Sunday, September 13, 2020
SIVA SANKALPAMU-89
ఓం నమ: శివాయ-89
******************
" అనిశము వశమగుతావు" పశునామములకు నీవు
"పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు
"కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు
"శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు
మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు
వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు
"స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు
వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు
జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి"
శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు"
" పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
"కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా.
శివునికి పశువులన్నా-పశునామములన్న పక్షపాత బుధ్ధిని ప్రదర్శిస్తుంటాడు.వాటిని అనుగ్రహించడమే కాకుండా వాటిపేర్లను తన పేర్లగా ప్రకటించుకొని మురిసిపోతుంటాడు.శరభము (సగము పక్షి+సగము సింహము),కుక్కుటము (కోడి),కాళము/వ్యాళము,(పాము),వ్యాఘ్రము (పెద్దపులి),జంబుకము (నక్క),కుక్క వాహనమెక్కిన కాలభైరవునిగా గొప్పలు పోతుంటాడు.నన్ను నీ కరుణ అను పాశముతో బంధించి,కాపాడమంటే,నా భక్తి సరిపోలేదని చెప్పవచ్చునుకదా! అహ అలాకాకుండా కప్పలు అను మరొక ఉభయచరమును తలచుకొనుచు,నేను దాని వలె నిలకడగా త్రాసులో లేనని నిష్ఠూరములాడుతున్నాడు-నింద.
పశువు నమః శివాయ-పాశము నమః శివాయ
కప్ప నమః శివాయ-తక్కెడ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
పశుపతి అష్టకము
**************
స్తుతించు పశుపతి శశిపతి సతిపతిని
స్మరించు నాగపతి లోకపతి జగపతిని
జనార్తిహరుని చరణములు శరణమని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
నిత్యముకారు రారు తలితండ్రులు బాంధవులు
సత్యముకావు చూడు తరలు సిరిసంపదలు
మృత్యు కబళించువీని కాలవసములని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
చిన్న మురజను పెద్ద డిండిమను శివుడు
మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు
ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుదని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని,
శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు
కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు
శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు
మణికుండలముల భుజగ హారముల రేడు
నగజనాథుని దయ నరశిరో రచితుని
భజింపుము భక్తితో మనుజగిరిజపతిని.
యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను
యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు
దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
జాలిలేని జరామరణములకు జడియక
సారహీనపు సంసార భయమును తోసివేయుచు
సాగుచునున్న చరాచర హృదయ సంస్థితుని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
హరి విరించి సురాధిపులు కొలువుతీరగ
యమ కుబేర దిక్పతులు నమస్కరించుచుండ
భవరోగ భంజనుని భువనత్రయాధీశుని
భజింపుము భక్తితో మనుజ గిరిజ పతిని.
కవి సూరి ఒక మహారాజు శివ భక్తుడు అన్నవివరములే లభ్యమైనవి.
పరమపవిత్రమైన ఈ స్తోత్ర పఠనము శ్రవణము స్మరణము సకలముక్తిప్రదము.
సర్వేజనా సుఖినో భవంతు.సమస్త సమ్మంగళాని భవతు.
సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తి తథ్యం.
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-88
ఓం నమః శివాయ-88
****************
గలగలపారే గంగను జటలో చుట్టేసినావు
భగభగ మండే అగ్గిని నుదుటను కట్టేసినావు
శశకమనే చంద్రుని సిగను సింగారించునావు
విర్రవీగు విషమును కంఠమునబంధించినావు
చరచర పాకు పాములను చతురత పట్టేసినావు
కూరిమితెలియని పులినిఒలిచిపెట్టేసినావు
రిపులగు త్రిపురాసురులను మట్టుపెట్టేసినావు
పరమనీచులైన వారి పాపములను పాపినావు
తిర్యక్కులను గాచితిమిరము నెట్టేసినావు
నీ చుట్టు తిరుగుచున్న నా పాపములను చుట్టేసి
శ్రీరస్తు అని కావగ శ్రీకారము చుట్టమంటే
పక్క చూపులెందుకురా ఓ తిక్క శంకరా.
గంగానదికి పూజ్యతను కలిగించాడు.అగ్గిని ఆరాధ్యనీయము చేసాడు.శాపగ్రస్థుడైన చంద్రుని శిరమున ధరించాడు.హాలాహలమును తనలో దాచుకొని అర్చనలను పొందునట్లుచేసాడు.పరమనీచముగా ప్రవర్తించిన రాక్షసులను పవిత్రులను చేసాడు.క్రిమికీటకములకు సైతము పాపపుణ్యములను లెక్కించక ఆదరించిన శివుడు,నాపై తన కృపాకటాక్షమును ప్రసరించుటకు నిర్లక్ష్యము చేస్తున్నాడు-నింద.
లక్ష్యం నమః శివాయ-నిర్లక్ష్యం నమః శివాయ
ద్వంద్వం నమః శివాయ-నిర్ద్వంద్వం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఉపేక్షానో చేత్కిం నహరసి భవధ్ధ్యాన విముఖాం
దురాశా భూయిష్ఠాం విధిలిపిమ శక్తో యదిభవాన్
శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
కథంవా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితం"
శివానందలహరి.
శివా! నీవు కాలభైరవుని సృష్టించి వాని కొనగోటితో బ్రహ్మ అహంకారపు తలను గిల్లించినాడవు.కాని నిన్ను ధ్యానించుటకు వెనుకాడుచున్నది,నీ అనుగ్రహమును నిరంతరము శంకించుచున్నది,దురాశతో నిండినది అయిన మనసుగల నా తలరాతను మార్చుట కానిపనికాదు. ఆలస్యము చేయక,నన్ను అనుగ్రహించుతండ్రీ -స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-87
Om nama@h Sivaaya-87
**********************
పాల కడలి జనించిన గరళము నిను చేరితే
మురిపాల పడతి లక్ష్మి హరిని శ్రీహరిని చేసింది
శరభ రూపమున నీవు శ్రీహరిని శాంతింప చేస్తే
విభవమంత హరిదేగా ప్రహ్లాద చరిత్రలో
చిలుకు ఏకాదశినాడు చక చక నిద్ర లేచేసి
దామోదరుడు నిన్ను చేరినది మోదము కొరకేగా
అభిషేక జలాలతో నీవు ఆనందపడుతుంటే
అలంకారాలన్ని హరి తన ఆకారాలంటాడు
అనుక్షణము నీవు అసురత చండాడుతుంటే
లక్షణముగ హరి తులసిని పెండ్లాడాడు
అలసటయే నాదని ఆనందము హరిది అని
ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా!.
శివుడు తన పనులు తాను చేసుకుపొతాడు తప్ప ఆ పనులు తనకు ఉపయోగకరమా/కాదా అని ఆలోచించడు.అంతే కాదు తన చేత పనులను చేయిస్తూ,వాటి ఫలితములను అనాయాసముగా ఇతరులు (హరి) పొందుతున్నాడన్న విషయమును కూడ గుర్తించలేడు.కనుకనే క్షీరసాగర మథనములో హరునకు విషము-హరికి సిరి లభించాయి.తన నరసింహావతారమును ఉపసంహరించుకోలేని హరి,శరభరూపుడై(లక్ష్మి)యై తనను శాంతింపచేసినాడన్న విషయమును మరుగుపరచి,తన ప్రహ్లాద రక్షణమును ప్రకటితము చేసుకోగలిగాడు.అభిషేకజలాలతో ఆనందములో మునిగితేలుతూ,తనకు అలంకరించవలసిన పట్టుపీతాంబరములు,వనమాలలు,పరిమళద్రవ్యము హరి ముస్తాబుచేసుకుంటున్నాడన్న సంగతి కూద గమనించలేని అమాయకుడు శివుడు-నింద.
అభిషేకము నమః శివాయ-అలంకారము నమః శివాయ
అలసట నమః శివాయ-ఆనందము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
యమధర్మరాజకృత శివకేశవ స్తుతి
********************************
1.గోవింద మాధవ ముకుంద మురారి
శూలపాణి శశిశేఖర శంభో శంకర
అచ్యుత జనార్దన దామోదర వాసుదేవ
స్మరణము యమభటులనుంచు దూరము.
2. అంధకాసురవైరి నీలకంఠ గంగాధర
కైటభాసురవైరి వైకుంఠ పద్మపాణే
భూతేశ ఖండపరశు మృదేశ చండికేశ
స్మరణము యమభటులనుంచు దూరము.
3. నారసింహ మధుసూదన చక్రపాణి పరాత్పర
గౌరీపతి మహేశ్వర చంద్రచూడ శంకర
నారాయణ అసురాంతక మాధవ శార్ఙధర
స్మరణము యమభటులనుంచు దూరము.
4. ఉగ్రా! విషమేక్షణ కామవైరి మృత్యుంజయ
శౌరి! పీతవసన శ్రీకాంతుడ నీలమేఘ
ఈశాన! కృత్తివసన త్రిపురారి లోకనాథ
స్మరణము యమభటులనుంచు దూరము.
5. శ్రీకంఠ దిగంబర గౌరీపతి పినాకపాణి
శ్రీహరి మధువైరి శ్రీపతి పురుషోత్తమ
శ్రీమంత నాగభరణ పశుపతి చంద్రమౌళి
స్మరణము యమభటులనుంచు దూరము.
6.సర్వేశ్వర దేవదేవ త్రిపురాంతక శూలపాణి
గరుడధ్వజ పరబ్రహ్మ నరకాంతక చక్రపాణి
వృషభధ్వజ తుండమాలి నిటలాక్ష చంద్రమౌళి
స్మరణము యమభటులనుంచు దూరము.
7.రమాపతి రావణారి రాఘవ శ్రీరామ
భూతపతి మదనారి శంకర ప్రమథనాథ
ఇంద్రియపతి చాణూరారి మురారి జగన్నాథ
స్మరణము యమభటులనుంచు దూరము.
8. శూలి బాలేందుమౌళి హరా గిరీశ
చక్రి కంసప్రాణాపహారి హరి రాధేశ
భర్గ త్రిపురాసురవైరి హరా మహేశ
స్మరణము యమభటులనుంచు దూరము
9.గోపీపతే యదుపతే మాధవ వాసుదేవ
గౌరీపతే వృషభధ్వజ పాహి మహాదేవ
కర్పూరభాస గోవర్థనధర దేహి దేవదేవ
స్మరణము యమభటులనుంచు దూరము
10. స్థాణువు త్రినేత్రుడు పినాకపాణి
కృష్ణా కమలాకర శిఖిపింఛమౌళి
విశ్వేశ్వర త్రిపధధర చంద్రమౌళి
స్మరణము యమభటులనుంచు దూరము.
కాశీఖండములో యమునిచే చెప్పబడిన శివకేశవ నామములను పఠించినవారి వద్దకు పోవద్దని యముడు తన భటులకు ఆనతిచ్చెనట.ధూర్జటి కవి అన్నట్లు సదాభజన చేయు మహాత్ముల పాదధూళిని నా శిరమున ధరించి, వారిని గౌరవిస్తాను.కనుక భటులు వారివద్దకు పోరాదని యమధర్మరాజు ఆన.శివ కేశవ నామములు స్మరించువారికి జన్మరాహిత్యము తథ్యము.
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-86
ఓం నమః శివాయ-86
*****************
నిన్నే సొంతమని సేవిస్తే సుంతైనా కానరావు
ఎంతలేసి మాటలనిన సొంతమని అంటావు
నిన్నుచూడ తపియించగ నిరీక్షణే మిగుల్చుతావు
నువ్వెంతన్నవారి ముందు ప్రత్యక్షము అవుతావు
కరుణించే వేళలలో కఠినముగా ఉంటావు
లెక్కలేదన్న వారిపై మక్కువ చూపుతావు
మనసును కట్టేయమంటే బెట్టు ఎంతో చేస్తావు
కట్టుబాటు లేనివానిని కట్టి పడేస్తుంటావు
ముసలితనము వచ్చినా ముక్కిమూల్గమంటావు
పసికందుల హతమార్చి కసితీర్చుకుంటావు
నీ పనులప్రభావము నీకసలు తెలియదుగా
మక్కువలేదంటున్నారురా ఓ తిక్కశంకరా.
శివుడు నువ్వు లేవని,నిన్ను లెక్కచేయనని,మోసగాడివని,నీ అవసరము నాకు లేదని,నీకు ప్రీతికరమగు విధముగా నేనెందుకు ఉండాలని తర్కము చేసే మంజునాథుడి లాంటి వారిపై మక్కువ చూపిస్తాడు కాని భక్తితో కొలిచే వారికి,అనుగ్రహమునకై పరితపించే వారిపై నిర్లక్ష్యమును చూపుతు,సందర్భోచితము కాని కాని పనులను చేస్తుంటాడునింద.
ప్రత్యక్షము నమః శివాయ-పరోక్షము నమః శివాయ
విరుధ్ధము నమః శివాయ-సన్నధ్ధము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" ఆద్యాయామిత తేజసే శ్రుతివదైః వేద్యాయ సాధ్యాయతే
విద్యానంద మయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే
ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైః గేయాయ మాయావినే
సమ్యక్తాండవ సంభ్రమాయ జటనే సేయం నతిశ్శంభవే"
శివానందలహరి.
ఆదిదేవుడు,అమితమైన తేజశ్శాలి,వేదవచనములచే తెలియబడువాడు,విద్యానందమయుడు,ముల్లోకములను సంరక్షించుచు( దానిని సామాన్య మనసులకు తెలియనీయకుండ మాయ అను పొరను కప్పువాడు) గొప్ప తాండవమును చేయుచు,జగములను రమింపచేయు శివునకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-85
ఓం నమః శివాయ-85
*******************
అమ్మ ప్రేమ పరీక్షింప ఆదిభిక్షువైనావు
ముచ్చట తీర్చగ వేశ్యకు ముసలివాడినంటావు
పంది మీద పందెమేసి ఎరుకగా మారతావు
సింహమును శాంతింపగ శరభములా ఎగురుతావు
దేవతల మదమడచగ యక్షుడుడనని అంటావు
మునిపత్నుల పరీక్షింప మన్మథుడిగ మారతావు
పట్టుకుంటాడంటూ చెట్టు తొర్రలో దూరుతావు
చందనాలు వీడినీవు చండాలుడివవుతావు
గురికుదిరించాలంటు మురికివాడివవుతావు
పాఠము నేర్వాలని పరకాయ ప్రవేశమే చేస్తావు
మార సంహారకా నీకు మారువేషములెందుకంటే
బిక్కమొగము వేస్తావురా ఓ తిక్క శంకరా.
