ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-03

"కోశేషు పంచ్ర్హస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతి దేహ గేహం సాక్షీ శివః సర్వగతోంతరాత్మా సా కాశికాం నిజబోధరూపా." పదవిభజనము ప్రతి దేహగేహం-ప్రతి దేహమనే ఇంటిలో కోశేషు పంచః- అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ- ఆనందమయ అని ఐదు ప్రత్యేక స్వభావములు గల తొడుగులలో అదిరాజ మాన-విరాజమానమై యుండియును వానిచర్యలను గమనిస్తున్నప్పటికిని సాక్షీ శివః-వాటిని పట్టించుకోకుండా సాక్షిగా చూస్తున్న శివుడే/ ఆ ప్రకాశమే తత్త్వబోధను తెలియచేయుచున్న ప్రకాశము. పరమాత్మ కర్తృత్వము-భోక్త్వత్తమును ద్ధ్తానేనిర్వహ్పిస్తున్నప్పటికిని రెండుగా ప్రకటితమగుచున్నాడు.ఒక్కదానిని అర్థముచేసుకొనుటకు రెండు స్వరూప-స్వభావములు సహాయపడుతుంటాయి. అవే, 1. భవాని-దేహము-----భవుడు ఆత్మ 2.భవాని-జీవాత్మ-భవుడు-పరమాత్మ 3.భవాని-విభాజ్యము (పంచకోశములు-పంచేంద్రియములు-పంచతన్మాత్రలు -భవుడు-అవిభాజ్యము 4.భవాని-సగుణము-భవుడు నిర్గుణము 5.భవాని-సాకారము-భవుడు నిరాకారము 6.భవాని-ఇంద్రియసహితము-భవుడు ఇంద్రియ రహితము 7.భవాని క్షత్రము...