Monday, March 19, 2018

SAUNDARYA LAHAR-50

సౌందర్య లహరి-49

 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 అధిష్ఠాన దేవునిగ ఆ నారాయణుడుండగ
 అవరోధములను అధిగమించి మరికొంచము పైకిపాకుతు

 పంచభూతములలోని అగ్నితత్త్వముగ
 పంచాక్షరి నామములోని " శి"అక్షరముగ మారి

 డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ అను అక్షరములు పదింటిని
 పది దళములుగల పద్మములో ప్రకటించుచు

 నాభిస్థానము వెనుకనున్న జ్ఞానశక్తి రూపముగా
 మణిపుర చక్రములో నిన్ను చూచుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి. 

 మణిపుర చక్రమును నాభికమల చక్రము అని కూడ అందురు.తిరోధానముగ నున్న త్రికోణ చిహ్నమును (తలక్రిందులుగ నున్న త్రిభుజము) కలిగి ప్రాణ-అపాన వాయువులకు కలయిక స్థానముగా ఉంటుంది.పసిమి రంగు పది దళములతో ప్రకాశిస్తుంటుంది.సౌర-అగ్నితత్త్వ మిళితమైన అరోగ్యప్రదాయిని.మంచిగుణములను మణులతో ,లక్ష్మీ-నారాయణ రూపముతో ప్రకాశించుచు,అనుగ్రహించుచున్న శ్రీ మాతను మణిపురచక్రములో నేను దర్శించగలుగుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  


SAUNDARYALAHARI-49

సౌందర్య లహరి-48
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవునిగ ఆబ్రహ్మదేవుడుండగ
పాము చుట్ట విప్పుకొని కొంచము పైకి పాకుతు
పంచభూతములలోని జలతత్త్వముతో
పంచాక్షరి నామములోని "మ" అక్షరము నీవై
ప-భ-మ-య-ర-ల అను అక్షరములు ఆరింటిని
ఆరు దళములు గళ పద్మములో ప్రకటించుచు
జాగృతమొనరించుచున్న క్రియాశక్తి రూపముగా
స్వాధిష్ఠాన చక్రములో నిన్నుచూచుచున్న వేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
స్వాధిష్ఠానచక్రము మూలాధార చక్రమునకు మూడు సెంటిమీటర్ల పైన, ఆరు దళములు గల పద్మముగా,లేత ఎరుపు రంగులోనుండును.ఇందులో జాగృతమైన మన చెడు భావనలు కుండలినీ శక్తిని మణిపుర చక్రమువద్దకు పోనీయక అడ్డుపడుచుండును.ఫలితముగా ఒక్కొక్కసారి కుండలిని అథోముఖమై మూలాధారమును చేరవలసి వస్తుంది.స్వాధిష్ఠాన చక్రము యొక్క చిహ్నము మొసలి.మరల మరల కార్య సిద్ధికి ప్రయత్నముచేసే స్వభావములేనిది.అలసత్వముతో (సోమరిగ) నుండును.రుచిని తెలుపుటకు-పునరుత్పత్తికి సహాయపడుచున్న స్వాధిష్ఠాన చక్రములో (అమ్మ దయతో) సూక్ష్మ రూపమున శ్రీమాతను గుర్తించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...