శివుడికి ఒక నిర్దిష్టమైన ఆకారములేదు.నిలకడయైన మనసులేదు.అతి చంచల స్వభావముతో ఒకసారి ముసలివానిగాను మరొకసారి మురికివానిగను,ఒక సారి ఎరుకగాను,మరొకసారి పిరికి గాను,ఒకసారి శరభముగాను,మరొకసారి శవములో దూరినవాడుగాను,ఒకసారి యక్షునిగాను,మరొకసారి లక్షణునిగాను,ఒకసారి పంచమునిగాను,మరొకసారి పంచభూతునిగాను ప్రకటితమగుతు,భక్తుడు మారువేషములెందుకని ప్రశ్నించగానే,సమాధానమునీయలేక సతమతమవుతుంటాడు-నింద.
ప్రఛ్చన్నము నమఃశివాయ-ప్రకటనము నమః శివాయ
వేషము నమః శివాయ-శేషము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
చూపు నిచ్చినది దేవుడైన మరి అంధులనేల సృజించె
పలుకు నిచ్చినది దేవుడైన మరి మూగల నేల సృజించె అన్న చెల్లి సందేహమునకు,
అక్క వేద శాస్త్రములు చదివిన వారె ఎరుగరు సృష్టి రహస్యం
అల్పబుధ్ధితో ప్రాణదాతనే సలుపకు పరిహాసం,అని సమాధానమిస్తుంది.ఇది ఒక సినీగేయము మనకు అందించే అద్భుతమైన నగ్నసత్యం.సర్వజ్ఞుడు పరమాత్మ.సర్వజ్ఞులమని భ్రమలో నున్న వారము మనము.
పంచకృత్య నిర్వహణకై పరమాత్మ నిరాకారుడైనప్పటికిని,అనేక ఆకారములను ప్రకటింపచేస్తూ,నిరంజనుడైనప్పటికిని అనేక (రంగులను) స్వభావములను మనకు భ్రమింపచేస్తు లీలను అవలీలగా అందిస్తున్నాడు.
శివాభ్యాం నతిరియం.
శుభస్వరూపులైన శివపార్వతులకు నమస్కరించుచున్నాను.
పునర్భవాభ్యాం శివాభ్యాం నతిరియం.
జగత్కళ్యాణమునకై మరల మరల ప్రకటింపబడు శివ-పార్వతులకు నమస్కరించుచున్నాను.
అస్తోక త్రిభువన శివాభ్యాం నతిరియం.
సమస్తమును ఆవరించిన మూడులోకములను రక్షించుచున్న శివపార్వతులకు నమస్కరించుచున్నాను.
ఆనంద స్పురత్ అనుభవాభ్యాం శివాభ్యాం నతిరియం.
ఆనంద ప్రకాశమును అందించుచున్న ఆదిదంపతులైన శివపార్వతులకు నమస్కరించుచున్నాను. శివాభ్యాం నతిరియం.శివశివాభ్యాం నతిరియం.
( ఐహికమైనది క్షణికమైనది సంతోషము.అద్భుతమైనది శాశ్వతమైనది ఆనందము.)
అనంతకళ్యాణ గుణభ్యాం నతిరియం.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-84
ఓం నమః శివాయ-84
******************
నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది
నీ అంగ కరన్యాసములు అర్థముగాకున్నవి
నీ రుద్ర నమక-చమకములు నన్ను మొద్దు అంటున్నవి
నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి
నీ శత ఎనిమిది నమములు నన్ను సతమతము చేస్తున్నవి
నీ దండకములు అసలు అండ కానేకానంటున్నవి
నీ అష్టకములు నావాక్కు స్పష్టము కాదంటున్నవి
నీ షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది
శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకమగుచున్నవి
నీ పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది
గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని
ఒక్క మాట చాలనవేర ఓ తిక్క శంకరా!
శివుని భక్టుడు తనకు నమక-చమకములు,అంగన్యాస-కరన్యాసములు,పంచాక్షరి-అష్టకములు,అష్టొత్తర-సహస్రనామములు చదువలేనని,కనుక శివ నామ జపమును మాత్రమే చేస్తానని అంటుంటే శివుడు కిక్కురుమనుటలేదు.భక్తుని తికమక పెడుతున్నాడు.నింద.
నమకం-నమఃశివాయ-చమకం నమః శివాయ
న్యాసం నమః శివాయ-మహన్యాసం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
నా రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.
పంచభూత పంచేంద్రియ తత్త్వమే పరమేశ్వరత్వము అని తెలుపునది పంచాక్షరి.అష్టమూర్తి తత్త్వమును తెలుపునది అష్టకము.మన 27 నక్షత్రముల నాలుగు పాదములను గుర్తించుటయే అష్టోత్తర శతనామావళి.సహస్రము అను శబ్దమునకు వేయి అను సామాన్యార్థమును స్వీకరించినప్పటికిని,అనతత్త్వానికి,అసంఖ్యేత్వానికి నిలయమై ఆనందధారలను జాలువారు ఆదిదేవుని అనుగ్రహ ప్రతీక.భక్తుడు బాహ్యముగా ప్రకటితమగుచున్న తన చేతులలో,శరీర భాగములను కదిలించుచున్న చైతన్యమును ఈశ్వర శక్తిగా గుర్తించి,దానిని గౌరవించుట అంగన్యాస-మహన్యాసములు.శరీరమును చైతన్యమును చేయుచున్న శక్తిని గుర్తించి గౌరవించుటయే మహన్యాసము.తనను నడింపించుచున్న శక్తికి నమస్కరించుట (కృతజ్ఞతతో) ఆరాధనకు సిధ్ధమగుట.అంటే ఇప్పటి వరకు ఈ దేహమనే భాండమును శుధ్ధి చేసి,భక్తి సమర్పణమను పాకమును వండుటకు సిధ్ధమగుతున్నాడు సాధకుడు.అర్హతను అధికారమును శివుని అనుగ్రహముతో పొందినాడు.బాహ్యప్రకటనమును గమనించిన తరువాత -బహిర్ముఖము నుండి అంతర్ముఖమగుటయే శివ నామము.రెండు లక్షణమైన అక్షరములు.గడ్డికొనవలె (నీవార శూకము) మన హృదయములో ప్రకాశించు జ్యోతిని దర్శించగలిగినవాడే ధన్యుడు.అదే శుభము-చైతన్యమును గుర్తించుట.తనలోని రుద్రుని గుర్తించి,తాను రుదునిగా మారుట.అంతా ఈశ్వరానుగ్రహమే కాని ఇతరము కాదు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-83
ఓం నమః శివాయ-83
********************
మరుని శరము నిన్ను చేరి మనువాడమని
మదనుడు అనగానే గౌరీపతివి అయినావు
క్షీరసాగర మథనమున విషమును స్వీకరించమని
అమ్మ నిన్ను అడగగానే గరళకంఠుడివి అయినావు
గంగవెర్రినెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని
భగీరథుడు అనగానే గంగాధరుడుగ మారినావు
గంగిరెద్దు మేళములో నీకు రంగవస్త్రమౌతానని
కరిరాజు అనగానే గజచర్మధారివి అయినావు
భృంగి సైగ చేయగనే నీ సింగారపు నాట్యమట
" సంధ్యారంభ విజృంభితవు" నీవు కావని
" సంజ్ఞారంభ విజృంభితుడవు" పాపం నీవని
పెక్కుమార్లు విన్నానురా ఓ తిక్క శంకరా.
శివుడు తాను స్వంతముగా ఆలోచించి పనులను చేయలేని వాడు కనకనే ఇతరులు చెప్పిన పనులను చేస్తూ,దానికి తగినట్లుగా గౌరీపతి-గరళకంఠ-గంగాధర-గజచర్మాంబరధర-సంధ్యారంభ విజృంభిత నాట్య అను కొత్త పేర్లను కలుపుకుంటాడు.కన్నుల పండుగగా నున్నానని సంతోషపడుతుంటాడు కాని అందరు వారికిష్టమైన -కష్టమైన పనులను శివునిచే చేయించి,లబ్ధిని పొందుతున్నారన్న విషయమును గ్రహించలేని అమాయకుడు-నింద.
చర్మము నమః శివాయ-మర్మము నమః శివాయ
బాణము నమః శివాయ-భార్య నమః శివాయ
నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధమా
హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేమణాచాదృతః
సత్చక్షు స్సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసే విభుః"
శివానందలహరి.
స్వామీ నీ కరుణను అర్థము చేసుకోలేని మా అజ్ఞానము వీడినది.శ్రీశైల భ్రమరాంబికాపతి,భృంగిని సంతోష పరచుటకు అతని కనుసన్నలలో నాట్యముచేస్తున్నట్లు నటిస్తున్నావు.కరిని కనికరముతో అనుగ్రహించి కరిచర్మాంబరధరుడివి అయినావు.నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రుడవైన పరమశివా నీవు మన్మథునికి సహకరించవలెనను తలపుతో దానికి లక్ష్యముగా మారినావు.నీ ఈ పనులన్నిటికి కారణము నీకు మాపైగల అవ్యాజానుగ్రహమే కాని నీ అసమర్థత ఏమాత్రమును కాదు.సదాశివా! నా మనసనే సరస్సులో సదా విహరించుచు,సకలజగములను చల్లగా కాపాడు తండ్రీ.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-82
ఓం నమః శివాయ-82
********************
ఉమ్మిపూసి మందు అనిన కిమ్మనక ఉంటాడు
గుగ్గిలపు వాసనలకు ఉబ్బితబ్బిబవుతుంటాడు
కుంటి గాడిదమీద కులుకుతు కూర్చుంటాడు
మట్టిముంతకోసమని గట్టివాదులాడువాడు
చెన్నప్పవ్వ బొంతను కప్పుకుని రోతగా ఉంటాడు
రంగులు మారుస్తు ఎంతో పొంగిపోతు ఉంటాడు
రాళ్ళు రువ్విన వాని ఆరళ్ళను తీరుస్తాడు
బాణపుదెబ్బలను తింటు బాగుబాగు అంటాడు
క్లేశహారిని అంటు కేశములను కోరుతాడు,
కళ్యాణప్రదాతనని కళ్యాణము కానీయడు
నవ్వులపాలవుతున్నా నవ్వుతూనే ఉంటాడని
వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.
సాలీడు పాకిన చోటంతా శివలింగమునకు పొక్కులు వస్తే,నక్క నాయనారు భార్య ఉమ్మివేసి అదే దానికి మందని అంటే ఆనందంగా స్వీకరించాడు.కలశ నాయనారు భార్య మంగళసూత్రమును తాకట్టు పెట్టి గ్రాసము తీసుకురావటానికి వెళుతుంటే సాంబ్రాణిని దానికి బదులుగా ఇచ్చాడు.చాకలి నాయనారు తన కుంటిగాడిదమీద మాసిన బట్టల మూతతో పాటు కూర్చోపెడితే వాహనపూజ అంటు వాహ్వా అన్నాడు.నీలకంఠ నాయనారుకు మట్టిముంతను దాచిపెట్టమని,అది చాలా మహిమాన్వితమైనదని,మాయమాటలు చెప్పి,దానిని మాయము చేసి,తిరిగి తనకు ఇవ్వలేదని గట్టిగా పోట్లాడాడు.సుచి-శుభ్రము అంటే తెలియని వాడుగా అందుకే చెన్నప్పవ్వ తన పాత కుళ్ళుకంపుకొట్టుచున్న బొంతను కప్పగానే,ఎంతో వెచ్చగా ఉందంటు వచ్చిపడుకున్నాడు.సక్కియ నాయనారు రళ్ళను గట్టిగా విసురుతుంటే దెబ్బతగులుతున్నా వాటిని పూలపూజగా అనుకొని నాయనారు కష్టాలను తీర్చాడు.అర్జునుడు బాణాలతో గట్టిగా కొడుతుంటే భలే బాగుందన్నాడు.అంతే కాదు.హవ్వ మరీ విడ్డూరము.కంచార నాయనారు కుమార్తె కళ్యాణమునకు వెళ్ళి వధువు కేశములను కోరాడు.పెళ్ళికూతురు జడను కోయించి తీసుకొనుటయే కాడు.ఏకంగా పెళ్ళిని చెడగొట్టుటలోను సిధ్ధహస్తుడు.మరేమనుకున్నారు.సుందరారు పుస్తె కట్టే సమయమునకు వెళ్ళి,వాడు తన బానిస అని పెళ్ళికానీయకుండా తన వెంట తెచ్చేసుకున్నాడు.ఎంతైన రంగులు మార్చే స్వభావమున్నవాదు కదా.కుంభకోణము దగ్గరనున్న ఆలయములో కళ్యాణ సుందరేశుని నామముతో రోజుకు ఐదారుసార్లు తన లింగపురంగును మార్చే చతుౠడు కదా ఏమైనా చేస్తాడు-ఎపుడైనా చేస్తాడు-ఎవరితోనైన చేస్తాడు.-నింద,
అర్థి నమః శివాయ-దాత నమః శివాయ
చింత నమః శివాయ-స్వాంతన నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందూయా సాంబశివా-(శ్రీ దేవులపల్లి.)
అలలతోటి గంగపట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూల కలికితురాయిగ పెట్టి
.........
రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హరహరహర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా-స్తుతి.
..
