PADISAKTULA PARAMAARTHAMU-SHOEDASI
పదిశక్తుల పరమార్థము-మూడవ శక్తి-షోడశి ****************************** ***** శైశవము-బాల్యము-కౌమారము-యవ్వనము-వార్ధక్యము ఎప్పుడు ఎలా మనకు వస్తాయో మనము గుర్తించలేమో అదేవిధముగా ఈ పదిశక్తులు ఒకేతాటిపై నడుస్తూ ఎప్పుడు తమ స్వరూప-స్వభావాలలో మార్పులను కనబరుస్తాయో తెలిసికొనుట కష్టము. రూపవిషయమునుపరిశీలిస్తే నలుపు నీలమై నీలము సిందూరవర్ణమవుతున్నది.స్వభావము ను పరిశీలిస్తే అతిగాంభీర్యము కొంత ఉపశమించి,గంభీరత మరికొంత ఉపశమించి క్రీడావినోదత్వముగా మారుట దేవి లీలలు. మూడవ శక్తి యైన షోడశి గొంగళిపురుగు కాలక్రమములో సీతాకోక చిలుకగా మారినట్లు మూలతత్త్వమైన కాళి స్వభావము నుండి,దానిని ఆధారము చేసుకొని ఏర్పడిన తారా తత్త్వము నుండి బ్రహ్మ విద్య తత్త్వమునుగ్రహించినప్పటికిని, తనదైన ప్రత్యేకతను చాటుతూ సుందరీయోగముగా విశ్వమును సుందరోపేతముగా మలచినది..పూలు-పళ్ళు-పక్షులు-నె మళ్లు అన్నీ అందాలే.వాటిపై మనుషులకు మోహాలే.అందుకే షోడశి తన చేతులలో చెరుకువిల్లు-పూలబాణములు,పాశము- అంకుశము ధరించి మోహమనే పాశ0ను అంకుశముతో తెంపేస్తుంది.ఇంకెందుకు కత్తి-కత్తెర? బా...