Monday, January 9, 2023

AALO REMBAAVAAY-26

 


       పాశురము-26


     ************* 


 " శరణార్థులు నీ సంశ్లేషమునే కోరువారని గ్రహించు


   శంఖములు-దీపములు-కొలుచువారిని, అనుగ్రహించు"




    స్వామి నీకు మాయందుగల వాత్సల్యము-మాకు నీయందుగల వ్యామోహము నీ నీలమణివర్ణ  పారదర్శకత పదేపదే చెబుతున్నది.అయినను మా మీది అనుగ్రహము నీతో పదేపదే "సంభాషించు భోగమును" ప్రసాదించుటకా యన్నట్లు" ఏమికావాలని ఏమీ తెలియనట్లు"




ప్రశ్నించుచున్నావు  అని అంటున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.

ఇరువది ఆరవ పాశురం

*********************


మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్

మేలైయార్ సేవననగళ్ వేండువన కేట్టియేన్

ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన

పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే

పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు డయనవే

శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే,

కోళ విళక్కే,కొడియే,వితానమే

ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!


 మాలే-ఆశ్రితవాత్సల్య స్వరూపమా!

 మణివణ్ణా-మా మనసులోని భావములను గ్రహించినవాడా!


 యాం వేండువన కేట్టియేల్-మాకు కావలిసినవాటిని స్పష్తముగా చెబుతాము.శ్రద్ధగా వినుము.తరువాత వీలేదాకు.మాకు వాటిని అనుగ్రహిస్తే నోము నోచుకొనుటకు వెళ తాము అంటున్నారు  చతురగోపికలు.

 నిన్నటి పాశురములో స్వామి మాకు నోము సంకల్పము-నోము ఆచరణము-నోముఫలము నీవే అన్న మాట మరిచినారా  ఏమిటి? ఈ రోజు మాకు కావలిసిన  వస్తువుల పట్టికను మీముందుంచుతాము అంటున్నారు  అన్న సందేహము రాకమానదు.

 పైగా వారికి కావలిసిన వస్తువుల సంఖ్యలు అనేకానేకములట,అతి సమర్థవంతములట ,అంతెందుకు   వాటికవే సాటి అంటున్నారు.


 జాబితాని ఒకసారి పరిశీలిద్దాము.


1.శంఖములు

2.పఱ వాయిద్యములు

3.భాగవతులు

4.మంగళదీపములు

5.కేతనములు

6.మేలుకట్లు/చాందినీలు

7.ఆశీర్వచనములు.

 ఓస్ ఇంతేనా అనుకుంటే పొరబడినట్లే.

 అదితెలుసుకొనుటకు మరింత జాబితాను పరిశీలిద్దాము.

 1.శంఖములు.

   *********

 స్వామి శంఖములేకదా వైకుంఠములోతాను ధరించినదో,ఆణిమళై కన్నా పాశురములో పద్మనాభుని చేతిలోనిదో,లేదా గోవులను అదిలించుటకు బృందావనములో తానాడుకొనుచున్నదో ఇద్దామనుకొన్నట్లున్నాడు.అది గమనించిన గోపికలు,

1.అనేకానేక సంఖ్యలలో శంఖములు కావాలి. 

2శంఖములు పాలవలె తెల్లగా స్వఛ్చముగా ఉండాలి. 

3.వాటిని పూరించినపుడు సకలజగములు భయముతో గదగడలాడాలి.

4. ఇన్నిమాటలెందుకు అసలు పాంచజన్యములే కావాలి  అని అడుగుతున్నారు.

ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన

పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే

 ఏమిటా పాలనుపోలిన తెల్లదనము-స్వచ్ఛత  అనగా

 శుద్ధసత్వగుణశోభితములుగా ఉండాలి.

 కాని అవసరమైనప్పుడు

పూరించినవేళ జగములన్నీ గడగడలాడాలి.అంటున్నారు.(ప్రణవము) నినదిస్తుండాలి.

 సంబరముగా వింటున్నాడు స్వామి.

2.ముందుచూపుతో శాలం పెరుంపఱ్యై-కావాలన్నారు.

 స్వామి ఎక్కడ వామనావతారములో ఆనందముతో జాంబవంతుడు మ్రోగించిన పఱను ఇస్తానంటాడోనని 


 శ్రీరామావతారములో లంకను జయించిన సందర్భముగా మ్రోగించిన పఱను ఇస్తానంటాడేమోనని అవి పఱ,పెరుం పఱ మాకు కావలిసినది నీవు కుంభనృత్యముచేయునప్పుడు నడుముకు కట్టుకుంటావే  అది,ఆ 

 "శాలప్పెరుంపఱ"  అని స్పష్టముగా చెప్పారు.


  ఇక్కడ మనము పెద్దలు చెప్పిన శ్రీకృష్ణుని కుంభ నృత్యమును ఒక్కసారి స్మరించి-తరిద్దాము.


స్వామి నడుమునకు పఱను కట్టుకుని,కుండలను ఎగురవేసి,దానిని పట్టుకునే లోపల ఒక్కసారి పరవాయిద్యమును చేసి పైనుంచి వచ్చే కుండను పట్టుకునేవాడట.


 కించిత్ ఆశ్చర్యముతో గోపికల మాటలను వింటున్నాడు స్వామి.