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-81
ఓం నమః శివాయ-81
*********************
విశ్వనాథుడవని నిన్ను విబుధులు మాటాడుతుంటే
అనాథుదను నేనని ఆటలాడుతుంటావు
పరమ యోగీశ్వరుడవని ప్రమథగణము అంటుంటే
పార్వతీ సమేతుడనని ప్రకటిస్తు ఉంటావు
భక్తులు భోళాశంకరుడా భళిభళి అంటుంటే
వేళాకోళములే అని వేడుకగా అంటావు
నాగాభరణుడవని యోగులు స్తుతిచేస్తుంటే
కాలాభరణుడనని లాలించేస్తుంటావు
విషభక్షకుడవని ఋషులు వీక్షిస్తుంటే
అవలక్షణుదను అంటు ఆక్షేపణ తెలుపుతావు
మంచి-చెడులు మించిన మా మంచి చెంచుదొర
వాక్కు నేర్చి నాడవురా ఓ తిక్క శంకరా
శివుడు భక్తులు తన గుణగణములను పొగడుతుంటే దానికి విరుధ్ధముగా సమాధానములిస్తాడు.అన్నీ అబధ్ధాలే అంటూ వేళాకోళము చేస్తుంటాడు.తానూనాధుడనని,పార్వతీ సమేతుడననికాలాభరణుడనని,బేసికన్నులు కల అవలక్షణుడనని ఆక్షేపణగా మాట్లాడు స్వభావము కలవాడు-నింద.
నాథుడు నమః శివాయ-అనాథుడు నమః శివాయ
అఖిల రక్షక నమః శివాయ-అవలక్షక నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
అర్థనారీశ్వర అష్టకము.ఋషి ఉపమన్యు కృతము.
*****************************************
1.నల్లని మొయిలుకాంతి నాతల్లి కచము
ఎర్రని మెరుపు కాంతి శివ జటాజూటము
గిరినేలు నా తల్లి-ఉర్వినేలు నా తండ్రి
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
2.రత్నకుండల కాంతితో అమ్మ కర్ణములు
సర్పభూషణ కాంతితో స్వామి కర్ణములు
శివ నామము ప్రీతి-శివా నామము ప్రీతి
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
3.మందార మాలలతో మా తల్లి గళము
కపాలమాలలతో స్వామి మంగళము
దివ్య వస్త్రము దాల్చి-దిక్కులను దాల్చి
అర్థ నారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
4.పద్మార్చనతో నున్నది మాతల్లి పాదము
సర్పసేవితమైన సాంబశివ పాదము
చంద్ర ప్రకాశముతో-చంద్రాభరణముతో
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
5.అద్భుత ప్రదర్శనము మా తల్లి లాస్యము
ఆసన్న ప్రళయము మా తండ్రి తాండవము
సరిసంఖ్య కనులతో-బేసి కన్నులతో
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
6.నీలి కలువల కాంతి అమ్మ నయనములు
వికసిత కలువలు మా అయ్య నేత్రములు
జగములకు తల్లిగా-జగమేలు తండ్రిగా
అర్థనారీశ్వరమై నన్ను రక్షించు.
7.ఆది మధ్యాంతములు అన్ని మా అమ్మ
దిక్కులు-మూలలకు దిక్కు మా అయ్య
పంచకృత్యములను నియమించు వారు
అర్థ నారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
8.అమ్మా అని పిలిచినా,అయ్యను వేడినా
సన్నద్ధులౌతారు ఉద్ధరించంగ
ఉపమన్యు ఋషికృత స్తోత్ర పఠనమ్ము
అర్థనారీశ్వర కరుణ అరచేతనుంచు.
( ఏక బిల్వం శివార్ప
SIVA SANKALPAMU-80
ఓం నమః శివాయ-78
*********************
పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
పాలకడలి విషము మింగ పావుగా మారావు
పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో
పరమేష్టి పలుకులలో దొంగగా మారావు
సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో
అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు
గంగను బంధించిన వాడిననే గర్వముతో
కొంచమైన దించలేని నంగనాచివయ్యావు
పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో
గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు
గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా
ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా.
శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబడతాడు.
చంద్రకళనుధరించాననుకుంటాడే కాని గ్రహణ బాధను తొలగించలేడు.అగ్గిని కన్నుచేసి అదుపులో పెట్తాననుకుంటాడు కాని అది తెరువలేక బాధపడుతో0దన్న విషయాన్ని గ్రహించలేడు.అవి కుర్రో-ముర్రో అంటుంటే వాటి సమస్యలను పరిష్కరించలేని అసమర్థుడు శివుడు-నింద.
ఆభరణము నమః శివాయ-ఆదరణయు నమః శివాయ
చింతయు నమః శివాయ-నిశ్చింతయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
గ్రహణము అంటే స్వీకరించుట గ్రహించుట అని పెద్దలు చెబుతారు.రాహుకేతు గ్రహములను ఛాయగ్రహములంటారు.ఇవి భూమికి ఉపగ్రహము అయిన చంద్రుడు రవి మార్గమును ఖండిస్తు చేయు పయనములోని ఉత్తర దక్షిణ బిందువులు.భూమి సూర్యుని చుట్టు తిరుగుతు,తనచుట్టు తాను తిరిగే ప్రక్రియలో సకల చరాచర జీవరాశులకు అవసరమగు ఔషధ తత్త్వములను కొంతసేపు చంద్రునికి దగ్గరగా జరిగి స్వీకరిస్తుందట.మానసిక ప్రశాంతతకు కూడ తోడ్పదేటట్టు చేస్తుందట.భూమి ఈ గ్రహణ సమయములలో సౌరశక్తులను స్వీకరించి శారీరక పెరుగుదలను,చంద్ర తత్త్వమును గ్రహించి మానసిక మెరుగుదలను అందించుటకు కొద్దిసేపు మాత్రమే దగ్గరగా ఉండే విధానమును పరమేశుడు ప్రవేశపెట్టినాడట.విజ్ఞులు నా అభిప్రాయము తప్పయిన క్షమించి,సరైన వివరణను అందించగలరు.ధన్యవాదములు.
" ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
భిత్వామహాబలిభిరీశ్వర నామ మంత్రైః
దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
యే పాదపద్మ మిహతే శివతే కృతార్థః"
శివానందలహరి.
శివా నీ పాదపద్మము నిధి వంటిది.దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి,చీకటిగా నున్న స్థానమును నీ నామమనే మహాబలశాలుల ద్వారా ఛేదించి,దేవతలు ఆశ్రయించగా,సర్పములు నిన్ను చుట్టుకొనగలిగినవి అవి ఆభరణముగా అలరారు భాగ్యమును పొందించినది వాటికి నీపై కల అచంచల కాని మభక్తియేరొక్కటి .కాదు.అవ్యాజ కరుణామూర్తి,నీ పాదనిధిని పొందగలుగు భాగ్యమును ప్రసాదింపుము.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-79
ఓం నమః శివాయ-79
*********************
అంతా ప్రకాశమే నేనంటూ ఆర్భాటము చేస్తావు
అభిషేకములు జరిగేవి అంతంత మాత్రమేగ
ఋషుల తపోశక్తులను సర్పములుగా మలిచావు
నాగాభరణుడనంటు సాగదీస్తు ఉంటావు
ఋషిపత్నులపై శంకవేస్తు పులిని పుట్టించావు
వ్యాఘ్రేశ్వరుడను అంటు గుడిని కట్టించావు
పసిడిబిల్వహారములతో పరిచయము అవుతావు
తెరచాటుగ కథలను దొంతెరలుగ నడుపుతావు
కొమ్ములున్న వారమంటు నెమ్మది తీసేస్తావు
కాళ్ళులేని వాడివంటు ముళ్ళు గుచ్చమంటావు
నిన్ను కొలుచు పతంజలికి నిలువెల్ల పరీక్షలని
మొక్కుటెందుకటర నిన్ను ఓ తిక్కశంకరా.
ఆ-సమస్తాత్- ఆ అంటే అంతట.కాశము-వెలుగు.అంతట వెలుగుతో నిండినది ఆకాశము.శివుడు అది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు కాని అక్కడ తనకు (మూలవిరాట్) రోజు అభిషేకము చేయరని మాత్రము చెప్పుకోడు.ఋషుల యజ్ఞ ఫలమును సర్పములుగా మార్చునట్లు వారిచే చేయించి,వాటిని తాను ఆభరణములుగా ధరిస్తాడు.ఋషిపత్నులపై ఋషులకు అనుమానమును కలిగించి వారిచే ఒక పులిని సృష్టింపచేసి,దాని తోలుతో ఒక వస్త్రమును-ఆసనమును చేసుకొన్నాడు.మూడు స్వరూపాలు-ఐదు మండపాలు అని గొప్పలేకాని,తెర వెనక నక్కి కథలను బాగానే నడిపిస్తాడు.అందుకేగా పాపం నంది విజ్ఞతను మరచి పతంజలిని కొమ్ములు లేనివాడని ఎగతాళిచేసాడు.మూడుకాళ్ళ భ్రంగి కాళ్ళులేనివాడవంటు పదునైన మాటలతో బాధించాడు.శివుడు తాను సరిగా ఉండడు.తన దగ్గరనున్నవారిని సత్ప్రవర్తనతో నుండనీయడు.-నింద.
కాళము నమః శివాయ-కాశము నమః శివాయ
శంకలు నమ: శివాయ-శంకర నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమో రుద్రేభ్యో యేంతరిక్షే యేషా వర్షమిషవత్" రుద్రము.
అంతరిక్ష స్వరూపమైన సదాశివా అనుగ్రహమును వర్షింపుము నీకు నమస్కారములు.
ఋషుల అహంకారమును నిర్మూలించి,పతంజలి మహర్షి యొక్క భక్తిని-భాషా పటిమను లోక విదితము చేస్తూ అనేకానేక అద్భుత గ్రంధములను మనలకు అనుగ్రహించిన అవ్యాజ కరుణాసాగరా-అంబికాపతి అనేకానేక నమస్కారములు.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Posted 30th June by taetatelugu.com
SIVA SANKALPAMU-78
ఓం నమః శివాయ-68
*****************
మాతంగపతిగ నువ్వుంటే ఏది రక్షణ వాటికి?
గణపతి అవతరించాడు కరివదనముతో
అశ్వపతిగ వుంటె నీవు ఏదిరక్షణ వాటికి?
తుంబురుడు వచ్చాడు గుఱ్ఱపు ముఖముతో
నాగపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
పతంజలి వచ్చాడు మనిషి ముఖముతో
వానరపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
నారదుడు వచ్చాడు వానర ముఖముతో
సింహపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
నరసింహుడు వచ్చాడు సింహపు ముఖముతో
పశుపతిగ నీవుంటే అశువులకు రక్షణలేదని
ఒక్కటే గుసగుసలు ఓ తిక్కశంకరా.
శివుడు తాను పశుపతినని,వాటిని సంరక్షిస్తానని చెప్పుకుంటాడు కాని కళ్ళెదురుగానే శిరము వేరు-మొండెం వేరుగా ఎన్నో రూపములు కనిపిస్తూ,శివుని చేతగానితనమును ఎత్తిచూపిస్తున్నాగాని కిమ్మనక ఊరుకుంటాడు కాని దురాగతములను ఆపడు.-నింద.తాను కూడ శరభ రూపమును ధరించి మరొక్కసారి ఋజువు చేసాడు.
శిరము నమః శివాయ-మొండెము నమః శివాయ
పశువు నమః శివాయ-మనిషి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఛందఃశాఖి శిఖాన్వితైర్ద్విజవరైవరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే
చేతః పక్షిశిఖామణే త్యజవృధా సంచార మంత్యైరలం
నిత్యం శంకర పాదపద్మ యుగలీనీడే విహారం కురు."
శివానంద లహరి.
మనసా! నీ అవివేకపు ముసుగును తొలగించి అన్నిటింలో శివస్వరూపమును దర్శించుటకు ప్రయత్నించు.స్వామి నిరాకారుడు.ప్రకటింప బడుతున్న-ప్రకటించేయ బడుతున్న ఈ బాహ్య ఆకారములు స్వామి లీలలనె విభూతులు.కనుక నీవు వ్యర్థముగా అటు-ఇటు సంచరించకు.శంకరుని పాదపద్మములనే శుభప్రదమైన గూటిలో విహరించు.ఎందుకంటే ఆ గూడు వేదములనే చెట్టును ఆశ్రయించుకొని యున్న,వేదాంతము అనే కొమ్మలతో,వాని వాలి యున్న మంచి పండితులనే పక్షులతో ప్రకాశిస్తుంది.అనుగ్రహమును ప్రసాదిస్తుంటుంది.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Posted 23rd July by taetatelugu.com
0 Add a comment
SIVA SANKALPAMU-77
ఓం నమ: శివాయ-77
నీ క్షమాగుణము చూసి పులి శాంతముగా మారింది
పాపం,పులిని బెదిరిస్తూ లేడి తరుముకొస్తోంది
నీ పిరికితనమును చూసి పులి పిల్లిగా మారింది
పాపం,పిల్లి అనుకుని ఎలుక ఎగిరిపడుతోంది
నీ మంచితనము చూసి అగ్గికన్ను తగ్గియుంది
పాపం తగ్గిందంటు దానిని మంచు ముంచివేస్తోంది
నీ వ్యాపకత్వమును చూసి పాము తాను పాకుతోంది
పాపం,పాకుతోందంటూ దానితోక చలిచీమ కొరుకుతోంది
నీ పెద్దతనము చూసి కదలకుండ ఎద్దు ఉంది
పాపం,మొద్దు ఎద్దు అంటు జగము ఎద్దేవా చేస్తున్నది
సహనముతో నీ సహవాసము కోరిన వాటి
ఇక్కట్లను చూడవేరా ఓ తిక్క శంకరా.
