NA: PRAYACHCHAMTI SAUKHYAM-04

నః ప్రయచ్చంతి సౌఖ్యం-07 " ఓం తస్కరాణాం పతయే నమః" ******************************** ఒక్కడే! దిక్కొక్కడే ! పెద్ద దొంగ ఒక్కడే అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు దొంగ ఒక్కడే దేవుడు-జీవుడు ఒక్కడే ధర్మము-మర్మము తానొక్కడే. లోకాన దొరకాదు దొంగవని చాటాను నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.ఓం నమః శివాయ. చోరాన్ మారయ మారయ ------------------------ " భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే" దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించు చున్నది.ఎందుకంటే , రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః. ఏ వికారములేని పరమాత్మ అనేక చోరులరూపములలో ప్రకటింపబడుతు పాపములను దోచుకొనుచు ప్రాణులను సంస్కరిస్తుంటాడు.బహురూపములైన భగవత్తత్త్వమును భజించరాదే ఓ మనసా! 1....