ADITYAHRDAYAM-SLOKAM-05

ఆదిత్య హృదయం-శ్లోకము-05 *********************** ప్రార్థన ****** " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** స్తోత్ర పరిచయము-ఆత్మ స్వరూపము-అర్చనావిధానము-ఫలసిద్ధి మొదలగు విషయములను అగస్త్యమహర్షి రామ చంద్రునకు/మనకు వివరించినారు. ఒక సిద్ధాంతము ప్రకారము ప్రస్తుత శ్లోకమును, "ఆదిత్యహృదయ స్తోత్ర" ప్రారంభశ్లోకముగా పరిగణిస్తారు. నిజమునకు ప్రస్తుత శ్లోకము,"పరమాత్మకు-ప్రపంచమునకు వారథి వంటిది.దీనిని ఆలంబన శ్లోకముగా కూడా భావిస్తారు. ఖగోళ సౌరశక్తిని భూగోళమునకు చేర్చు సహాయకారులు "కిరణములు" వాటి ప్రసక్తి ఈ శ్లోకమునుండి ప్రారంభమవుతుంది. శ్లోకము ****** "రశ్మిమంతం-సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్య -వివశ్వంతం భాస్కరం-భువనేశ్వరం" తన కిరణములను పూర్తిగా విస్తరింపచేసి అంతకు ముందున్న చీకట్లను దాచివేసి దేవతలచే-అసురు...