......................................................................................................................................................................................................శివుని క్షమ,శాంతము,వ్యాపకత్వము,పేదరికమునుచూసి, శివుని దగ్గర ఉన్న పులి,పాము,ఎద్దు,మూడో కన్ను అదే విధముగా ఉందామనుకుని ఇబ్బందులు పడ్దాయి-నింద
.శివుని దగ్గర ఉండి శివుని అనుసరించుట వలన అవి లోక పూజ్యములైనవి.సహనముతో సహవాసము స్వర్గమే కదా.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-76
నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగపడ్దాయట
మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందో అని
నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్దాయట
మా కంటిముందు ఏ దండన వెన్నంటి ఉందో అని
నీ చేతిలోని మృగమును చూసి వాటికి సంతోషము మృగ్యమై పోయెనట
వాడి బాణమేదో తమను దాడిచేయనుందని
నీ గజ చర్మమును చూసి గజములు గజగజలాడుతున్నాయట
పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని
నీ బ్రహ్మ పుర్రెలు చూసి జనము విలవిలలాడుతున్నారట
రిమ్మతెగులు తగులుకొని దుమ్ము నోట కొడుతుందేమో అని
"దయనీయశ్చ దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే
నే ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.
భావము
నదులు,పాములు,కొండచిలువలు,లేళ్ళు,ఏనుగులు,పుర్రెలు శివుని చూచి భయపడుచున్నారు.వీటన్నిటిని హింసిస్తు శివుడు దయామయుడు అని కీర్తింపబడుచున్నాడు-నింద.
అహంకారపు బుద్ధి అను గంగ,చెడు ఆలోచనలు అను విషకోరలు గల పాములు,నిలకడ లేక పరుగులు తీయు మనసు అను లేడి,స్వార్థ సారూప్యమైన ఏనుగు,విచక్షణారహిత పుర్రె శివ కారుణ్యముతో జగత్పూజ్యతను పొందగలిగినవి-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-75
కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీ సిగముడుల చీకట్లో చింతిస్తూ ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకట్లో చింతిస్తూ ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
తెర తీయని చీకట్లో చింతిస్తూ ఉంటుందట
ఆకాశము నుండి సాగి జార అవకాశము లేని గంగ
బందిఖానా చీకట్లో చింతిస్తూ ఉంటుందట
చీకటిని తొలగించలేని జ్యోతి శివుడేనట
చింతలు తొలగించలేని వింతశక్తి శివుడట
దోషము తొలగించలేని వానికి ప్రదోష పూజలా అంటూ
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా!
భావము
చీకటిని దోషము అనికూడ అంటారు.(మానసిక) చీకట్లను తొలగించుటకు అవి కమ్ముకునే ముందు చేసే పూజలను ప్రదోష పూజలు అంటారు.గంగకు,చంద్రునికి,కన్నుకు,పాములకు చీకట్లను తొలగించలేని శివుడు దోష హరుడుగా ప్రదోష పూజలు అందుకుంటున్నాడు-నింద.
కళలు మారు చంద్రుడు,జనముల మధ్య స్థానము లేని పాములు,గతి తప్పిన గంగ,పరంజ్యోతి యైన శివుని కరుణచే లోకారాధ్యులుగా శివుని దయచే కీర్తింపబడుచున్నారు.స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-74
తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు
గలగల ప్రవహించనీయవని,గడుసువాడవని గంగ
చర చర పాకనీయవని చతురుడవని కాళము
పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి
కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
కదలనేనీయవని వంతపాడు జాబిలి
కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు
హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము
ఆ లయకారుడు అసలు "ఆలయమున" ఉంటాడా?
మేమెంతో గొప్పవారమంటూ వంతులవారీగా
నీ చెంతనే ఉంటూ కాని చింతలు చేస్తుంటే వాని
పక్క దారి మార్చవేరా ఓ తిక్క శంకరా.
భావము
శివుడు బిచ్చగాడు.గంగను ప్రవహించనీయడు.పాములను పాకనీయడు.లేడిని పరుగెత్తనీయడు.విషమును కంఠమునుండి క్రిందకు జారనీయడు.చంద్రుని కదలనీయడు.ఎద్దును రంకెవేయనీయడు.పక్కనే ఉండి తనను నిందిస్తున్నా వినీ,విననట్లుంటాడు..-నింద.
అహమును,చపల చిత్తమును,అహంకారమును శివుడు నియంత్రించి,భక్తులను అనుగ్రహిస్తున్నాడు.-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )
SIVA SANKALPAMU-73
"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది
"అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది
"భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది
"దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది
"చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది
"మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది
"ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది
"నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది
"యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది
" వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే
"అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను
వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.
భావము
మద్ది చెట్టు,నేరేడు చెట్టు,మామిడి చెట్టు,రేగి చెట్టు,గరిక,చెరకు,మారేడు చెట్టు,కొబ్బరి చెట్టు,దోస పాదు, హరితమునందిస్తుంటే భక్తులు శివుని పచ్చనైన కేశములతో విరాజిల్లు హరికేశునిగా పొగడగానే శివుడు వాటి గొప్పదనమును తనపై ఆపాదించుకొను చున్నాడు-నింద
శ్రీశైల స్థల వృక్షమైన మద్దిచెట్టు,జంబూ ద్వీపముగా ప్రసిద్ధి చెందిన నేరేడు చెట్టు,పావన బదరికా వనముగా రేగి చెట్టు,త్రిగుణాత్మకతతో పువ్వులు లేకుండానే కాయలు అందించే మారేడు చెట్టు,కంచిలో ఆమ్రేశ్వర రూపమైన మామిడిచెట్టు,
అచంచలతకు ప్రతీకయైన కొబ్బరి చెట్టు,తుఫాను సైతము కదల్చలేని గడ్డి,హింసించినను మధురతను ఇచ్చు చెరుకు,మృత్యుంజయ మంత్ర వివరణ యైన దోస పాదు,పరమేశ్వరుని దయచే జగత్పూజ్యములైనవి.
(ఏక బిల్వం శివార్పణం )
Image may contain: 1 person
SIVA SANKALPAMU-72
గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు
కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు
తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు
అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు
దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు
పరిహాసాస్పదుడవగుచు పరమ శివుడు నేనంటే
ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
............
చులకనయైన గడ్డిపోచ పూజలు,మేకతల పలికెడి మే మే మంత్రాలుకప్పుకున్న పులితోలు,ఎప్పుడు మూసిఉండే కన్ను ,ఆరునెలలు మూసిఉండే గుళ్ళు,హద్దులులేని జటలు,దుమ్మెత్తిపోసే జనాలు,ఉంటున్న పాడుబడ్డ గుహలు నిన్ను పరమ శివుడు అంటే పగలబడి నవ్వుతారు-నింద
...........
పవిత్రత,దక్షత,ప్రశాంతత,బూది అభిషేకాలు గలిగి,మన హృదయములో అతి రహస్యముగా నివసించుచున్న శివుడు మనలను రక్షించుగాక-స్తుతి.
SIVA SANKALPAMU-71
అసంగోహం అసంగోహం-అసంగోహం పున: పున:"
శివుని తల్లి "బెజ్జ మహాదేవి" అంటున్నారు
"శిలాదుడు" తండ్రి అని నేను వింటున్నాను
శివుని అక్క "మగాదేవి" గారాబం చేస్తుందట
శివుని పత్ని "పార్వతి" పరిపాలించేస్తోందట
గణపతి-గుహుడు శివుని సుతులంటున్నారు
శివుని సఖుడు "హరి" అట చెప్పుకుంటున్నారు
శివ భక్తి "తమదని" పక్షులు చెప్పుకుంటున్నాయి
శివ లీలలు "యుగయుగములు" కనువిందు చేస్తున్నవి
భావనలో నిండినది "బహు చక్కని కుటుంబము"
"బ్రహ్మజ్ఞాన వలీనము" బహు చక్కగ చెబుతున్నది
"అసంగోహం-అసంగోహం
అసంగోహం-పున:పున:"
చక్కనైన మాటలేరా ఓ తిక్కశంకరా.
భావము
శివ కుటుంబము చిద్విలాసము చేయుచుండగా,శివుడు ఎవరులేనివాడను,ఏ బంధములేని వాడనని అనుట అబద్ధము-నింద.
బెజ్జ మహాదేవి తల్లిగా భావించింది.శిలాదుడు తండ్రిగా లాలించాడు.(పారమార్థిక దృష్టితో చూస్తే వీరు శివుని తమ బిడ్డడుగా భావించారు.)మహాదేవి అక్కగా శివుని ఆదరించింది.పార్వతీ దేవి శివుని పత్నిగా ప్రకాశిస్తూ, పరిపాలిస్తోంది.వినాయకుడు-కుమార స్వామి పుత్రులుగా ధాత్రినేలుతున్నారు.విష్ణుమూతి నిన్ను చేర్చి కార్తీక దామోదరుడైనాడు.పశు పక్ష్యాదులు,కాలచక్రము నిన్ను తనవాడివని అచంచల భక్తితో కొలుచుచున్నవి.
పశుపతి, మోహ బంధములకు అతీతుడైన భవుడు, భవతారకుడు-స్తుతి..
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-70
ఓం నమః శివాయ-79
******************
అగ్గిలో కాల్చావు ఆ భక్తనందనారుని
అఘోరవ్రతమన్నావు ఆ చిరుతొండనంబికి
అంబకము అడిగావు ఆ బోయ తిన్నడిని
చర్మకార దంపతుల చర్మము ఒలిపించావు
ఆ అయ్యలప్ప అర్థాంగినే ఆశగా కోరావు
దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు
కళ్ళను నరికించావు కఠినముగా మహదేవుని
కళ్ళను పీకించావు కటకట మల్లికార్జుని
అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని
నీ వీరశైవగాథలు కౄరత్వపు దాడులు
మోక్షమనె పేరుగల ఘోరమైన శిక్షలు
అక్కరలేదనవేమిరా ఓ తిక్క శంకరా.
శివుడు కౄరుడు.కనుకనే నందనారుని అగ్నిలో దూకమన్నాడు.చిరుతొండనంబిని (సిరియాళుని తండ్రి) చిత్ర-విచిత్రముగా పరిక్షించినాడు.తిన్నడిని కన్ను అడిగాడు.హరలయ్య-కళ్యాణమ్మల చర్మమును కోసుకునేలే చేసాడు.కాళ్ళు నరికించుట-కళ్ళుపీకించుట చూస్తూ ఉరుకున్నాడు.ఇదింకా మరీ చోద్యం.తన భక్తుడైన ఇయర్వగై నాయనారు ధర్మపత్నిపై తనకు మోహం కలిగినదని,తన వెంట ఆమెను పంపించమన్నాడు.హవ్వ.ఎంత నీచపు ఆలోచన.పాపము గొడగూచి అను చిన్న పిల్లపై ఆమె తల్లితండ్రులపై నైవేద్య క్షీరమును శివుని సమర్పించక తాగినదని,నిందారోపణమును చేయించి,నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు.నిజము నిన్ను అడుగుదామని వస్తే నిర్దాక్షిణ్యముగా నీలో లీనము చేసుకున్నావు.ఎక్కడున్నది నీ భోళాతనము-నింద.
శిఖయు నమః శివాయ-రక్షయు నమః శివాయ
కాయం నమః శివాయ-సాయం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘోర తరేభ్యో-రుద్రం. ఘోర (రౌద్ర) రూపము-అఘోర (శాంత) రూపము,ఘోరఘోర (సామాన్య) రూపము అన్ని శివుడే.తన భక్తులను చరితార్థులను చేయుటకు ఆడిన లీలా విశేషములే.వారందరిని తిరిగి అనుగ్రహించి-ఆశీర్వదించినది శివుడేగా.
" మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిషః
వీరాన్మానో రుద్రభామితోవధీర్హ విష్మంతో నమసా విధేమతే."
పరమశివా! మేము నీకు కోపము వచ్చునట్లు ప్రవర్తించినను ,నీకు అపచారములను చేసినను మమ్ములను క్షమించి,మా (తోకే) సంతానమునకు,(ఆయుషి) ఆయువునకు,(గోషుమానో) గోవులకు,(అశ్వేషు) గుర్రములకు,((మారీరిష) బాధను కలిగింపకుము.మేము హవిస్సుకలవారమై (నీకు అర్పించుటకు) నిన్ను సేవించుకొను భాగ్యమును ప్రసాదింపుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-69
ఓం నమః శివాయ-69
******************
అగ్గిలో కాల్చావు ఆ భక్తనందనారుని
అఘోరవ్రతమన్నావు ఆ చిరుతొండనంబికి
అంబకము అడిగావు ఆ బోయ తిన్నడిని
చర్మకార దంపతుల చర్మము ఒలిపించావు
ఆ అయ్యలప్ప అర్థాంగినే ఆశగా కోరావు
దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు
కళ్ళను నరికించావు కఠినముగా మహదేవుని
కళ్ళను పీకించావు కటకట మల్లికార్జుని
అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని
నీ వీరశైవగాథలు కౄరత్వపు దాడులు
మోక్షమనె పేరుగల ఘోరమైన శిక్షలు
అక్కరలేదనవేమిరా ఓ తిక్క శంకరా.
శివుడు కౄరుడు.కనుకనే నందనారుని అగ్నిలో దూకమన్నాడు.చిరుతొండనంబిని (సిరియాళుని తండ్రి) చిత్ర-విచిత్రముగా పరిక్షించినాడు.తిన్నడిని కన్ను అడిగాడు.హరలయ్య-కళ్యాణమ్మల చర్మమును కోసుకునేలే చేసాడు.కాళ్ళు నరికించుట-కళ్ళుపీకించుట చూస్తూ ఉరుకున్నాడు.ఇదింకా మరీ చోద్యం.తన భక్తుడైన ఇయర్వగై నాయనారు ధర్మపత్నిపై తనకు మోహం కలిగినదని,తన వెంట ఆమెను పంపించమన్నాడు.హవ్వ.ఎంత నీచపు ఆలోచన.పాపము గొడగూచి అను చిన్న పిల్లపై ఆమె తల్లితండ్రులపై నైవేద్య క్షీరమును శివుని సమర్పించక తాగినదని,నిందారోపణమును చేయించి,నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు.నిజము నిన్ను అడుగుదామని వస్తే నిర్దాక్షిణ్యముగా నీలో లీనము చేసుకున్నావు.ఎక్కడున్నది నీ భోళాతనము-నింద.
