BRAHMAJNAANAVALEE STOTRA MAALIKA.

బ్రహ్మజ్ఞాన వళీమాల-శ్రీ ఆదిశంకరాచార్య విరచితము ***************************************** కలిసిలేను-కలువబోను తెలియరాను నిజం నిజం నశ్వరము నే కానే కాను సచ్చిదానందమును నేను. నిత్యము నేను-శుద్ధము నేను సర్వవ్యపిని నిజం నిజం ఆకారము నే కానేకాను సచ్చిదానందమును నేను. సత్యము నేను-సాక్షిని నేను పాప రహితము నిజం నిజం పతనము నే కానేకాను సచ్చిదానందమును నేను. చైతన్యమునేను-జడము నేను ఆనందరూపము నిజం నిజం నాశనము నే కానేకాను సచ్చిదానందమును నేను. శాంతము నేను-ఆనందము నేను ఆత్మానందము నిజం నిజం ప్రకృతిని నే కానేకాను సచ్చిదానందమును నేను. తనువు కాను-మనసు కాను సుఖరూపమును నిజం నిజం నానారూపిని నే కానేకాను సచ్చిదానందమును నేను. గుణమును కాను-దోషమును కాను పరంజ్యోతిని నిజం నిజం మాయను నే కానేకాను సచ్చిదానందమును నేను. మాయను కాను-మర్మము కాను స్వయంప్రకాశము నిజం ని...