Tuesday, January 5, 2021

ALO REMBAVAY-23







 



       ఇరవదిమూడవ పాశురం
      *********************
 మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం
 శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు
 వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి
 మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు
 పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్
 కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పడయ
 శీరియశింగాసనత్తు ఇరుందుయాం వంద
 కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్



  ఓం వ్యతస్త పాదారవిందాయ నమః
  *****************************

   మహాద్భుత-మంగళ పరిస్థితులను ఉదహరిస్తు గోదమ్మ మనలను ఈ పాశురములో మంత్ర ముగ్ధులను చేస్తున్నది.గోపికల సర్వస్య శరణాగతియే స్వామిని అపన్న ప్రపన్నుని-ఆహ్లాద ప్రసన్నుని చేస్తూ మనలను గమన సౌందర్యముతోను-ఆసీన సౌందర్యముతోను అలరించుటకు పూనుకున్నది.
స్వామి,

 శీరియ సింగము-పరాక్రమమైన సింహము


 అంటే పర-పరమాత్మ ఇప్పుడు ఏవిధముగా నున్నాడంటే సర్వమును ఆక్రమించి,తనలో ముడివేసుకొని,నల్లనైన చీకటితో నిండిన ,

 మలై-కొండయొక్క,
 ముళింజిల్-గుహలో,ఎవరితో నున్నాడు?
 మణ్ణిక్-భార్యతో/సివంగితో,
 కిడందు-మైధునమై,
 ఉరగుక్కుం-నిదురిస్తున్నాడు.

 బాహ్యమునకు కొండగుహలో సింహరూపమున స్వామి తన భార్యయైన సివంగితో కలిసి కొండగుహలో నిదురిస్తున్నాడు.

 స్వామి కొండగుహలోనికి ఎందుకు చేరాడు? 
 మారి-వర్షము బాగా కురిసి సర్వము జలమయనందువలన.

 శీరియ సింగం స్వామి -పరాక్రమవంతమైన  సింహము



 పరాక్రమము అంటే ఏమిటి?
 సర్వమును-సకలచరాచరములను తనలో/తనతోముడివేసుకొని ఆక్రమించినది.కనుక మనకు ఏమియును గోచరించదు.అంతయును జలమయమే//ప్రళయమే.
 అట్టి సమయమునందు కూడ ఏమాత్రమును తన వైభవమును  కోల్పోకుండా ప్రకాశించుచున్న పరమాత్మయే-పర/పరము.ఆక్రమించుకొని,
 రూప-స్వరూప-గుణ-విభవములతో విరాజిల్లుతున్నాడు పరమాత్మ.
1సత్యము-జ్ఞానము-అనంతము అను స్వరూపము.
2.అప్రాకృత-నిత్య-హిరణ్మయ రూపము.
  పంచభూత సంబంధములేనిది.
3.సర్వసంకల్ప-సర్వ సమర్థ-సర్వజ్ఞత్వము గుణము.
4.నాల్గవది విభూతి/వైభవము.అదియే లీలా విభూతులుగా వినుతికెక్కినవి.
  పై స్వరూప-రూప-గుణములతో విరాజిల్లుచు సింహమువలె
,-సివంగిని కలిసి నిదురను పోవుట,అదియును గుహలో- లీల.వైభవము.
 ఇది పంచశయనిత్తెల్ అని గోదమ్మ చెప్పిన సలక్షణమైన లక్ష్మీనారాయణ మైథునము


.ఏవిధముగా శిరువీడుకు చిన్న మేతకు ఎరువై-గేదెలను/గోవులను కట్ట్ళు విప్పి వదులుతారో మేసిన తరువాత అవి   కొట్టము      లోని రాటి వద్దకు వచ్చి నిలబడతాయో,అదేవిధముగా స్వామి తనతో ముడివేసుకొని యున్న మనలను ముడులు విప్పి,కొంచము సేపు ప్రపంచమనే చిన్నమేతకు వదిలి,ఆ సమయములో తాను మనలో దాగి,తిరిగి తనతో/తనలో ఆక్రమించుకుంటాడు. అదియే మర్రి-వాన.   


 దయాళువైన స్వామి గోపికలపై/మనపై కరుణించి ,కన్నులు తెరిచినప్పుడు అవి,
దీవిళిత్తు-ఎర్రగా జీరలతో వెలుగుతున్నాయట.

 సృష్టి ప్రారంభసూచకముగా తమోగుణము నల్లదనముగా ఆక్రమించినప్పటికిని,స్వామి తన నేత్రములను (ఎర్రని) తెరచి రజోగుణావిష్కారమును చేసినాడు.తమోగుణము-రజోగుణము-స్వామి ప్రకాశమును ఆశ్రయించి శుధ్ధసత్వ గుణముగా శుభములను సూచిస్తూ ప్రకాశిస్తున్నది.త్రిగుణ పరిచయమే కాదు స్వామి కాంతి-నాద పరిచయములను కూడ తన చూపుతో,గర్జనతో చేసినాడు.
 ఆ చల్లనిచూపుయేసృష్టి పునఃప్రారంభము.ఆ గర్జనయే ప్రణవము.

  ఆ తరువాత ఆ సింహము -తన కాళ్ళను ముందుకు సాచి ఒళ్ళువిరుచుకున్నది.అదియే పాంచజన్యుని నుండి పంచభూతములు విస్తరించుచున్నవనుటకు సాక్ష్యములు.వాటికి తోడుగా స్వామి తన,వేరిమయర్-జూలును/కేశములను,
పొంగ-విదిలించ సాగాడు/విస్తరించసాగాడు.ఎటువైపు అంటే?
 ఎప్పాదుం-సర్వత్రా/అన్నివైపువాలా,
 పెరిందుదడై-చొచ్చుకొనిపోవుచు సృష్టిని విస్తరింపచేస్తున్నాడు.

 దీనిని దర్శిస్తుంటే మనకు" గోపికలు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతు పరమాత్మకు చేరువవుతున్నారని-పరమాత్మ వారికై ఒక్కొక్క మెట్టు దిగివస్తూ వారిని చేరదీస్తున్నాడనగలము".వారితోబాటుగా ఉన్నాము కనుక మనము కూడ ...

 కనుకనే వారికి,
 స్వామి యున్న గుహలోని చీకటి నేను తమోగుణమును కాదు సుమ,స్వామిశరీర కాంతిని ఆశ్రయించుకొనియున్న అతసీపుష్పకాంతిని అని చెబుతున్నట్లుగా స్వామి ప్రకాశిస్తున్నాడు కొండగుహ వెలుపలికి వచ్చి తన చతుర్విధగతులతో.

 అర్థముచేసుకున్నారు అతసీపుష్ప సంకేతమును.అర్థిస్తున్నారు స్వామిని నీవు మా హృదయమనే శీరియ సింగాసనముపై.ఏ విధముగా చీకటి ప్రకాశవంతమైనదో-అదే విధముగా గొల్లెతల హృదయము స్వామి ఆసీనుడగుటచే శీరియ సింగాసనముగా మార్చి,సేవలనందుకొను భాగ్యమును కోరువారలము.అని వినయముగా స్వామితో వారు విన్నవించుకుంటున్నారు తమ మనసులోని కోరికను.



 అవిసెపువ్వు వంటి మేనికాంతితో మమ్ములను వివశులను చేయుచున్న కన్నా! సింహాసనాసీనుడవై,సొబగుగ మమ్ము పాలించు అని అనుచున్న గోపికలతో, గోపికలతో బాటుగా నున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము గోవిందుని సేవకై సిధ్ధమగుదాము.

 ఆండాళ్ దివ్య తిరువడిగలే  శరణం.



  


  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...