శిఖయు నమః శివాయ-రక్షయు నమః శివాయ
కాయం నమః శివాయ-సాయం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘోర తరేభ్యో-రుద్రం. ఘోర (రౌద్ర) రూపము-అఘోర (శాంత) రూపము,ఘోరఘోర (సామాన్య) రూపము అన్ని శివుడే.తన భక్తులను చరితార్థులను చేయుటకు ఆడిన లీలా విశేషములే.వారందరిని తిరిగి అనుగ్రహించి-ఆశీర్వదించినది శివుడేగా.
" మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిషః
వీరాన్మానో రుద్రభామితోవధీర్హ విష్మంతో నమసా విధేమతే."
పరమశివా! మేము నీకు కోపము వచ్చునట్లు ప్రవర్తించినను ,నీకు అపచారములను చేసినను మమ్ములను క్షమించి,మా (తోకే) సంతానమునకు,(ఆయుషి) ఆయువునకు,(గోషుమానో) గోవులకు,(అశ్వేషు) గుర్రములకు,((మారీరిష) బాధను కలిగింపకుము.మేము హవిస్సుకలవారమై (నీకు అర్పించుటకు) నిన్ను సేవించుకొను భాగ్యమును ప్రసాదింపుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-68
ఓం నమః శివాయ-78
*********************
పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
పాలకడలి విషము మింగ పావుగా మారావు
పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో
పరమేష్టి పలుకులలో దొంగగా మారావు
సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో
అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు
గంగను బంధించిన వాడిననే గర్వముతో
కొంచమైన దించలేని నంగనాచివయ్యావు
పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో
గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు
గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా
ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా.
శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబడతాడు.
చంద్రకళనుధరించాననుకుంటాడే కాని గ్రహణ బాధను తొలగించలేడు.అగ్గిని కన్నుచేసి అదుపులో పెట్తాననుకుంటాడు కాని అది తెరువలేక బాధపడుతో0దన్న విషయాన్ని గ్రహించలేడు.అవి కుర్రో-ముర్రో అంటుంటే వాటి సమస్యలను పరిష్కరించలేని అసమర్థుడు శివుడు-నింద.
ఆభరణము నమః శివాయ-ఆదరణయు నమః శివాయ
చింతయు నమః శివాయ-నిశ్చింతయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
గ్రహణము అంటే స్వీకరించుట గ్రహించుట అని పెద్దలు చెబుతారు.రాహుకేతు గ్రహములను ఛాయగ్రహములంటారు.ఇవి భూమికి ఉపగ్రహము అయిన చంద్రుడు రవి మార్గమును ఖండిస్తు చేయు పయనములోని ఉత్తర దక్షిణ బిందువులు.భూమి సూర్యుని చుట్టు తిరుగుతు,తనచుట్టు తాను తిరిగే ప్రక్రియలో సకల చరాచర జీవరాశులకు అవసరమగు ఔషధ తత్త్వములను కొంతసేపు చంద్రునికి దగ్గరగా జరిగి స్వీకరిస్తుందట.మానసిక ప్రశాంతతకు కూడ తోడ్పదేటట్టు చేస్తుందట.భూమి ఈ గ్రహణ సమయములలో సౌరశక్తులను స్వీకరించి శారీరక పెరుగుదలను,చంద్ర తత్త్వమును గ్రహించి మానసిక మెరుగుదలను అందించుటకు కొద్దిసేపు మాత్రమే దగ్గరగా ఉండే విధానమును పరమేశుడు ప్రవేశపెట్టినాడట.విజ్ఞులు నా అభిప్రాయము తప్పయిన క్షమించి,సరైన వివరణను అందించగలరు.ధన్యవాదములు.
" ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
భిత్వామహాబలిభిరీశ్వర నామ మంత్రైః
దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
యే పాదపద్మ మిహతే శివతే కృతార్థః"
శివానందలహరి.
శివా నీ పాదపద్మము నిధి వంటిది.దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి,చీకటిగా నున్న స్థానమును నీ నామమనే మహాబలశాలుల ద్వారా ఛేదించి,దేవతలు ఆశ్రయించగా,సర్పములు నిన్ను చుట్టుకొనగలిగినవి అవి ఆభరణముగా అలరారు భాగ్యమును పొందించినది వాటికి నీపై కల అచంచల కాని మభక్తియేరొక్కటి .కాదు.అవ్యాజ కరుణామూర్తి,నీ పాదనిధిని పొందగలుగు భాగ్యమును ప్రసాదింపుము.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-67
ఓం నమ: శివాయ-missing in between
***************
కొంతమంది రుద్రులుగా భూమిమీద సంచరిస్తూ
తినకూడని ఆహారము తినిపించేస్తుంటావు
మరికొంతమంది రుద్రులుగా గాలిలో విహరిస్తూ
ఆయాసము-ఉబ్బసము విజృంభింప చేస్తావు
ఇంకొంతమంది రుద్రులుగా నీటిలోన చేరుతూ
క్రిమికీటక జలములతో వ్యాధులు పెంచేస్తావు
కొంతమంది రుద్రులతో గగనములో దాగుతూ
అతివృష్టి-అనావృష్టి నష్టము చేస్తుంటావు
ఆయుధమవసరములోని యుధ్ధమని అంటావు
అపచారము సవరించే పరిహారము అంటావు
సకలమును సన్స్కరించు పధ్ధతి యేనా ఇది?
టక్కరి కొక్కెరవటర నీవు ఓ తిక్క శంకరా.
.
భువనం నమః శివాయ-గగనం నమః శివాయ
దండన నమః శివాయ-దండము నమః శివాయ.
శంకరుడు అనేకానేక రూపములను తనలాగ ఉండువారిని సృష్టించి,వారిని నింగి-నేల-జలము మొదలగు పంచభూతములనే ఆయుధములుగా మలచుకొని,వాటి ప్రభావము చేతనే జనులను సదాచార పరులను చేయమంటున్నాడు.ఈ ప్రణాళికలో జనులు వ్యాధిపీడితులుగా,ఆకలి బాధితులు గా మారి,పశ్చాత్తపడి సన్మార్గమున నడిచేవారిని,క్షమిస్తూ,పధ్ధతి మార్చుకోని వారికి ముగింపు తెస్తు,నిర్దాక్షిణ్యముగా శివుడు ప్రవర్తిస్తున్నాడు-నింద.
" యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్" రుద్రనమకం.
ఏ రుద్రులు భుజింపదగిన అన్నములయందును,త్రాగదగిన క్షీరాదులయందును ఉన్నవారలయి భుజించు పాపులగు జనులను,త్రాగునట్టి జనులను ధాతువైషమ్యమును కలిగించి వారి పాపాలకు దగినట్లుగా నానా విధంబుల బాధించుచున్నారో,వారల ధనుస్సులను వేయి యోజనముల దూరముగా పెట్టుము.
భువనం నమఃశివాయ-గగనం నమః శివాయ
రుద్రులు నమః శివాయ-భద్రత నమహ్ శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" దశ ప్రాచీ దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచిః"
రుద్రము-(ప్రాచీ-తూర్పు-ప్రతీచీ-పడమర-ఉదీచె-ఉత్తరం-దక్షిణా -దక్షిణం)
నాలుగు దిక్కులు-నాలుగు మూలలు-ఊర్థ్వము-అథో దిక్కు పది తానై పరిపలించు పరాత్పరునకు పదివేళ్ళని కలిపి నేను చేయు నమస్కారములను స్వీకరించి,మనలను ఆయుధములు లేకుండ బాధించే రుద్రుల నుండి కాపాడును గాక.
సాధకులు " నమో రుద్రేభ్యోః అంటు చేయు వాచక నమస్కారములకు,తేభ్యోః అను శబదముతో చేయు మానసిక నమస్కారములకు,పదివేళ్ళను ముకుళించి చేయు కాయిక నమస్కారములకు ప్రీతి చెంది పరమేశ్వరానుగ్రహము మనలనందరిపై ప్రసరింప చేయును గాక.
సదాశివుడు తన రుద్రుల ద్వారా సదాచార సంపన్నులుగా అందరిని మలచుటకు అనుగ్రహించుటకు అనేకానేక రుద్రరూపములలో విశ్వపాలన చేస్తున్నాడు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-66
ఓం నమః శివాయ-77
**********************
నీ కళ్యాణపు కర్తయైనాడుగ ఆ రతిరాజు
నీ సేమపు మామ యైనాడు ఆ హిమరాజు
నీ సిగపై కొలువైనాడు ఆ నెలరాజు
నీ మేనికి వస్త్రమైనాడు ఆ కరిరాజు
నీ కంఠపు కంటెయైనాడు ఆ భుజగరాజు
నీమ్రోలన్ నిలిచినాడు ఆ వృషభరాజు
నీతో పాటుగ కొలువైనాడు ఆ యమరాజు
నీవంటే నిరసనతో యున్నాడుగ ఆ దక్షరాజు
విరాజమానుడిని అని నీవు అన్నా,నువ్వు రాజువు కాదని
ఇందరు రాజులు నిన్ను ఆడించగ మందహాసముతో
నటరాజను ఒక రాజును నీకొసగిరి ,నీ
తక్కువ చాటేందుకేర ఓ తిక్కశంకరా.
మన్మథుడు,హిమవంతుడు,చంద్రుడు,ఏనుగులరాజు,సర్పరాజు,వృషభరాజు,యమరాజు,దక్షరాజు రాజథీవితో అలరారుచు,అందరు కలిసి పరిహాసమునకు శివునికి నతరాజు అను బిరుదునొసగి,తైతక్కలాడిస్తుంటే అమాయకముగా అది గ్రహించక,తాను వివిధరాజ విరాజమానుడనని సంతసితాడు కాని అసలు విషయమును అర్థము చేసుకోలేని అమాయకుడు శివుడు-నింద.
రాజు నమః శివాయ-బంటు నమః శివాయ
జటిలము నమః శివాయ-నటనము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నటనం ఆడెనే భవతిమిరహంశుడా పరమశివుడు
నటనా వతన్సుడై తకధిమి తకయని"
నటనము నందు ఆసక్తిగలవాడట.ఏమా నటనము? సామాన్య హస్తపాద కదలికలే? లేక సకల చరాచర సృష్టి చైతన్యపు కదలికలా అంతే అవుననే చెప్పాలి.అయితే స్వామి చిదంబరములోనే తిల్లవనములోనే నృత్యము చేయుట ఎందుకు? అని ప్రశ్నించుకుంటే అఖిలభువనభాండములు తాను వ్యాపించియున్నప్పటికిని,విశ్వమనే క్షత్రము(క్షేత్రమునకు శరీరము అను మరో అర్థమును తీసుకుంటే) హృదయము వంటిది చిదంబరములోని తిల్లవనము.ఆ ప్రదేశమునకే శివనాట్యమును తిలకించగల-తరించగల శక్తిగలది.ఇంకొక విధముగా అన్వయించుకోవాలంటే ఇడ-పింగళ అను కుడి-ఎడమ నాడుల మధ్య గల సుషుమ్న నాడి వంటిది చిదంబరము.కుండలినిని జాగృత పరచి సహస్రారమునకు చేర్చగలిగిన శక్తికలది.అంతే కాకుండ అక్కడ మనకు వ్యాఘ్రపాదులవారు-పతంజలి స్తొత్రము చేస్తు స్వామి నాట్యమును అవలోకిస్తూ ఆనందిస్తుంటారు.వారి నామములు కూడ సంకేతములే.వ్యాఘ్రపాదములు స్వామిచే వారికి అతికింపబడినవి.కనుక అవి కదలకుండ స్థిరముగా నిలబడ శక్తి కలవి.అట్లు నిలబడిన ఆధ్యాత్మిక సాధనను,పతంజలి పైకి వేగముగా పాకు శక్తి సహస్రారమునకు పట్టు తప్పకుండ చేర్చి,ముముక్షువులుగా మార్చగలదు.
స్వామి చేయు సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్య సంకేతములే నటరాజ తత్త్వము.అజ్ఞానమనే అపస్మారకుని కాలికింద నొక్కివేసి,సృష్టికి రెండు కుడిచేతులతో ముందున్నది అభయముద్రతో,వెనుక ఉన్నది డమరుకముతో ,జ్ఞాన సంకేతములై ఉండగా ,ఎడమవైపున ముందున్న గజహస్తము తిరోధాన ప్రతీకగాను,వెనుకనున్న చేయి అగ్ని పాత్రతో విషవాసనలను దహించివేసే దయాళువుగాను దర్శనమిస్తుంటాయి.స్వామి విస్తరించిన జడలు సర్వ వ్యాపకత్వమును చాటిచెప్పుచుండగా ,వాటిలో చుట్తిన గంగ,చంద్రరేక స్వామి చల్లని మనసుకు చక్కని ప్రతీకలై చెలువారుచున్నవి.
రుద్రము స్వామిని " సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమో నమః" అని కీర్తిస్తున్నది.కడలిలోని నీరే కడలి అలలోను ఉన్నట్లు,స్వామి కదలికలే నా కదలికలను సత్యమును నిరంతరము నా మనసులో నిలుపుము శివా.నమస్కారములు.-స్తుతి
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-65
ఓం నమః శివాయ-76
********************
పట్టుబడతానన్న భయముతో పరుగుతీసిన దొంగ
ప్రదక్షిణము చేసానని ప్రగల్భమే పలుకుతాడు
సోమరియై నిదురపోవు తామసియైన దొంగ
నిష్కళంక సమాధియని నిబ్బరముగ అంటాడు
సందుచూసి విందు భోజనము చేయుచు ఒక దొంగ
వివరపు నైవేద్యమంటు వింతగ మాటాడతాడు
కడతేరుస్తారేమని కవచధారియైన దొంగ
కానుకగా ప్రాణమంటు పూనకమే పూనుతాడు
మాయదారి పనులనే మానసపూజలు అంటూ
ఆయాసము లేకుందా ఆ ఆ యశమే కోరుతుంటే
పోనీలే అనుకుంటూ నువ్వు వారిని ఏలేస్తుంటే
ఇంకెక్కడి న్యాయమురా ఓ తిక్కశంకరా.
