CHIDAANAMDAROOPAA-MAANIKYA VAACHAGARU

చిదానందరూపా-మాణిక్య వాచగరు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా " బ్రహ్మాండం వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలాత్ కపర్దాః కలిత శశికళాః చంద్ర కోదండ హస్తాః వ్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరా శాంభవామూర్తివేదాః రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత భవా నః ప్రయచ్చంతు సౌఖ్యం." చిదానందరూపా-మాణిక్య వాచగరు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా అంబాపతి భక్తుడు అరగౌణ మహారాజ అమాత్యులవారు తిరువిలయడలును అందించిన మాణిక్య వాచగరు అశ్వములను కొనుటకు పోవుదారిలో ఈశ్వరుడెదురాయెగ విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ తడవుగ అడవిలో నక్కలు వెడలెను హయముల మాదిరి విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి బెంగను తీర్చగ గంగకు ఉప్పొంగగ ఉత్తరువాయెగా శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందు...