Posts

Showing posts from 2026

KAVITVAKAUMUDI-17-TIKKANA MAHAAKAVI

Image
 

HAPPY FATHERSDAY-2026

Image
 

kavitvakaumudi-06-nannaya adikavi title justification

Image
 

kavitvakaumudi-05

Image
 

kavitvakaumudi -pailamaharshi

Image
 

kavitvakaumudi-03 nagastuti aadiparvamu mahabharatamu

Image
 

ka-kha lato mukhaamukhi

Image
 

kavitvakaumudi-02 (udamkopakhyanamu)

Image
 

matrupuja utsavamu.

Image
 

kavitvakaumudi-01

Image
 

అ-ఆ ల ఆరుపేర్లు

Image
 

EE-praamukhyata

Image
 

E-indrajalam-02

Image
 

E-indrajaalam

Image
 

talakattu tamashaa

Image
 

teluguwords with prefix/suffix

Image
 

baaboy-mayasabha

Image
 

damtyamulu

Image
 

vakramu-kamthataalavyamu

Image
 

amtasthamulu-telugu varnamulu

Image
 

seesaa saradaalu-02

Image
 

seesaa saradaalu-01

Image
 

telugujatrryamulu-based on simili idioms

Image
 

ravigaamchanicho

Image
 

teluguvarnamala-alpa-maha pranamulu

Image
 

padyakathaa sudha-telugu

Image
 

words magic -telugu bhashalo

Image
 

padamulagaradi

Image
 

telugubhashaa prayaanamu-oggukatha

Image
 

samburalusooddaam raamdi-gidugu raammoortigaaru

Image
 

hrdyam mana padyam

Image
 

padavisleshanamu

Image
 

telugupadamulagaradi-taetateluguchannel

Image
 

hrdyam mana padyam telugu padyam

Image
 

"అ"చెబుతున్న కథ

Image
 

telugukavitva aavirbhaavamu-taetatelugu

Image
 

dalita kavitvam in telugu sahityam-taetatelugu

Image
 

viplava kavitvam in telugu sahityam-taeta telugu

Image
 

terachapa dimchina padava katha-Sree buchchibaabu

Image
 

diddubatu kathanika-sree gurajada

Image
diddubatu   

happy ugadi-2026

Image
 

ADITYAHRDAYAMU-29

Image
   · ఆదిత్యహృదయం-శ్లోకం-29 ******************** ప్రార్థన ******* 'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం  తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాశం  అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగం ********** ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుటకు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు. శ్లోకము ****** " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్   సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్." ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము. దీనిలో దాగిన మర్మము మహాద్భుతము. భగవద్గీతలోని గుణత్రయవిభాగమును మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే. ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము. రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు. వీరిద్దరిలోను సమయానుకూలముగా త్రిగుణములు వాటి ప్రభావమును చూపిస్తున్నాయి. తమో గుణము-మోహ కారకము. రజోగుణము-కార్య కారకము,అంటే, మానసికముగా నున్న మోహమును ...

ADITYAHRDAYAMU-28

Image
  ఆదిత్యహృదయము-శ్లోకము-28 ********************** ప్రార్థన ****** "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి. పూర్వ రంగము ********  అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .  ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా విధానము పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.  ఆచమనము అనగా భాషా[అర్థముగా) ద్రవమును స్వీకరించుట,త్రాగుట. సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూస్తూనే ఉంటాము.  సనాతనము సూచించిన ఈ నియమము షోడశ పూజా విధానములో/అథాంగ పూజలో, "హస్తే ఆచమనీయం సమర్పయామి" అని, పరమాత్మ మనకు అందించిన, మనలను పోషించుచున్న పంచభూతములకలోని జలమునకు కృతజ్ఞతను ఆవిష...

ADITYAHRDAYAMU-27

Image
 ఆదిత్యహృదయం-శ్లోకము-27 ******************* ప్రార్థన ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వ రంగము **********        యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.  తత్ఫలితముగా  రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు. సీతమ్మ ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.  యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు. అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.   సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట. తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస్తున్నది. శ్లోకము ***** ఏతత్ శృత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్నవాన్" పరమపావనమైన ఆదిత్యస్తోత్ర జపక...