శివుడు చెప్పలేనంత అమాయకుడు.బూటకపు మాటలను మాట్లాడిన వారిని కూడా నిజభక్తులనుకొని,వారిని అనుగ్రహిస్తుంటాడు.అదే అదనుగా దొంగ భక్తులు ప్రదక్షిణమును చేసానంటు,ధ్యానము చేసానంటూ,మహానైవేద్యము సమర్పించానంటూ అచ్చిక బుచ్చిక మాటలతో,అచ్చమైన భక్తుల వలె అనగానే,అసలు విషయమును గ్రహించకుండ అనుగ్రహించేస్తుంటాడు.నిజానిజములను విచారించలేడు.నింద.
దక్షిణ నమః శివాయ-ప్రదక్షిణ నమః శివాయ
వేద్యుడు నమః శివాయ-నైవేద్యుడు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
"నమో నిషంగిణ ఇషుధిపతే తస్కరణాం పతయే నమః" రుద్ర నమకము.
దొంగలు గుప్తచోరులు-ప్రకటిత చోరులు అని రెండు వర్గములుగా విభజింపబడినారు.మూడో కంటికి తెలియకుండ దొంగతనమును చేయువారు గుప్తచోరులు.వారి దొంగతనమును కేవలము వారి రెండు కన్నులు మాత్రమే చూడగలవు.ఎదుటపడి మనకు తెలుస్తుండగనే దొంగిలించువారు ప్రకటిత చోరులు.
రుద్ర భాష్యము నిషంగిణ అను పదమునకు విల్లు ఎత్తి పట్టుకుని ఉన్నవాడు అను వాచ్యార్థమును చెప్పినప్పటికిని,అంతరార్థముగా దొంగతనమునందాసక్తిని ప్రదర్శించువాడని విశ్లేషిస్తున్నది.ఎవరీ దొంగలు? వారి పూర్జన్మ పాపఫలితములను దొంతనపు వాసనలతో పుట్టిన జీవులు.వారి దుష్కర్మలు వారి పాపక్షయమును వారే దోచుకొనునట్లు చేస్తుంది.అదియే ఈశ్వరానుగ్రహము.లీలా
మానుషధారియైన శివుడు వారి సర్వపాపములను-వాటికర్మలను దొంగిలించి,వారిని పునీతులను చేస్తుంటే,విచిత్రముగా వీరు శివుని ఎదురుగా నిలబడి మాట్లాడుతూ,స్వామి అనుగ్రహ కటాక్షమను విశేషమును దోచుకొని ధన్యులైనారు.వారి భాగ్యమును నేనేమనగలను? స్వామి అవ్యాజకరుణ తక్క.కాసేపు తాను దొంగిలిస్తూ,మరికాసేపు తాను దొంగిలింపబడుతూ దోబూచులాడు దొంగలదొరను సేవించుకొనుట తప్ప.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-64
ఓం నమః శివాయ-75
*******************
అగ్నికార్యఫలితములు అన్నీ ఇంద్రునికైతే
బృహస్పతి చేరాడు బుధ్ధితో ఇంద్రుని
సరస్వతి చేరింది బృహస్పతిని చూసి
వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని
భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని
గాలివీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని
అవకాశము ఇది అని ఆకాశము చేరింది
ఆశ్వనీదేవతలు ఆశ్రయించారు ఇంద్రుని
పంచభూతములు కలిసి నిన్ను వంచించేస్తుంటే
పంచాల్సిన ఫలితమును అంతా దోచేస్తుంటే
స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది
నిన్నొక్కడినే వేరుచేసి ఓ తిక్కశంకరా.
వేదశాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.వారికి ఆ అవకాశమును అనుశివుడేగ్రహించాడు.కాని వారు శివుని లెక్కచేయక,శివునికి తెలియకుండా,చెప్పకుండా,తామందరు కుమ్మక్కై ,శివుని యజ్ఞ హవిస్సులో సగభాగమును ఈయకుండా,తామే స్వీకరించాలని వెళ్ళిన శివుడు వారినేమి అనకుండా మౌనముగా చేతకాని వలె నున్నాడు-నింద.
యజ్ఞం నమః శివాయ-యజ్వ నమః శివాయ
కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే
సరస్వతీచమ ఇంద్రశ్చమే-బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే"
రుద్రచమకము లోని ఆరవ అనువాకము అర్థేంద్ర అనువాకముగా ప్రసిధ్ధిపొందినది.చమకము అగ్నా- విష్ణూ, రెండు మహత్తర శక్తులను జతగా వచ్చి,జయమును కలిగించమంటుంది.అదే విధముగా స్థితికార్యమును నిర్వహించు సమయమున మగేశ్వరుడే మహేంద్రుడిగా కీర్తింపబడుతుంటాడు.యజ్ఞ నిర్వహణకై మహేశ్వరుడు తన నుండి కొన్ని అద్భుత శక్తులను ఆవిర్భవింపచేసి,వాటికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు.వాటి సద్గుణములే దివ్యనామములై విరాజిల్లుచున్నవి.స్వామి వాటిని విస్తరింపచేయగలడు.అవసరము లేదనుకుంటే తనలో విలీనము చేసుకోగలడు.సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయుటకు ఇంద్రునిగా తాను వారిని వెంటపెట్టుకుని
వచ్చి,యజ్ఞ హవిస్సులలో సగభాగమును వానికిచ్చి,మిగిలిన సగమును తాను స్వీకరించి "లోకాన్ సమస్తాత్ సుఖినో భవంతూ అను ఆర్యోకిని నిజము చేస్తాడు యజ్ఞము-యజ్ఞకర్త-యజ్ఞభోక్త -యజ్ఞహర్త అయిన పరమేశ్వరుడు. స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
.
SIVA SANKALPAMU-63
ఓం నమః శివాయ-63
*********************
తన తలపైన గంగమ్మ ఉన్నదన్న తలపులేక
తపతి నర్మదాది నదులను త్వరపడి సృష్టించాడు
తన ఇల్లుగ మంచుకొండ ఉన్నదన్న తలపులేక
ఎగుడుదిగుడుగా ఎన్నో కొండలు సృష్టించాడు
తన సృష్టికి లయకర్త తానే అను తలపులేక
జాగరూకతను మరచి జగములు సృష్టించాడు
తళుకు మగువ పంపకములో తనకు మిగలదన్న తలపులేక
అమృతమునకు బదులుగ విషమును స్వీకరించాడు
తల్లి పార్వతితో సహా తనకు అన్ని ఉన్నాయన్న తలపులేక
తనవారికి బాధలంటు తల్లడిల్లుతుంటాడు
తన దగ్గర ఏమున్నవో తెలిసికొనే తలపులేని వాడవని
నిన్ను వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.
శివుడు తన దగ్గర ఉన్న వస్తువులను గమనించలేని స్వభావము కలవాడు.అందులకే దాహము వేస్తే నీరు ఉండాలనే తలపుతో నదులను,ఉండుటకు ఇల్లు ఉండాలనే తలపుతో కొండలను సృష్టించాడు.హరి తనకు అమృతమును మిగల్చడు అను తలపులేక,అది దొరకక,చేసేది ఏమీలేక దాని బదులు విషమును స్వీకరించుటతో సరిపుచ్చుకున్నాడు.స్వామి నీవు మహదైశ్వర్య వంతుడవు సాంబశివా అని చెబుతుంటే అది గ్రహించకుండా నా వాళ్ళందరు కష్టాలతో-కన్నీళ్ళతో ఉన్నారనుకుంటూ తల్లడిల్లుతుంటాడు.పంచకృత్యములపాలనలో తాను సృష్టించిన జగములను తానే లీనము చేసుకోవాలని తెలివిలేక తిరిగి తిరిగి సృష్టి కార్యమును చేస్తుంటాడు.శివుడు ఒక ప్రణాళిక లేనివాడు-నింద.
తలపు నమః శివాయ-వలపు నమః శివాయ
ఆర్తి నమః శివాయ-స్పూర్తి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
పరమశివుడు పరమ దయాసముద్రుడు.జగత్పతి.ఇంద్రియ సంబంధములకు అత్తీతుడు.సకల చరాచర జీవరాశుల మనుగడకై సకలము పంచభూతరూపముగా సంస్థాపనము చేసినాడు.
" వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-62
ఓం నమః శివాయ-73
*********************
రూపులేని గాలిని అన్నిరూపులలో నిలుపుతావు
అలసటలేకుండ కదులుతు ఉండాలంటావు
కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు
కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు
భూమాతను సైతము కాళ్ళతో తాడనము చేస్తావు
కనికరములేకుంద కదులుతుండాలంటావు
ఆకాశము నే చూడమంటు హడావిడి చేస్తావు
వ్యోమకేశుడిని అంటు వదలక తాకుతునే ఉంటావు
అంబకమను పేరుతో అగ్గిని బంధించావు
గంగను బంధించి చుక్కచుక్క తాగుతునే ఉంటావు
పంచభూతములని చూడవు పంచమంటుంటావు
తొక్కేసినావుర వాటిని ఓ తిక్క శంకరా.
శివుడు దయలేనివాడు.కనుకనే శివుని చేష్టల వలన పంచభూతములు వంచనకు లోనైనవి.అగ్గిని కన్నుగా చేసుకొని బంధించాడు.జలమును గంగగా మార్చి కట్టివేసాడు.ఆకాశమును తాను విస్తరింప చేసిన జటలతో తాకుతు చీకాకు పెడతాడు.ఎంతమొత్తుకున్నా వినకుండా అయ్యో పాపం నీకు రూపులేదని బాధ పడుతున్నావా,నిన్ను అన్ని రూపులలో నింపుతాను అని అదేదో గొప్ప ఘనకార్యముగా భావించి,దానిని ఎప్పుడు ఉఛ్ఛ్వాస-నిశ్వాసములు కలిగి ఉండాలని క్షణము తీరిక లేకుండా చేసాడు.దైవ స్వరూపములైన వృక్షాలను మర్యాద లేకుండా మీరు మీ వేళ్ళతో భూమి నుండి నీళ్ళు తాగాలని నియమమును పెట్టాడు.పైగ వాటికి కింద భాగమును కదలకుండా-పైభాగమునకు మాత్రము స్వల్ప చలనమును కలిగిస్తు వాటిని ఇబ్బంది పెడుతున్నాడు.భూమాత సాక్షాతు సహనానికి ప్రతీకను నిరంతరము తాండవమను పేర తన్నటమే కాకుండ ఒక్క క్షణము కూడ ఆగక నిరంతరము కదులుతూనే ఉండాలని కఠోర నియమమును పెట్టాడు.పాపము అవి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిట్టూర్పులతో ఉన్నాయి-నింద.
శాఖ నమః శివాయ-శ్వాస నమః శివాయ
నియమం నమః శివాయ-నిఖిలం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
పంచభూతాత్మికమైన ప్రపంచపు ప్రతిరూపమే పరమాత్మ.భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు సెలవిచ్చినట్లు,
" నైనం ఛిందతి శస్త్రాణి-నైనం దహతి పావకః
నః ఛిన్నం క్లేదయంతి అపోనః శోషయతు మరుతః"
నింగి-నీరు-నిప్పు-నేల-గాలి అను ఐదు భూతములతో(భూతము అనగా ఉన్నది అని అర్థము కనుక)వీటిలోనే ఉన్నప్పటికిని,వీటి ప్రభావము ఏమాత్రము సోకని సత్ చిద్రూపమును ధ్యానించెదను.-స్తుతి
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-61
ఓం నమః శివాయ-72
***********************
ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని
అమావాస్య జననానికి ఆనందపడతావు
విడ్డూరము ఏమోగాని వివరమసలే తెలియని
గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు
పూర్వపుణ్యమేమోగాని పువ్వులసలే తెలియని
మారేడు దళాలకు మహా ఆనందపడతావు
ఇంద్రజాలమేమోగాని అందమే తెలియని
బూదిపూతలకు మోదమెంతో పొందుతావు
నీదయ ఏమోగాని నియమపాలనయే తెలియని
నికృష్టపు భక్తులను నీదరి చేర్చుకుంటావు
కనికట్టో ఏమోగాని అసలు నీ జట్టే తెలియక
ఒక్కడిగా నున్నానురా ఓ తిక్కశంకరా.
శివుడు లోపభూఇష్టములను బహుప్రీతితో స్వీకరిస్తాడు.పైగా దానిని తన గొప్పదనముగా చెప్పుకుంటాడు.నలుగురు నవ్వుతారనుకోడు.కనుకనే అమ్మావాస్య చీకటిలో పుట్టానని అతిసంబరంగా చెప్పుకుంటాడు.అహంకారియైన గంగను నెత్తిమీద పెట్టుకున్నాడు.పుష్పించుట తెలియని మారేడు చెట్టు దళములను మహదానందముతో స్వీకరిస్తాడు.బూడిదను పూసుకుంటు తనకు ఇష్టమని బూటకపు మాటలాడుతాడు.పోనీలే తన శరీరము తన ఇష్టము ఏమైన చేసుకోనీ మనకు వచ్చిన నష్టమేమిటని ఊరుకుందామా అంటే,పరమ నికృష్టులకు పరమపదమునందిస్తుంటాడు పతిత పావనులను నిర్లక్ష్యము చేస్తూ,-నింద.
లోపం నమః శివాయ-లోకం నమః శివాయ
రీతి నమః శివాయ-ప్రీతి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
మురుగ్గ నాయనారుతొండైనాడులోని తిరువెర్కాడులో జన్మించెను.చిన్నప్పటి నుండి శివ భక్తుడు.శివ భక్తులకు మధుర పదార్థములను వడ్డించి,వారు తృప్తిగా తినుటనుశివారాధనగా భావించెడివాడు. కపర్ది పరీక్ష అనగా కలిమిహరించుకుపోయినది.కాని కలిమి దూరమైనను శివ సంతర్పణల చెలిమిని వీడలేదు. శివభక్తులకు అన్నసంతర్పణలు ఆగిపోలేదు..మంచుకొండవానిమీద భక్తి ధనార్జనకు మంచిచెడుల విచక్షణను చేయనీయలేదు.అన్ని దానములలో అన్నదానము గొప్పదని ఆర్యోక్తి.
