Posts

Showing posts from February 26, 2018

SAUNDARYA LAHARI-18

Image
   సౌందర్య లహరి-18   పరమపావనమైన   నీ పాదరజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   అనంతము అవ్యయము అద్భుతము అయిన తల్లి   పద్మకోశములో నిలిచి  ప్రకాశించుచున్నదని   అనేక నారులుగా సాగుతూ అలరారు చున్నదని   ప్రధాన నార సూక్ష్మ రంధ్రములో ప్రజ్వలము తానని   బహిర్ముఖమును వీడి అంతర్ముఖమైన నాలోని   వైశ్వానర రూపమైన  మాహేశ్వరి కరుణతో   నాలోనే ఉన్నదన్న  నగ్నసత్యము  తెలిసికొని   నా  మాంస శరీరము మంత్రపుష్పమైన వేళ   నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి. " నీలతోయద మధ్య్స్థా విద్యుత్లేఖేన భాస్కరా!"   మనసనే పుష్పమే మంత్ర పుష్పము.   " పత్రం-పుష్పం-ఫలం-తోయం" భగవంతునికి భగవంతునికి భక్తితో సమర్పించిన ప్రీతిపాత్రములు అని భగవద్గీత పేర్కొన్నది.బిల్వ పత్రములు-తులసి దళములు-పువ్వులు-పండ్లు-జలము వీనిలో ఏ ఒక్కటి సమర్పించినను,వీలైతేఅన్ని సమర్పించినను పరమాత్మ /పరమేశ్వరి స్వీకరిస్తుంది.బాహ్య పుష్పములతో పాటు,మన అంతరంగమనే హృదయ ...

SAUNDARYA LAHARI-17

   సౌందర్య లహరి-17   పరమపావనమైన నీపాదరజ కణము   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   నీ విలాసపు కన్ను కైలాసపు దారిని చూపించింది   సరస సల్లాపముగా భుజము తట్టి నడిపింది   త్రికరణ శుద్ధిగా నీకు పూజను చేయించింది   వేదన పడుచుండగా వీడలేని విధముగా   భక్తి అనే పద్మమును నీ పాదపద్మములు చేర్చమంది   నా ధ్యాసను మార్చేసి ధ్యానము చేయమంది   ధ్యానము-ధ్యాస అను కుడి-ఎడమ అడుగులతో   నా పాదములు భక్తితో ప్రదక్షిణము  చేయువేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  "యాని కానిచ పాపాని  జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణష్యంతి  ప్రదక్షిణ పదే పదే." దీని అర్ధం "గతకాలంలో నేను చేసిన పాపాలు సమస్తమూ నేను ఈ ప్రదక్షణ చేయుచున్నప్పుడు వేయు ప్రతీ అడుగు తోను  నశించిపోవాలి, అని పెద్దలు చెబుతారు.   ప్రదక్షిణమునే పరిక్రమము అని కూడ పిలుస్తారు.పరిక్రమము అనగా సిద్ధమగుట.మనము దేనికి సిద్ధమగుచున్నాము.ప్రదక్షిణమునకు.అనగా దక్షీన దిశగ నున్న మార్గములో పయనించుటకు.మనము ఎందుకు ...