NA RUDRO RUDRAMARCHAYAET-14(SIVAANAMDALAHARI)

శ్లో : ప్రభు స్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశు-పతే ప్రముఖ్యో(అ)హం తేషామ్-అపి కిమ్-ఉత బంధుత్వమ్-అనయోః త్వయైవ క్షంతవ్యాహ్ శివ మద్-అపరాధాశ్-చ సకలాః ప్రయత్నాత్-కర్తవ్యం మద్-అవనమ్-ఇయం బంధు-సరణిః అ సంబంధమును మరింత స్పష్టము చేయుచు,పరమబంధు అని స్వామిని సంబోధిస్తూ,బంధు సరణి అని బంధువులను రక్షించే విధానము అని గుర్తుచేస్తూ,బంధుత్వం అనయో-మనమధ్యన నున్న బంధుత్వము కిముత-మళ్ళీ మళ్లీ గుర్తుచేయవలసివస్తుంది.ఎందుకంటే, ఆకలి-ఆహారము దప్పిక-జలం చీకటి-వెలుతురు జీవము-దైవము పరస్పరాశ్రితములో అదేవిధమైన సంబంధమొకటి మన మధ్యన కలదు.అది ఏమిటంటే, త్వయేవ క్షంతవ్య-స్వామి నీయొక్క క్షమాగుణము మత్-నన్ను అనవదం-రక్షించునునని సకలాః ప్రయత్నాత్-ఏ విధముగా నైన హే పశుపతీ! నీవు ధర్మ నిరతిని వివరించినప్పటికిని,నేను సంసారభ్రాంతిలో సర్వమును మరిచి,అపరాధములను ఒకటి కాదు/రెండు కాదు/లెక్కలేనన్ని చేసితిని.అయినప్పటికిని అతిదీనత్వముతో నున్నవాదను నేను అతి దయాళువు నీవు అపరాధిని నేను అపరాధక్షమయే నీవు లోక బాంధవా, మన మధ్య సంబంధము దేహమునది కాకపోవచ్చును.అయినప్పటికిని జగత్పితా నీవు సృష్టించిన చరాచర...