరుతి రక్షిస్తాడు
పదునెనిమిది భుజముల వాడు, కరుణను
దక్షత గల శివుడు దక్షిణము రక్షిస్తాడు
పాశాభయ కరములు సముద్రుడు పూజిస్తాడు
విలుకాడై నిలకడ పడమర రక్షిస్తాడు
అభయము తానౌతాడు అరులను తుంచేస్తాడు
అవ్యయుడైన వాడు వాయవ్యమును రక్షిస్తాడు
కరమున శంఖము వాడు కలతలు తీసేస్తాడు
దక్షత గల శివుడు దక్షిణము రక్షిస్తాడు
శూలము ధరియిస్తాడు ఈశాన్యము రక్షిస్తాడు
విద్యలకధినాయకుడు వాడే విశ్వేశ్వరుడు
బ్రహ్మగ రూపము మార్చి ఊర్థ్వము రక్షిస్తాడు
విశ్వాత్మకుడిగ మారి అథోభాగము చూస్తాడు
వరముగ శివుడు నా శిరమును పాలిస్తాడు
బాల చంద్రశేఖరుడు లలాటము తానౌతాడు
కనుబొమల నడుమను కనులతో చూసేస్తాడు
కనుబొమల ద్వయము కరుణను రక్షిస్తాడు
ఆ కర్ణాంత నయనుడు కర్ణములు రక్షిస్తాడు
మహాదేవుడు నిత్యం మన నాసిక తానౌతాడు
వృషభజుడుగ మారి పెదవిని పాలిస్తాడు
దక్షిణామూర్తి దయతో జిహ్వను తానుంటాడు
అంతములేనివాడు దంతములు రక్షిస్తాడు
మృత్యుంజయుడు శివుడు ముఖమును రక్షిస్తాడు
నీలకంఠుడు అనిశము నా కంఠము తానౌవుతాడు
త్రిశూలి చెలిమిని నా హృదయము తానుంటాడు
ఐదు నాలుకలవాడు స్తనములు రక్షిస్తాడు
లంబోదరుని తండ్రి నా ఉదరము తానవుతాడు
పినాకపాణి నా కరములు రక్షిస్తాడు
పార్వతి పతి కరుణ నా ప్రక్క తానుంటాడు
భ్రమరాంబపతి భవుడు నాభిని రక్షిస్తాడు
గుహుని జనకుడు శివుడు గుహ్యము తానౌవుతాడు
ప్రమథులు కొలిచేవాడు పిరుదులు రక్షిస్తాడు
ఇడుములు కాచేవాడు నడుమును పాలిస్తాడు
బూడిదపూతలవాడు తొడలను రక్షిస్తాడు
సదాశివుడు చూడు పాదముగ నడిపిస్తాడు
అర్థాంగిలో దాగినవాడు అర్థాంగిని రక్షిస్తాడు
జగముల పితగ మారి సుతులను రక్షిస్తాడు
చిత్తము దాగినవాడు నా ఆయువు పెంచేస్తాడు
సర్వాంతర్యామి తానై సర్వాంగములు రక్షిస్తాడు
మృత సంజీవని కవచం మహాదేవ ప్రసాదితం
రణరంగే సదా విజయం సంతతం సంపత్ప్రదం
ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో పఠించినను-వినినను-స్మరించినను శివానుగ్రహము పొందెదరనుట శివ వాక్యము.
( ఏక బిల్వం శివార్పణం.)
తత్ సత్.
శివస్వరూపులారా,
స్తోత్రమును సంస్కరించుట శివసేవగా భావించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.
శివార్పణం.