సౌందర్య లహరి-16
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా
అల్లకల్లోలమైన మనసు నన్ను సన్నగా గిల్లుతోంది
ఎర్రనైన కోపములో నేను వెర్రిపనులు చేస్తున్నా
చిర్రు-బుర్రులాడు మనసు నన్ను గుర్రుగా చూస్తోంది
తెల్లనైన తెలివితో నేను తెలిసికొనగ తప్పులన్నీ
తెల్లబరచె నాలోని తెలివి తక్కువతనాన్ని
సత్వ-రజో-తమో గుణములు సద్దుమణుగి, సత్వరముగ
పరాత్పరికి కర్పుర హారతిగ అర్పణము యైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
అథాంగ పూజలో ఒకటైన ఆత్మ రతి యే హారతి.జీవాత్మ పరమాత్మను దర్శించి మమేకమగుటయే హారతి లక్ష్యము.వత్తులను ఆవు నేతిలో ముంచి హారతి ఇచ్చుట ఒక పద్ధతి. వత్తుల సంఖ్యను బట్టి హారతులు వర్గీకరించబడినవి.వత్తుల హారతియే కాక,బిల్వ హారతి,సింహ హారతి,కుంభ హారతి,నంది హారతి,కుంభ హారతి
నక్షత్ర హారతి ఇలా అనే హారతులను ఆ యా సందర్భానుసారముగ ఇస్తుంటారు.
హారతి యొక్క నిర్వచనము భక్తుల యొక్క మానసిక స్థితినిబట్టి మారుతుంటుంది.తల్లికి దిష్టి తీస్తున్నట్లు కొందరు అనుకుంటే,జ్యోతి సహాయముతో పరంజ్యోతి దర్శనముగా మరికొందరు అనుకుంటారు.చీకటి తమోగుణ సంకేతమైతే దానిని తొలగించే వెలుగును ( నా తామస గుణము తొలగినడి.అతి స్వచ్చతతో ప్రకాశించే నా మనసును హారతిగా) ఇచ్చిననిన్ను చూచుటకు చర్మచక్షువులు అశక్తములు కనుక నీ తేజపు సూక్ష్మముగా,హారతిని వెలిగించి,దాని సహాయముతో ఆపాద మస్తకము దర్శించుకోనీ తల్లీ అని వేడుకొని,తరించుట.( దేవతా హారతి పాదములతో ప్రారంభమయి క్రమముగా ముఖారవిందమును సేవిస్తుంది.)
ఇక కర్పుర హారతి పాపములను హరించివేసే స్వభావము కలది అని కొందరు అనుకుంటే మరికొందరు కర్పుర విశిష్టను తానుకరిగిపోతూ వెలుగు విరజిమ్ముటయే కాక హారతి అనంతరము ఏ మాత్రము తన అవశేషములను వదలక ఆత్మార్పణ అయే ఏకైక సుగంధ ద్రవ్యము.
వత్తుల హారతుల,మిగిలిన హారతుల విషయములో వెలుగులు జిమ్ముతాయి కాని కొన్ని అవశేషాలను మిగుల్చుతాయి.
అగ్గి తన భక్తిని చాటగ అమ్మను చేరి ఆనందిస్తున్నదని,తానేమి తక్కువ కానని జలము చేరి ఆహారతినిచుట్టుతున్న వేళ,చెంతనే నున్న నాచేతినివిడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.