GIRISAMCHA-ABHICHAKASE-SIVARATRI

Image
 గిరిశంచ-అభిచాకశీ **************** శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. గిరిశంచ అను పదమునకు పెద్దలు, కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు, వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను, ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు. సర్వ వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక, తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే,  ఆ పరమాత్మ,  "గిరిశంచ-అభిచాకశీ" ***************  నమకములో దర్శనీయమైనది పరమేశ్వరము.              చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది.    నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది. చమక పారాయణము , 'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యవంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ శక్తుల కేవల వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములో-స్థూలముగా విశ్వశరీరములో దర్శిస్తు ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును. ఏ...

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-26 ********************* ప్రార్థన **** " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********* శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,"సకలంభువనం-చకలము-బుకలము",ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే, ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు. ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో ఉపాధి నిరపేక్ష అనుసంధానము. ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ. ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో చెప్పి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడని కథనము. శ్లోకము ****** " అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యతి   ఏవం "ఉక్తా...

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-25 ********************** ప్రార్థన ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   కిరణ సమిత పాప ద్వేష దు@ఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********** ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా- అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు. ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు, "రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు. పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు, "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖః సుఖినో భవంతు" అని ఫలసిద్ధిని నొక్కి వక్కాణిస్తుంటే, పరమాత్మను స్త్రీమూర్తిగా/అమ్మగాభావించి,స్తుతించేవారు, " అనేన సద...

ADITYAHRDAYAMU-23

Image
 ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పరమాత్మ నాశయత్వేవ వైభూతం తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు. శ్లోకము ****** "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః  ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు. ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్ష్మముగా నున్నది అన్నది ప్రస్తుతము. ఈ విషయమును అర్థము చేసుకోవాలంటే మనము, పరమాత్మ-ప్రపంచము అన్న రెండింటి మధ్యనున్న, స్థూల శరీరము- సూక్ష్మశరీరము-కారణ శరీరము-మహాకారణ శరీరముల గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము. 1.పంచభూతములకలయికచే ఏర్పడినది స్థూలశరీరము.ఇది దృ...

ADITYAHRDAYAMU-22

Image
  ఆదిత్యహృదయము-శ్లోకము-22 *********************** ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది. చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది. .ఆ బంగారు కిరణము స్వామి అనుగ్రహమే. వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము. జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి ప్రకాశింపచేయుచున్నాడు.అదియే కదా, న ఛిందంతి శస్త్రాణి-న దహతి అన్న ఆత్మ వివేక సారము. పూర్వశ్లోకము కృతఘ్నఘ్నాయ అన్న ప్రళ...

ADITYAHRDAYAMU-21

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-21      ********  ప్రార్థన  ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణ సమితపాపం క్లేశ దుఃఖస్య నాశం   అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం-అంటూ , ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి. ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ. ఆ పరమాత్మ సూక్ష్మముగా , "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.  పరంజ్యోతి యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై, పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె, "తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్...

ADITYAHRDAYAMU-20

Image
  ఆదిత్యహృదయం-శ్లోకము-20 ************************ ప్రార్థన ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం-అంటూ , ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి. ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ. ఆ పరమాత్మ సూక్ష్మముగా , "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు. ఒకవిధముగా చెప్పాలంటే పరమాత్మ "విఘ్నేశ్వర " కరుణావిశేషములే ప్రస్తుత శ్లోకము. శ్లోకము ****** " తమోఘ్నాయ-హిమఘ్నాయ-శత్రుఘ్నాయ-అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః" శ్లోక భావమును గ్రహించుటకు సహాయకారకముగా పూర్వశ్లోకములలో ప్రయోగించిన కొన్ని పదములను ప్రస్తుత శ్లోకముతో సంధాన పరచుకుందాము. "రశ్మిమంతం-సముద్యంతం" దేవాసుర నమస్కృతం." స్వామి తనకిరణ కాంతులను సంపూర్తిగా ప్రసరిం...

ADITYAHRDAYAMU-19

Image
 ఆదిత్యహృదయము-19   **************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగమ్ను ************* పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు, ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ, "నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమాత్మ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము. శ్లోకము ******* "బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే "భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."  భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము పరమాత్మ ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట. 1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన, " ఏష బ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద-ప్రజాపతిః మహేంద్రో ధనదః కాల యమః సోమః అపాంపతిః" శ్లోకములో, పరమాత్మను, నీవే బ్రహ్మవు, నీవే విష...

