SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARA CHAKRAMU
%20(1).jpg)
శ్రీచక్రధారిణి-06-సర్వరక్షాకరచక్రము ************************** ప్రార్థన ****** "తాదృశం ఖడ్గమాప్నోతితేనహస్తస్థితేనవై అష్టాదశ ద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి." ఇప్పటివరకు ********** మనము సృష్టి త్రయ చక్రములను విశేషములను తెలిసికొని,రెండవ భాగమైన స్థితిచక్ర త్రయములోని చతుర్దశారము-బహిర్దశారమును దర్శించి అత్యంత కీలకమైన (జ్యోతిర్మయ చక్రము/విజ్ఞాన చక్రము)లోనికి ప్రవేశించబోతున్నాము. * గమనిక ***** ప్రియ మిత్రులారా ఇప్పటివరకు ముచ్చటించుకున్న ఆవరణములలోనేను, "అర్థముచేసుకున్న వారికి అర్థము చేసుకున్నంత" అను వాక్యమును వ్రాసినది నా ఉపాధి అహంకారముతో కాదు. భూపురము నుండి బహిర్దశారము వరకు మనము పూర్తిగా మాయచే/మాయమలముచే కప్పబడియున్నాము కనుక ఒకవేళ మనము పూర్తిగా అమ్మ తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నించినప్పటికిని వీలుకాదు. ఇప్పుడు మన మనసు గురువు తలపుతో-గురు పాదసరణాగతితో మాయను చాలావరకు తొలగించుకుని "గురు బోధనూ శ్రవణము చేయగల అదృష్తమును పొందియున్నది. కనుక ఇకనుండి దే...