Posts

Showing posts from October 15, 2026

AMBA VANDANAM-06

Image
       అంబ వందనం-06      *************  న(నా)గాధీశ్వర విష్టరాం ఫణిఫణోత్తంస ఉరు రత్నావళీ  భాస్వత్ దేహలతాం నిభా నేత్రత్రయోత్ భాసితాం  మాలా కుంభ కపాల నీరజ కరాం చంద్రార్థ చూడాంబరాం  సర్వేశ్వర భైరవాంగ నిలయాం పద్మావతీం చింతయే.       తన త్రినేత్రముల కాంతితో దిక్కులకు వెలుగును నింపుతూ,నాలుగు చేతులలో జపమాల-కలశము-కపాలమును ధరించి,సర్పమును/హిమవంతుని ఆసనము చేసుకుని,సర్పపడగల మణుల కాంతితో ప్రకాశించు లతాంగి,భైరవ వామబాగియై పద్మావతి అను పేరుతో కరునను వర్షిస్తున్న అమ్మను సేవిస్తున్నాను.    సమరమున చండ-ముండులు సమసిపోవుట తెలుసుకొని,రెట్టించిన క్రోధముతో శుంభుడు తనదగ్గరనున్న అనేకానేక దైతేయులను-ధౌమ్రులను-కాలకులను-కాలకేయులను దేవిపై దండెత్తుటకు రక్తబీజుని ఆజ్ఞాపించెను. నిజమునకు ఇక్కడ జరుగుచున్న సమరము చంచల మానవస్వభావమునకు-అచంచల దైవత్వమునకు సంకేతముగా చెప్పబడుచున్నది. అనేకానేక తామసగుణ అవిరామ స్వైరవిహారము ఒకవైపు-ఏకత్వం జగత్యత్ర ద్వితీయం కం? మరొకవైపు. దానిని గుర్తించలేని తామసమే తల్లిని బంధించుటకు చేయుచున్న నిష్ఫల ప్రయత్నములు. తన నైజమును మా...