దూరీకర్తుం వాంఛసి కిం-03
.jpg)
"కిం గంగాబుంధి బింబితే అంబర మణౌ చాండాలవీధీ పయః పూరేవమంతర్మస్తి కాంచనఘటీ మృత్కుంభయోవ2హ్ అంబరే ప్రత్యక్ వస్తుని నిస్తరంగ సహజానంద అవబోధాంబుధౌ విప్రోయం శ్వపచోయం ఇత్యపి మహాన్ "కోయం" విభేద భ్రమః." పద విభజన అంబరమణి-బింబితే గంగాంబుధి అంబరమణి బింబితే చాండాల వీధీ పయః అంబర మణి -సూర్యబింబము. ఇక్కడ సూర్యునికి శుభ్ర-అశుభ్ర వ్యత్యాసములు లేవు.కనుకనే తన కిరనములను శుభ్రమైన గంగాజలములపై వ్యాపింపచేసినను, అశుభ్రముగానున్నఛండాల వీధిజలములో వ్యాపింపచేసినను వాటి స్థితిచే ఏ మాత్రమును ప్రభావితము కావు. అంబర పదమునకు ఆకాశమునకు అన్వయించుకుంటే ఆకాశము యొక్క ప్రతిబింబము మట్టికుండ యందైనాను/స్వర్ణకుంభమునందైనను వాటి లోహ ప్రభావమును స్వీకరించక ఒకే విధముగా ఉన్నట్లుగా పరమాత్మ చైతన్యము పరిమితముగా మారినప్పట్కిని అది అపరిమితమే. మృత్ కుంభము-మట్టికుండ పాత్రలలోనికి ప్రవేశించిన జలము పరిశుద్ధము.పాత్రలు జలమును ప్రభావితము చేయలేదు. సూర్యకిరణములు-జలము చైతన్యమునకు ప్రతీకలుగాను, ...