3.పల్లాండు ఇసై పారే

  ************

 వ్రతమునకు నాందిగా శంఖమును పూరిస్తాము.పఱను వాయిస్తాము.స్తోత్రములు చేయుటకు మాకు "గుంపుగాయకులు" కావాలి.వారు తత్త్వము తెలిసినవారై యుండాలి.తన్మయులై నిన్ను కీర్తించగలగాలి.సకల జనులను తరింపచేయగల సామర్థ్యమును గలిగియుండాలి అను అడుగుతున్నారు.(ఆళ్వారులను) 

  తనను తాను మరచిపోయి తలనూపుతున్నాడు స్వామి.

   అంతలోనే బహిర్ముఖునిచేస్తూ గోపికలు,

4.మేము నోము ప్రారంభసూచకముగా 'దీప ప్రజ్వలనమును  చేయాలికదా."దీపేన సాధ్యతే సర్వం" అని కదా అంటారు.కనుక మాకు మామూలు దీపములు కాదు.అనేకానేక మంగళదీపములు కావాలి అని అడిగారు.

 మందస్మితముతో "మహాలక్ష్మి నీలాదేవి"  మీదగ్గరే ఉన్నదికదా అనుగ్రహించాను అన్నాడు అప్రయత్నముగా.

5.స్వామి మాకు మీ భవనమును గుర్తించుటకు  సులువైన మార్గముగా "నాయగనాయ్' పాశురములో కొడి ని చెప్పావు.మానోము స్థలిని గుర్తించుటకు అంతే పవిత్రమైన ధ్వజము /కేతనము కావాలి.అది బలముగా ఎగురగలగాలి.నోము ఫలమును అందించగలగాలి అని అన్నారు.

  ఆలోచిస్తున్నాడు స్వామి.అందుకున్నారు గోపికలు.

 అదే నీ గరుత్మంతుని మా నోముస్థలిని గుర్తించుటకు  కేతనముగా పంపు అన్నారు.

  పరవశించిపోతున్నాడు స్వామి.బదులు పలుకలేక యున్నాడు.

  ఇంకా పూర్తికాలేదంటూ 

6.స్వామి మా వ్రతమును ఎవరు అడ్దుకుంటారో అసలే చుట్టు అసురులు అందుకని మాకొక మేలుకట్టు/చాందినీ అదియును మామూలిది కాదు.మహా విశాలముగా ఉండాలి.వేయికనులతో చూస్తూ విపత్తులను తరిమివేయాలి అన్నారు.ఏది అంటే ఆదిశేషుని అనుగ్రహించవయ్యా అంటున్నారు.

 ఆశ్చర్యపోవటము స్వామి వంతు అయినది.

 నన్ను చేరుతామని నిన్న అన్నారు.నా విభవముతో సహా నేడు తమదగ్గరికి తరలిరావాలంటున్నారు అనుకొని,

 పైకి అమాయకముగా

 ఇంతేనా? చాలా/ ఇంకా ఏమైనా కావాలా?

 అయినా 

 ఇవన్నీ నేనెక్కడి నుండి తేగలను? అని అడిగాడట గోపికలను.

 అందులకు వారు ప్రసన్నముగా నీ సామర్థ్యము మాకు తెలుసులే,

ఆలిన్ ఇళయాం-ఓ వటపత్ర శాయి అని సంబోధించారట.

  ప్రళయ సమయములో ప్రపంచమంతయు మునిగిపోయినను(స్వామి ఉదరములో దాగినను)మార్కండేయ మహాముని చెక్కుచెదరక (చిరంజీవికదా) పుణ్యఫలముగా వటపత్రశాయిని దర్శించగలిగినాడట.స్వామి ప్రత్యక్షమై వరము కోరుకోమనగానే పులకితుడై కృష్ణమాయలో లేశమును తాను అనుభవించే భాగ్యమును కలిగించ మన్నాడట.వెంటనే స్వామిదయతో జలములోనికి వెళ్ళినాడట

చూసిన అక్కడ ఏమీ కనీసము స్వామికూడా,  మార్కండేయ  మునికి కనిపించలేదట.చింతాక్రాంతుడైన మునిని కరుణించి స్వామి పున:దర్శన భాగ్యమును కలిగించాటడ.మన  గోపికలలో మార్కండేయ మహాముని తత్వచింతనయే తలపునకు వచ్చింది.

" కరార విందేన పదారవిందం

 ముఖార విందే వినివేశయంతం

 వటస్య పత్రస్య పుటెశయనం

 బాలం ముకుందం మనసా స్మరామి"-బాల ముకుందాష్టకం (లీలా శుకులు)

 స్వామి అవియే కాదు వాటితో పాటుగా నీ ఆశీర్వచనముగా నీ పీతాంబరమును మాకు శేషవస్త్రముగా అనుగ్రహిస్తే సంతోషముగా నోముస్థలికి చేరుతాము అన్నారట.



 స్వామి చిలిపిగా ఇన్ని విషయములు తెలిసిన మీకు నోమును నోచుట అవసరమా అని అడుగగానే వారు వినయముతో, 

మేలైయార్ సేవనగల్

***************

 మా పెద్దలు లోకక్షేమమునకై నమ్మి ఆచరించిన సంప్రదాయముతో మేముసైతము పెద్దల అనుమతితో గోకుల సుభిక్షతకై ప్రతినపూని నియమములతో ఆచరిస్తాము.

 స్వామి నీ అనుగ్రహము వలన మేము వదలవలసినది కర్మానుష్ఠానము కాదని అది చేయువేళ ఆవహించు కర్తృత్వము ( నేను చేస్తున్నాను అన్న)  భావనని తెలుసుకున్నా మనుచున్న గోపికలతో నున్న,


 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...