శివ సంతర్పణములకు కావలిసినధనమునకై చతుషష్టి కళలలో ఒకటైన జూదమును ఎంచుకొని,నిష్ణాతుడైనాడు.మంచుకొండ దేవుని మీది భక్తి మంచి-చెడుల విచక్షతను మరచినది.అందరిని జూదమాడుటకు
పిలువసాగాడు.రానన్న వారినినిర్బంధముచేయసాగాడు.ఎక్కువ సొమ్మును పందెముగా ఒడ్డమనే వాడు.ఓడిన,ధనమును నిర్దాక్షిణ్యముగా తీసుకోసాగాడు.
ధనమును ఈశ్వరార్చనకు ఉపయోగించెడివాడు.తనకొరకు అసలు వినియోగించెడివాడు కాదు.జూదగాడిని మెచ్చిన శివుడుగా సుందరారుచే కీర్తింపబడినాడు.వేదపురీశ్వర ఆలయములోమూర్ఖ నాయనారు విగ్రహము కలదు.కార్తీక మూలా నక్షత్రమునందు భక్తులచే పూజలందుకొనుచున్న నాయనారును అనుగ్రహించిన నాగాభరణుడు మనందరినిరక్షించునుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-60
ఓం నమః శివాయ-60
*****************
కుమ్మరివి నీవంటే ఓటికుండ నవ్వుకుంది
కమ్మరివి నీవంటే లోహము నమ్మకమే లేదంది
వడ్రంగివి నీవు అంటే కొయ్యముక్క అయ్యో అంది
విల్లమ్ములు నీవంటే రెల్లుపూజ చెల్లు అంది
పంటచేను నీవంటే పంట పంటలేసుకుంది
వైద్యుడివి నీవంటే ఔషధ నైవేద్యాలే అంది
గురువువి నీవంటే స్వరము విస్తుబోయింది
చల్లని ఇల్లు నీదంటే ఇల్లరికము అదేనంది
ముల్లోకములు నీవంటే వల్లకాడు గిల్లుకుంది
"నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో"అంటు
అన్నిరూపములు నీవేనంటే చాల్లే గొప్పలు అని
నిన్ను వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.
శివుడు తాను కుమ్మరినని చెబుతాడు కాని పనితనములేక ఓటికుండలను తయారుచేస్తాడు.ఇనుమునకై పనిమంతుడన్న నమ్మకమెలేదు.కొయ్యముక్కలను కూడ అడ్దదిడ్దముగా కోస్తుంటాడు.అంతటితో ఆగకుండ తాను గొప్పవైద్యుడనని చెప్పుకుంటు ఎప్పుడు మందులే తింటు ఉండాలంటాడు.-నింద.
ఏకము నమః శివాయ-అనేకము నమః శివాయ
లోపము నమః శివాయ-లోకువ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
వివిధ వస్తువుల సృష్టికి కారకుడుగా పరమాత్మ తదనుకూల రూపములతో ప్రకాశిస్తున్నాడు.సృష్టిలో భగవంతుడు జీవులుగా ప్రకటింపబడుచున్నప్పుడు వృక్షములను సృష్టించి,వాని దేహధాతువులగుచెక్క పదార్థమును నిర్మించి,చెట్ల రూపమును కలిగించును.జంతువుల దేహములను రథముల వలె నిర్మించును.శరీరము జీవికి రథము వంటిది.శరీరములోని ధాతువుల కొరకు మట్టిలోని ఖనిజములను రసాయినక ధాతువులను స్వీకరిస్తూ జీవులు తమ దేహధాతువులను నిర్మించుకొనును.భూమినుండి జనించిన ఆహారమును స్వీకరిస్తూ,జలమును తాగుతూ,వాయువును పీలుస్తూ,దేహపుష్టిని,మానసిక వికాసమును పొందుతున్నాడు కనుక విశిష్ట కుమ్మరి-కమ్మరి-వడ్రంగి-అన్ని వృత్తులు-వానినిష్ణాతులు శివస్వరూపములే.నిస్సందేహముగా వైద్యనాథునిగా సదాశివునకు సాష్టాంగ నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-59
ఓం నమః శివాయ-59
**********************
గట్టిగానే వారు నిన్ను ప్రార్థించారనుకుంటు,అందరిని
నెట్టుకుంటు వచ్చినీవు మట్టిలింగమవుతావు
సుతిమెత్తని బాలుడని వెతలను తొలగించాలంటు,అద్భుత
కతలను అందీయగ వచ్చినీవు సైకతలింగమవుతావు
అఖిలజగములకు మేము అమ్మా-నాన్నలమంటు,చక్కని
వలపుచాట వచ్చినీవు తెలుపు-నలుపు లింగమవుతావు
ఆకలిదప్పులతో నున్నారని-పాలధారలివ్వాలని,ఆగని
ఆతురతతో వచ్చినీవు అమృతలింగమవుతావు
హుటాహుటిని హడావిడిగా హనుమ పట్టుకొచ్చాడని,భళిరే
మెచ్చుకుంటు వచ్చినీవు అనేక లింగములవుతావు
లింగము అంటే గుర్తు అని-బెంగ తీరుస్తుందని వస్తే
ఒక్క గుర్తునుండవురా ఓ తిక్క శంకరా.
సివుడికి తొందర ఎక్కువ తన రూపమును గురించి,దానికి సంబంధించిన సంకేతమైన లింగము గురించి ఒక నిర్దిష్టమైన ప్రకటనమును చేయలేనివాడు.కనుకనే ప్రార్థనలకు ఉబ్బి తబ్బిబ్బై, అందరిని నెట్టుకుంటు వచ్చి మట్టిలింగముగా వెలిసినాడు.ఆ విషమును గమనించకుండ మార్కండేయుని అనుగ్రహించుటకై ఇసుకలింగముగా మారి పూజలందుకునే వాడు.ద్రాక్షారామ భీమేశ్వరుని భక్తుడు నీలో మీ ఇద్దరిని చూడాలని ఉందంటే సరే నని తాను అమ్మ తెలుపు-నలుపు రంగులలో ( ఒకేలింగముగా) దర్శనమిస్తానన్నాడు.ఉపమన్యు అను బాలభక్తునకు పాలను అందించుటకు బాణమును వేసి,అక్కడే క్షీరలింగముగా ఉండిపోయాడు.రామేశ్వర పూజకై హనుమంతుడు అనేక లింగములను పట్టుకురాగ కీసరగుట్టలో అనేక లింగములుగా అనుగ్రహిస్తున్నానంటాడు.ఒక చోట పొట్టిగ,మరొకచోట పొడుగుగా అసలు ఒక పధ్ధతిలేకుండ కనిపిస్తు నేనే శివుడనని,ఈ పలురకములైన లింగములు నా గురుతులంటు,భక్తులకు సంశయమును కలిగించే వాడు శివుడు-నింద.
మట్టి నమః శివాయ-ఇసుక నమః శివాయ
రంగం నమః శివాయ-లింగం నమః శివాయచ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
"నమ ఇరిణ్యాచ ప్రపధ్యాయచ" రుద్రనమకం. చవిటినేలలందు-నడుచు మార్గములను తయారుచేయు రుద్రునకు నమస్కారములు.దానికి ఉదాహరణయే కంచిలోని ప్రథివీలింగము.నమోనమః. నమ స్సికత్యాయచ" ఇసుకరూపములో నున్న ఈశ్వరా ప్రణామములు.అద్వైతమునే ద్వైతముగా చమత్కరించే అర్థనారీశ్వరా అభివాదములు.లోకములోని ఏకానేక స్వరూపా అనేకానేక నమస్కారములు.సర్వము-సకలము నీవై నిఖిలజగములను సంరక్షించి సదాశివా సకల శుభములను చేకూర్చుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-58
నీ పిరికితనమును చూసి నీ నామము భయపడింది
ఎందుకైన మంచిదని పొంచి పొంచి దాగినది
రెండు వేదముల మధ్య యజుర్వేదమును పెట్టినది
యజుర్వేద మధ్యలో రుద్రాధ్యాయమును చూసినది
అష్టమ వాకము రక్షణ అని సుస్పష్టము చేసినది.
రక్షణదాయినిగా పంచాక్షరిని పట్టుకుంది
రెండక్షరముల దాచలేని దైవము నీవేనంది
పంగ నామము పెడతావని నీనామము అనుకుంటోంది
గంగపాలు చేస్తావేమో నన్ను నీ చేతకానితనముతో
ఆది మధ్యాంత రహితుడా వాదనలేలర కావర
ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను ఇప్పుడు కాదంటే
ఎక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా
..నీ వీరత్వము మీద నమ్మకములేక "శివ"అను నీ పేరు వేదముల మధ్యనున్న యజుర్వేద మధ్యలోనున్న ,రుద్రాధ్యాము మధ్యలోనున్న అష్టమవాకమున చేరి,ధైర్యము చాలక "నమ:"అయ" అను రెందింటి మధ్య దాగినది నింద
వేదము నమః శివాయ-వేలుపు నమః శివాయ
నామము నమః శివాయ-నాథుడు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం
రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః
కాండేన తేన యజురేవ విభాతి నిత్యం
ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః"
పంచాక్షరీ మంత్రము శివ పదముచేత ప్రకాశించుచున్నది.అట్టి శివపంచాక్షరిని పేశంసించి నిర్దేశించుటచే రుద్రాధ్యాయము ప్రశస్తమగుచున్నది.అట్తి రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థ కాండము మహిమాన్వితమైనది.శివా నీ నామమునకు స్థానములై,యజుర్వేద-ఋగ్వేద-సామవేదములు సన్నుతింపబడుచున్నవి.శివా నీ దివ్య నామము వేదములనే ప్రకాశవంతము చేసినది.నిరంతరము దానిని జపించే భాగ్యమును అనుగ్రహింపుము.-స్తుతి.
శివ శివ శివ యనరాదా-శివనామము చేదా
శివ పాదము మీద నీ శిరసునుంచ రాదా .( శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు)
SIVA SANKALPAMU-57
ఓం నమః శివాయ-77
*********************
నిన్ని సొంతమని సేవిస్తే సుంతైనా కానరావు
ఎంతలేసి మాటలనిన సొంతమని అంటావు
నిన్నుచూడ తపియించగ నిరీక్షణే మిగుల్చుతావు
నెవ్వెంతవన్న ముందు ప్రత్యక్షము అవుతావు
కరుణించే వేళలలో కఠినముగా ఉంటావు
లెక్కలేదన్న వారిపై మక్కువ చూపుతావు
మనసును కట్టేయమంటే బెట్టెంతో చేస్తావు
కట్టుబాటు లేనివానిని కట్తిపడేస్తుంటావు
ముసలితనము వచ్చినా ముక్కిమూల్గమంటావు
పసికందుల హతమార్చి కసితీర్చుకుంటావు
నీ పనులప్రభావము నీకసలు తెలియదుగా
మక్కువలేదంటున్నారురా ఓ తిక్కశంకరా.
శివుడు నువ్వు లేవని,నిన్ను లెక్కచేయనని,మోసగాడివని,నీ అవసరము నాకు లేదని,నీకు ప్రీతికరమగు విధముగా నేనెందుకు ఉండాలని తర్కము చేసే వారిపై మక్కువ చూపిస్తాడు కాని భక్తితో కొలిచే వారికి,అనుగ్రహమునకై పరితపించే వారిపై నిర్లక్ష్యమును చూపుతు,సందభోచితము కాని పనులను చేస్తుంటాడునింద.
ప్రత్యక్షము నమః శివాయ-పరోక్షము నమః శివాయ
విరుధ్ధము నమః శివాయ-సన్నధ్ధము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" ఆద్యాయామిత తేజసే శ్రుతివదైః వేద్యాయ సాధ్యాయతే
విద్యానంద మయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే
ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైః గేయాయ మాయావినే
సమ్యక్తాండవ సంభ్రమాయ జటనే సేయం నతిశ్శంభవే"
శివానందలహరి.
ఆదిదేవుడు,అమితమైన తేజశ్శాలి,వేదవచనములచే తెలియబడువాడు,విద్యానందమయుడు,ముల్లోకములను సంరక్షించుచు( దానిని సామాన్య మనసులకు తెలియనీయకుండ మాయ అను పొరను కప్పువాడు) గొప్ప తాండవమును చేయుచు,జగములను రమింపచేయు శివునకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAM56
ఓం నమః శివాయ-84
****************
నీ చేతల మంచి-చెడులు నీ నిర్ణయమని అంటుంటే
నిరపరాధులను నీవు బాధిస్తున్నావంటున్నవి
శిలను శిల్పముగా మలచే స్థపతి అని నీవంటే
తప్పుచేయకున్నను తప్పవు ఉలిదెబ్బలు అంటున్నది శిల
నీటిని నివ్వెరపరచే నిషాదుడను అని నీవంటే
తప్పుచేయకున్నను తప్పదు వలకాటు అంటున్నది చేప
అడవిని సంరక్షించే మృగయుదను అని నీవంటే
తప్పుచేయకున్నను తప్పదు శరమువేటు అంటున్నది మృగము
ప్రళయమునే చూడగలుగు ప్రబుద్దుడను అని నీవంటే
ముంచుతున్న ఆపదను రక్షించలేని సాక్షివి అంటున్నది ప్రళయము
నిర్దయతో హింసిస్తు నిష్కళంకుడను అని నీవంటే
నిక్కమనుకోరురా ఒక్కరైన ఓ తిక్కశంకరా.
శివుడు తాను శిల్పినంటు-జాలరినంటు-వేటగాని నంటు-ప్రళయసాక్షినంటు చెప్పుకుంటు ఎన్నో ఎందరినో నిరపరాధులను అమాయకులను శిక్షిస్తున్నాడు.-నింద.
