Posts

Showing posts from February 16, 2026

ADITYAHRDAYAMU-27

Image
 ఆదిత్యహృదయం-శ్లోకము-27 ******************* ప్రార్థన ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వ రంగము **********        యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.  తత్ఫలితముగా  రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు. సీతమ్మ ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.  యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు. అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.   సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట. తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస్తున్నది. శ్లోకము ***** ఏతత్ శృత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్నవాన్" పరమపావనమైన ఆదిత్యస్తోత్ర జపక...