BRAHMOEPADAESAMU

శ్రీరస్తు శుభమస్తు. బాలుడు మారుచున్నాడు బ్రహ్మచారిగ నేడు ఉపనయన సంస్కారముతో అంగరంగ వైభవముగ సంస్కారములను జరిపిస్తున్నారు శాస్త్రోక్తముగా సందడి చేస్తున్నారు వేల్పులు వేదోక్తముగా గురువగుచున్నాడు తండ్రి బ్రహ్మోపదేశము చేసి గురుతరమైనది తల్లి ఆదిభిక్ష తాను వేసి ఆనందముతో అమ్మమ్మ-నానమ్మ, ఆ తాతలు ఇద్దరు అందించుచున్నారు ఆశీసులు-ఆదిదంపతులు వారు మహనీయులు చేయుచున్న మంగళాశాసనములతో త్రివిక్రముడైనాడు చూడు దివ్యతేజముల వాడు ఎడమచేత కర్రతో-కుడిచేతను జోలితో భిక్షమడుగుచున్నాడు -సాక్షాత్తు వామనుడు అందరు అందిస్తున్నారు దీవెనలను భిక్షగా వందేళ్ళు వర్ధిల్లగ వాడు శ్రీరామ రక్షగా " చిరంజీవి సారంగపాణి శర్మ మేడూరి" ఇహ-పరముల సాధనముగ ఈ క్షణము నుండి నీవు " గాయత్రీమాతను గౌరవముగా ధరిస్తూ గాయత్రీ మంత్రమును నియమముగా జపిస్తూ" అరిషడ్వర్గములను అల్లంత దూరమునుంచు మనో వాక్కాయకర్మలను మం...