ADITYAHRDAYAMU-18

Image
    ఆదిత్యహృదయము-18   ***************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము. సూర్యభగవానుని ఉదయాస్తమాన తూరుపు-పడమరదిక్కుల ప్రాశస్త్యమును, దినాధిపతిత్వమును-జ్ఞాన సంపత్తిని, పరమాత్మయొక్క,జయప్రదత్వమును-జయభద్రత్వమును స్తుతించిన అగస్త్యభగవానుడు,ప్రస్తుత శ్లోకములో ఉగ్ర/వీర స్వరూపమును,సారగ్రహణ స్వభావమును,మార్తండత్వమును(నాలుగు లక్షణములను) వివరించుచున్నారు. శ్లోకం ****** " నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః  నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమోనమః." ఉగ్రత్వమునకు-వీరత్వమునకు "నరసింహావతారమును " ప్రస్తావిస్తారు కొందరు ఉపాసకులు . 1. సూర్యభగవానుడ-నీవు ఉగ్రుడవు-నీ ఉగ్రత్వమునకు నమస్కారములు. ఉగ్రత్వమంటే భయంకరముగా కనిపించటమా అనుకుంటే కాదు అని చెబుతున్నది సనాతనము. "ఉత్ గ్రసతి ఉగ్రం" అంటున్నది సాహిత్యము. అన్నింటికిమించిన ఉన్నతస్థితి.అదియే పరమానందము/బ్రహ్మానందము.ఆ స్థితిని కలిగించువాడు ఉగ్రుడు .కాదు కాదు, ఉత్కృష్టస్థితియే తానైన వాడు ఉగ్రుడు.ఇదే ...

ADITYAHRDAYAMU-17

Image
         ఆదిత్యహృదయం-17   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము. *********** " తేజసామపి తేజస్వి" మండల వాసియై తన శక్తులచే నక్షత్రములను-తారలను-గ్రహములను-జ్యోతిర్గణములను నిర్మించి,వానిచే వెలువడుచున్న రశ్ములచే సకలభువన సాక్షియై, " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచుచు, ప్రస్తుత శ్లోకములో జయజయ ధ్వానములచే కీర్తింపబడుచున్నాడు. శ్లోకము ****** " జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః" నమోనమః శబ్దమును మూడుసార్లు ప్రయోగించారు మహర్షి వాల్మీకి.కొంతమంది దీనిని పునరావృతముగా భావిస్తే త్రికరణములతో సమర్పించు నమస్కారముగా ఉపాసకులు భావిస్తారు. ప్రస్తుత శ్లోకము ఆదిమూర్తి యైన ఆదిత్యుని, 1.జయప్రదునిగా 2.జయభద్రునిగా 3.సహస్రాంశునిగా 4.హర్యశ్వనునిగా , పూజిస్తున్నది. హరితము పచ్చదనము అభిలషించు మనసును హర్యశ్వముగా,భావనచేస్తూ,అదియును అనేకానేకములు/సహస్రములు,పరమాత్మను ధ్యానిస్తే,జయములు ప్రాప్తిస్తాయి-ప్రాప్తించిన ...

ADITYAHRDAYAMU-16

Image
        ఆదిత్యహృదయం-16   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము *********** ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత, ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు. శ్లోకము. ***** " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః." తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు. ( పశ్చిమ దిక్కును చేరి మరొక ప్రదేశములో తన రశ్ములచే ఉదయిస్తూ తూరుపుదిక్కుగా ప్రకాశిస్తున్న) పశ్చిమ అద్రిపై వాలుచున్న సూర్యునకు నమస...

ADITYAHRDAYAMU-15

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-15  *********************   ప్రార్థన   "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం   కిరణసమిత  పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  *******  ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,  ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.  శ్లోకము  ******  " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః    కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."   భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,  " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం    ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం    యస్మిన్ జగత్ సంహర లేఖనంచ    ...