శరము నమః శివాయ-శరణము నమః శివాయ
జననము నమః శివాయ-మరణము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" యోగక్షేమ ధురంధరస్య సకలశ్రేయః ప్రదోద్యోగినో
దృష్ట్వాదృష్ట్వామతోపదేశకృతినో బాహ్యంతరవ్యాపినః
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కింవేధితవ్యం మయా
శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యన్వహం."
శివానందలహరి.
సర్వజీవుల యోగక్షమభారమును మోయు సదాశివా సకలము నీ అధీనము.
" నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః" రుద్రనమకము.
పరమేశ్వరుడు జగములన్నింటిని తనలో నిక్షిప్తము చేసుకొని,సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములను ఐదు పనులతో పునరావృతము చేస్తున్నాడు.స్థపతి అను పదము శిల్పి అను అర్థములో వాడుచున్నప్పటికిని,సర్వమును స్థాపించినవాడు అను మరొక అర్థమును కూడ పెద్దలు చెబుతారు.పంచకృత్య నిర్వహణలో జీవులు తమతమ కర్మానుసారముగా సుఖదు@ఖములను పొందుతు,కొత్త శరీరములను ధరించుచున్నవి.కొట్ట శరీరమును ధరించవలెనన్న శిధిలశరీరమును విడనాడవలసినదే కదా.
జగ్ కర్తా-జగ్భరతా-జగ్ హరతా తుం పరమేశా!పంచకృత్యములను సమభావముతో నిర్వర్తించు సదాశివా సకలజగములను సంరక్షింపుము.
ఏక బిల్వం శివార్ప
SIVA SANKALPAMU-55
JUN
3
Om nama sivaaya-81
ఓం నమః శివాయ-55
***************
నీలిమేఘమే నీవనుకొని నే చాతకమై చూశానురా
నీలిగరళము నన్ను చూసి గేలిచేసినదిరా
"సూర్యాయ-దక్షాధ్వర" అన విని చక్రవాకమై కదిలారా
మంచుకొండ నన్నుచూసి గేలి చేసినదిరా
చంద్రశేఖరుడవని నేను చకోరమై కదిలానురా
వెన్నెల్లిక్కడెక్కడిదని మూడోకన్ను గేలి చేసినదిరా
నటరాజువి నీవని నే నెమలిగా చేరానురా
భృంగి కన్ను నన్నుచూసి గేలిచేసినదిరా
శుభకరుడవు నీవని నే గరుడినిగా వాలానురా
కంచిగరుడ సేవకు సమయము మించిదన్నారురా
భ్రమలను తొలగించలేని భ్రమరాంబికాపతి,ఈ
ఇక్కట్లేమిటిరా నాకు ఓ తిక్కశంకరా
శివుడు తనదగ్గర మేఘము-వేడి-వెన్నెల-నాట్యము-ప్రభుతవము అన్నీ ఉన్నాయని,అవి తాను చెప్పినట్లు నడుచుకుంటాయని అంటాడు.కాని చాతకమునకు మేఘమునుండి వర్షమును ఇవ్వలేడు.చక్రవాకమునకు వేడిని ఇవ్వలేడు.చకోరమునకు వెన్నెలను అందించలేడు.నమలికి నాట్య మెలకువలను చెప్పలేడు.గరుడుని సేవలను స్వీకరించలేడు.-నింద.
చాతకి నమః శివాయ-చకోరి నమః శివాయ
ఎండ నమః శివాయ-వాన నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
శివా అజ్ఞానపూరితమైన నా మనసు నిన్ను నిందించి ఆనందపడుతున్నది.సత్యమును అవగతము చేసుకొనుచున్న నా మనసు నిన్ను అర్థము చేసికొనుటకు ప్రయత్నించుచున్నది.
" హంసః పద్మవనం సమిచ్చతి యధా నీలాంబుదం చాతకం
కోక: కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్థధా
చేతో వాంచతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జ యుగలం కైవల్య సౌఖ్యప్రదం"
శివానందలహరి.
హంస పద్మసరస్సును,చాతకపక్షి నీరునిండిన నల్లని మేఘమును,చక్రవాకపక్షి చంద్రుని ఏ విధముగా ప్రతిదినము ఇష్టపడతారో,అదేవిధముగా మోక్షమునకు
దారిని చూపు (జ్ఞానమార్గమునకు) నీపాదపద్మములయందు నా మనసు ఇష్టపడుచున్నది.కరుణామూర్తి కనికరించు తండ్రీ.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Posted 3rd June by taetatelugu.com
SIVA SANKALPAMU-54
ఓం నమః శివాయ-54
***********************
బూజుగూడు గుడియంటు మోజు పెంచుకున్నావు
తెలిసికొనవు ఆ పురుగు కట్టినదది ఎంగిలిదారములతోనని
మణులు పెట్టి కొలిచినదని మమత పెంచుకున్నావు
తెలిసికొనవు ఆ పాము పెట్టినది విషపు కోరలతోనని
ఏంచక్కటి అభిషేకమని ఏనుగును ఎనకేసుకొస్తావు
తెలిసికొనవు థు థు అంటు చిమ్మినది తొండపునీళ్ళనని
ఎన్నడు మూయని గుడియని ఎన్నో చెబుతుంటావు
తెలిసికొనవు శిరముతెగిన రాహుకేతు పూజలకని
దీపమును చూపిస్తూ,"వారెవా"వాయులింగమునంటావు
తెలిసికొనవు దీపము గాలికి రెపరెపలాడుచున్నదని
శ్రీకాళహస్తీశ్వరుడనని జాస్తి కబురులాడతావు,నీ పేరును
ఒక్కరైన పిలువరురా ఓ తిక్కశంకరా.
శివుడు సాలెగూటిని గుడి అనుకుంటాడు.విషముతాకిన మణులను వినోదముగా స్వీకరిస్తాడు.తొండముతో నీళ్ళుపట్టుకుని తెచ్చి,లింగముపైన పోస్తే అభిషేకము అనుకుంటాడు.తన ప్రతిభకు రెపరెపలాడు దీపమును సాక్ష్యముగా చూపిస్తాడు.ఏదో చెప్పుకుని తృప్తి పడనీలే అనుకుంటే అంతటితో ఆగక గ్రహణ సమయములో కూడా తన గుడి తెరిచి ఉంటుందని తాను అనుగ్రహములను ప్రసాదిస్తుంటానని అంటాడు కాని ఆ సమయములో జరిగే పూజలు రాహు-కేతువులకు కాని తనకు కాదని తెలిసికొనలేనివాడు-ఇంతా చేస్తే జనాలు కాళహస్త్యికి వెళుతున్నామంటారు కాని ఈశ్వరదర్శనమని అసలు చెప్పుకోరు.-నింద
మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా
రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నీవు మోక్షపదవీ సామ్రాజ్యమును ఒసంగిన పాము, సాలెపురుగు, ఏనుగు, కిరాతుడు మొదలైన వారందరూ నేనూ సమానులమే. ఏ విధముగా అన వారు నిన్ను మదిని చూచితిరి. నేను చూడలేకపోతి
దీపము నమః శివాయ-దీవెన నమః శివాయ
వాయువు నమః శివాయ-సాయము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమశివాయ.
" ఏ వేదంబు పఠించె లూత? భుజగంబేశాస్త్రములు సూచె,దా
నేవిద్యాభ్యసనంబొనర్చె కరి.చెంచేమంత్రమూహించె? బో
ధావిర్భావ నిదానములు చదువులYYఆ? కావు నీ పాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా"
మహాకవి ధూర్జటి.
చదువులెన్ని చదివినా జ్ఞానమును-మోక్షమును కలిగించలేవు.వాటన్నిటికి మించినది నీ దివ్యపాద సంసేవాసక్తియే నని,సాలెపురుగు-పాము-ఏనుగు-ఎరుకులవాడి నిరూపించి నిర్యాణమునందినారు.ఓ పరమేశా! ఏ మంత్ర జపములు తెలియని,నీ తత్త్వమును అవగతము చేసుకోలేని నన్ను,నీ అనవరత నిర్హేతుక కృపతో నీ పాద సర్వస్య శరణమును అనుగ్రహింపుము.నమస్కారములు-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Posted 13th July by taetatelugu.com
SIVA SANKALPAMU-53
ఓం నమః శివాయ-53
******************
వైభవమను పేరజరుగు ప్రలోభములు నీ సేవలు
నెత్తిన పోసిన నీటిని నాదని గంగ తాగేస్తోంది
భక్తితో పోసిన పాలను పాములు కానిచ్చేస్తున్నవి
చక్కెర-తేనెల తీపిని చీమలు పట్టేస్తున్నవి
చందన ధారలు మొత్తము జాబిలి దాచేస్తున్నది
జర్రున జారిన నేతిని విషము జుర్రుకుంటున్నది
కురిసిన పూలకుప్పలను భ్రమరము కప్పేస్తున్నది
రాలిన బూడిదరాశులకై లొల్లి వల్లకాడు చేస్తున్నది
ఆరురుచుల ఆరగింపు నంది తనది అంటున్నది
దొంగతనము నేర్పించిన దొంగలదొర,నీ సన్నిధి
నిమిషములో నామనసు దొంగగ మారుతున్నది
చక్కదము ఇదేనురా ఓ తిక్కశంకరా.
శివునికి అభిషేకము చేయు ద్రవ్యములను గంగ,పాములు,జాబిలి,చీమలు,విషము,తుమ్మెదలు,శ్మశానము,నంది అవి శివుని అర్పణము అని తెలిసినను పెద్దలోభమునకు వశులై తాము తీసుకుంటూ,స్వామి స్వామికి అందకుండ చేస్తున్నది.ఒక విధముగా ఇది చోరత్వమే.వాటి చోర స్వభావమునకు కారణము అవితస్కరపతి దగ్గర ఉండటమే.అంతేకాదు,శివుడు తనను సమీపించిన భక్తుని మనసులో కూడ చోరత్వమును ప్రవేశపెడుతున్నాడు.---నింద.
దొంగయు నమః శివాయ-దొరయు నమః శివాయ
తప్పు నమః శివాయ-ఒప్పు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" స్వేరాననం చంద్రకళావతంసం గంగాధరం శైలసుతా సహాయం
భస్మ భుజంగ భూషణం ధ్యాయత్ పశూనాం పతిమీశితారం."
చిరునగవుతో కూడిన మోముకలవాడును,చంద్రకళ శిరోభూషణముగా కలవాడును,గంగను ధరించువాడను,పార్వతితో కూడినవాడును,మూడుకన్నుల వాడును,విభూతియు-పాములు ఆభరనములుగా గలవాడును పశువులకు పతియైన ఈశ్వరుని త్రికరణములతో ధ్యానించెదను.
"ప్రలోభాద్యైరర్థాహరణ వరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే" శివానందలహరి.
దొంగలరాజగు ఓ శంకరా!నీవు మాపాపములను దోచుకొను దొంగవు అయినప్పటికిని కలుషితమైన నా మనసు నీ ప్రసాదమును స్వీకరించువానిని,అన్యముగా చింతించినది.దీనిని నేనెట్లు సహించగలను? కనుక ఓ దయాంతరంగా,దొంగతనమునకు ధనికుని ఇంట (విషయవాసనలను సంపదగల సంసారము నందు
) ప్రవేశింపగ ప్రయత్నించుచున్న సమయమున దానిని నీ అధీనములో నుంచుకొని నన్ను సంస్కరింపుము సదాశివా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-52
ఓం నమః శివాయ-52
****************
చంద్రుని అమృతధారలు ఔషధములను ఇస్తే
చమత్కారివై నేను గొప్ప వైద్యుడనంటావు
సూర్యుడు నేరుగా పత్రహరితమును అందిస్తే
సూటిగా నేనే హరికేశుడనని అంటావు
డమరుకము అనవరతము అమరనాదమును చేస్తుంటే
డాంబికముతో నేనే గొప్ప గురువునని అంటావు
గంగమ్మ జీవనదిగా జలధారలను ఇస్తే
దగాకోరువై నేనే ధాన్యరాశి నంటావు
పదములకడ ప్రమథగణము పరిచర్యలు చేస్తుంటే
పనిచేయకనే నేను పరిపాలకుడనంటావు
సొమ్మొకడిది-సోకొకడిది అన్నారు ఇదేనేమో
పక్కా మోసగాడవురా ఓ తిక్క శంకరా.
చంద్రుడు-సూర్యుడు-డమరుకము-గంగమ్మ-ప్రమథగణము కష్టపడుతుంటే,శివుడు వాటి శ్రమను ప్రస్తావించకుండా,అన్ని పనులను తానే చేస్తున్నానని గొప్పదనము తనకు ఆపాదించుకుంటాడు.-నింద.
చంద్రుడు నమః శివాయ-సూర్యుడు నమః శివాయ
ధాన్యము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ" రుద్ర నమకం.
ధాన్యరూపమున భూమినుండి పుట్టిన రుద్రునకు నమస్కారములు.అంతేకాదు ధాన్యమును నూర్చెడి భూమిలో పశువులను కట్టుటకు పాతిన గుంజ రూపమున నున్న రుద్రునకు నమస్కారములు.సదాశివా నీ మా శ్రేయస్సుకై ధాన్యముగా మారుతావు.ఆ ధాన్యోత్పత్తికి సహకరించు సూర్యచంద్రులుగాను మారతావు.అంతే కాడు ప్రణవ స్వరూపా నీ డమరుక నాదము సర్వవేదములను సంపదలను మాపై వర్షించుట నీ అనుగ్రహమేకదా తండ్రీ.మా బాగోగులను పరిశీలిస్తు మా శారీరక-మానసిక ఆరోగ్యమునకి సర్వదా జీవమనే ఔషధమును మాపై కురిపిస్తు,వైద్యుదవై మమ్ములను శక్తివంతులను చేయుచున్న వైద్యనాధా ప్రణామములు తండ్రీ.నీవు చేయని పనిఏది-నిన్ను ప్రస్తుతించగల పలుకేది.కనుక మేము ఏ విధముగా నిన్ను స్తుతిస్తే దానిని సమగ్రముగా భావించి,మమ్ములను సంరక్షించు శివా.నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...