Posts

Showing posts from December 23, 2017

Ananda Lahari-amma kathalu

Image
సౌందర్య లహరి పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము మంచి పనులు చేయుచున్న ఇంద్రియములు ఐదు వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసి అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము నిశ్చల భక్తిని నిన్ను గొలువ నిష్ఠను చేరినదమ్మా మనో వాక్కాయ కర్మలు అను ముగ్గురు మిత్రులతో ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. భావము నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.చెవి,కన్ను,ముక్కు,నాలుక,చర్మము అను జ్ఞానేంద్రియములు,పాణి,పాద,పాయు,ఉపస్థ,వాక్కు అను ఐదు కర్మేంద్రియములు,రస,రక్త,మాంస,మేధ,అస్థి,నుజ్జు,శుక్ర అను ఏడు ధాతువులు,మనసు కలిసి ఎనిమిది ఉన్న నా హృదయము ,మనస్సు,మాట,పని అను ముగ్గురు మిత్రులతో నిన్ను సేవించ నిష్ఠను చేరుటకు బయలు దేరినది.నా శరీరము పావన శక్తి పీఠముగా మారుటకు ప్రయత్నించుట ఎంతటి అదృష్టము.ఈ శుభ సమయములో నీ చెంతనే నున్న నా వేలిని విడిచి పెట్టకమ్మా.అనేక వందనములు. " యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః. ...