ADITYAHRDAYAMU-14

Image
 ఆదిత్యహృదయము-14    ***************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం  భాస్కరం  తం నమామి."   పూర్వరంగము   ****ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి, ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు. శ్లోకము ******* 'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే". ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాధనములను  అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు. అనుసరిస్తూ,గ్రహించే అంతరిక్ష శరీరధారులే గ్రహములు.గోళాకారమును కలిగిన తొమ్మిది ముఖ్యగ్రహములు సూర్యలేక ఇతర నక్...

ADITYAHRDAYAMU-13

Image
     ఆదిత్యహృదయము-13    ***************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం  భాస్కరం  తం నమామి."   పూర్వరంగము ********* పరమాత్మ హిరణ్యగర్భునిగా,తన తేజస్సుతో అగ్నిగర్భుడై,రవి యై తపమును కలిగిస్తూ,శిశిరమును తొలగిస్తున్నాడు.అంటే ఘర్మసర్జన కిరణములతో శబ్దస్వరూపునిగా ప్రకాశిస్తున్నాడన్న అగస్త్యుడు, ప్రస్తుత శ్లోకములో ఆ శబ్ద వైశిష్ట్యమును-జలతత్త్వమును-దక్షిణాపథ గమనమును ,విజ్ఞానప్రదాత్వమును స్పష్టముగా తెలియచేస్తున్నాడు. శ్లోకము ***** " వ్యోమనాథః తమోభేది ఋగ్యజుసామ పారగః   ఘనవృష్టిః అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః"  స్వామి వ్యోమ వాసియై తన రశ్ములచే చీకట్లను తొలగించువాడు.ఇది వాచికము.  స్వామి ఆత్మస్వరూపియై తన జ్ఞానముచే అజ్ఞానమును పారద్రోలువాడు.  స్వామి త్రయీమూర్తిం వేదం అన్న ఆర్యోక్తిని నిజముచేస్తూ ,సుప్రభాత సమయమున  ఋగ్వేదముగాను-మద్యాహ్న సమయమున యజుర్వేదముగాను -అస్తమాన సమయముబ సామవేదముగాను,మూడువేదములచే సంస్తుతింపబడ...

ADITYAHRDAYAMU-12

Image
  ఆదిత్యహృదయము-12   *****************   జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.    పూర్వ రంగము *********** పరమాత్మ హరిత గుర్రములను-రథమును-సప్తశబ్ద ప్రాభవమును తెలియచేసిన అగస్త్యమహాముని,  పరోక్షముగా మనకు-ప్రత్యక్షముగా రామచంద్రునికి,ప్రస్తుత శ్లోకములో ద్వంద్వ విభాగములను-శాశ్వతత్త్వమును వివరిస్తూ,స్వామి ఏ విధముగా తన ప్రచండత్వమును-ప్రసన్నత్వమును అనుగ్రహిస్తూ,లోకరక్షణము గావిస్తున్నాడో వివరిస్తున్నారు. ఋగ్వేదము-వాల్మీకి రామాయణము-ఆదిత్యహృదయము పరమాత్మ ప్రాభవమును మానవులకు అర్థమయ్యే విధముగా సులభతరము చేసి ,చైతన్యవంతము చేస్తున్నది. శ్లోకము ****** " హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః   అగ్నిగర్భో దితేపుత్రః శంఖః శిశిరనాశనః"        ఋగ్వేడము స్తుతించినట్లు పరమాత్మ, 1హిరణ్యగర్భుడు-అగ్నిగర్భుడు. ************************  హితము-రమణీయము హిరణ్యము.ఇక్కడ హిరణ్యగర్భపదమును అంతః-బహిశ్చ యత్ సర్వం కింద భావిస్తే, " హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూ...

ADITYAHRDAYAMU-11

Image
    ఆదిత్యహృదయము-11   *****************   జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.    పూర్వ రంగము *********** రశ్మిమంతుడు లోకరక్షణావిధానమునకై కొన్ని శక్తులను-వాటికి సహాయకారులగు మరికొన్ని బృందశక్తులను తన కిరణముల ద్వారా ప్రసరణముచేస్తూ,వాయు-వహ్ని రూపములతో తాను ప్రాణశక్తిగా ప్రకాశించుచున్నాడు. ప్రస్తుత శ్లోకము 'మరీచిమాన్" అన్న , మారయతి యత్ మరీచి అంటు,సంహారము చేసే శక్తి మరీచి అని,అందులో శ్రేష్ఠుడు కనుక మరీచిమాన్ అంటూ సంహారకుడు కూడా సూర్య శక్తియే అని స్తుతిస్తున్నది. శ్లోకము. ****** " హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్  తిమిరో ఉన్మథనః శంభుః త్వష్టా మార్తాండ-అంశుమాన్" పరమాత్మ మార్తాండుడు.ఈ శబ్దమును రెండు విధములుగా అలంకారికులు అన్వయిస్తారు. అదితి తన గర్భములో పెరుగుతున్న పరమాత్మను స్తుతిస్తూ,ఉపవాసాది నియమనిష్ఠల వలన,నీరసమైన వేళ,కశ్యపుడు ఆమెను నీ ఉపవాసములతో పిండమును చంపేస్తావా అనగానే పిండము నేలజారినదని,(అచేతనమైనదని) దానికి సమాధానముగా అదితి తన శి...

ADITYAHRDAYAMU-10

Image
     ఆదిత్యహృదయము-10    ****************  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.      పూర్వరంగము ********* పరమాత్మ రశ్మిభావనతో సముద్యంతుడై సకల చరాచరములను సృష్టించి-పోషించుటకు తన నుండి వివిధ శక్తివంతములైన కిరణములను ప్రసరింపచేస్తూ,వానికి సంకేత నామములను అనుగ్రహించి,మరికొన్ని సహాయక బృంద శక్తులను వాటికి ఏర్పరచి,తాను "వాయుర్వహ్ని ప్రజారూప" గా పరిఢవిల్లుతున్నాడన్న అగస్త్యుడు, ప్రస్తుత శ్లోకములో ఏ విధముగా , "అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప నారాయణో హరిః" అన్నట్లుగా హిరణ్యగర్భుడై విరాజిల్లుతూ,అనేకానేక దివ్యశక్తులను వెదజల్లుతున్నాడన్న అనుగ్రహమును అనేకానేక సాంకేతిక నామములో సంకీర్తిస్తున్నాడు. శ్లోకము ****** "ఆదిత్య సవితా సూర్యః ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః." ప్రస్తుత శ్లోకము స్వామి అనుగ్రహిస్తున్న శక్తుల సామర్థ్యమునకు సంకేత నామములే. పరమాత్మ, 1.ఆదిత్యుడు 2.సవిత్రుడు 3.సూర్యుడు 4.ఖగుడు 5.పూషుడు 6.గభస్త్మానుడు 7.సువర్ణసదృ...

ADITYAHRDAYAMU-09

Image
  ఆదిత్యహృ%దయము-09 ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి. పూర్వరంగము ************ అద్వితీయమైనపరమాత్మ "రశ్మిభావన"తో సముద్యంతుడై పునః సృష్టిని కావించి,పాలించుటకై,తన నుండి కొన్ని అద్భుతశక్తులను కిరణములగా భూమిపైప్రసరింపచేయుచు వాటికి బ్రహ్మ-మహేశ్వర-విష్ణు-స్కంద ఇత్యాది నామములను ప్రసాదించినాడు. ప్రస్తుత శ్లోకములో ఉద్భవించిన ఆ శక్తులకు సహాయకారులుగా మరికొన్ని శక్తిబృందములను విస్తరించినాడు. వానికి వివిధ సార్థకనామములను-స్వభావములను ప్రకటించినారు. ఐతిహాసికపరముగా సమన్వయ కథనమున్నప్పటికిని మనకు వాటిని కార్యనిర్వహణశక్తులుగా/ప్రాణశక్తులుగా వైజ్ఞానిక శాస్త్రము వివిధశాఖలను అప్పగిస్తుంది. శ్లోకము ***** " పితరో వసవ సాధ్యా యశ్వినో మరుతో మనుః వాయుర్వహ్ని"ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః" ముఖ్యపదము"-వాయుర్వహ్ని ప్రజాప్రాణా" ప్రజలప్రాణశక్తులు-అగ్ని/చైతన్యము-వాయువు గాలి. పరమాత్మ అన్ని ఉపాధులలో అగ్నిస్వరూపముగా దాగి-దానిని ఉచ్చ్వాస-నిశ్వాసములను వాయు ప్రక్రియ ద్వారా ...