Monday, January 4, 2021

ALO REMBAVAY-22



   ఇరువది  రెండవ పాశురము.
    *********************


అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన
పంగమాయ్ వందునిన్ పళ్ళికట్టిల్ కీళే

శంగం ఇరుప్పార్ పోల్వందు తలైపెయిదోం

కింగిణి వాయ్ శెయిద తామరై పూప్పోలే

శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్
అంగణ్ ఇరండు కొండుం ఎంగళ్మేల్
తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్
అంగణ్ ఇరండుం కొండుం ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇళిందేలో రెంబావాయ్.


 ఓం పద్మపత్ర నేత్రాయ నమః
 ***********************

  స్వామి నీ అర్థనిమీలిత నేత్ర సౌందర్య దర్శనమును పొందుటకు మాకు ఏ శాపమో అడ్డుపడుతున్నది
 కాని నీకు మాయందున్న వాత్సల్యలోపము మాత్రము కాదు.నీ నేత్ర సందర్శనము సర్వదుఖఃహరము.సర్వమంగళకరము.సమ్మోహనము.సాంత్వనము.సకలార్థసాధనము.కనుక మమ్ములను అనుగ్రహించి,
 నీవు మేల్కాంచునప్పుడు నీ కన్నులు అనుభవించు అద్భుత సౌందర్యానుభూతిని దర్శించేభాగ్యమును మాకు ప్రసాదించు,అని గోదమ్మ గోపికలతో పాటుగా స్వామి నేత్ర సౌందర్యమును పరిపరివిధములుగా ఉపమానములతో పోల్చుచు,అవి స్వామినేత్రములతో పోల్చదగినవి కావేమో అని అనుమానించుచు,సమాన-అధికమైనవేమియును లేవని మనకు తెలియచేస్తున్నది.



 నేత్రదర్శన సందర్శనమునకు ఉండవలసిన అర్హత అభిమాన రాహిత్యము/అజ్ఞాన రాహిత్యము.దీనిని గోదమ్మ ఉపమానముల ద్వారా మనకు వివరించుచున్నది.
1 అరసర్-రాజులు, వారు ఇంతకు ముందు తాము భూమండలాధీశులమనే భావనతో ఉండేవారు.
అంగ్-అందమైన,
మాన్యాలు-విశాలమైన భూమందలముతమ అధీనములో నున్నదనుకునేవారు.

 ఎంత విచిత్రము.
 పంచభూతముల సహకారముతో-అవి అందించుచున్న సహాయముతో నున్న మనము వాటికి పాలకులము ఎలా అవుతాము?

  భూమి అందించుచున్న ఆహారమును-ఆరోగ్యమును-ఆహ్లాదమును అనుభవించుచున్నాము.వానిని నేలనింగి సాయముతో పొందుతున్నామన్న విషయమును మరిచాము.అంతే కాదు జలమును తాగుతున్నాము.గాలిని పీలుస్తున్నాము.పంచభూతాల దయపై ఆధారపడిన మనము వాటి పాలకులమనుకొనుట సమంజసమేన?

 దానిని తెలుసుకొనుటయే అభిమానమును వీడుట.అసలు విషయమును అర్థముచేసుకొనుట.కనుకనే అరసర్-
 వారు రాజులమనే భావనను విడిచి,భగవత్సేవకులై వచ్చి,గుంపులుగుంపులుగా స్వామి మంచము క్రింద కూర్చున్నారుట.స్వామి మేల్కాంచితే కొలుచుటకు.
నిన్ పల్లిక్ కట్టీర్కీళే-నీ మంచము కింద కూర్చున్నారు. వచ్చి,
అబిమాన బంగమాయ్-అభిమానమును/అజ్ఞానమును వదిలివేసి.


 మేమును సంసార సామ్రాజ్యమునకు పాలకులము మేము కామన్న సంగతిని తెలుసుకుని,నీ అనుగ్రహమే సమస్త సంసారమునకు సాఫల్యమునకు కారణమని తెలుసుకుని,నీ అర్థ నిమీలిత నేత్ర సౌందర్యమును వీక్షించుటకై నీ గడప ముందు వేచియున్నాము.


 స్వామి మా ముచ్చట తీర్చవయ్య.నీ నేత్రములను నాలుగు విధములుగా తలుస్తు మమ్ములను దర్శించనీ ఓ కారుణ్య పయోనిధి.

1.కింగిణి వాయ్ శెత్త-గంటకు కట్టిన మువ్వ వలె శబ్దముచేయుచు-శ్రవణముతో పులకించనీ.ఆ శబ్దము సౌమ్యముగానుండి మమ్ములను ధన్యులను చేయును.

2కాదు కాదు-
 తామరై పూప్పోలె-తామరసదళనేత్రునివలె,

  కన్నులకు కమనీయము.జ్ఞానమయము.
3.కాదు-కాదు-కాదు.
 తింగళుం-ఆదిత్యునిం.

   సూర్య చంద్రుల ప్రకాశించు నీ నేత్ర సౌందర్యమును,నీవు మేల్కాంచునప్పుడు మమ్ములను దర్శించనీ అని అన్నారుగాని,వారికి ఆ కోరిక తృప్తిని కలిగించుటలేదు.

 ఎందుకంటే మువ్వలు-పద్మములు-సూర్యచంద్రులు స్వామిచే సృష్టింపబడినవే.అవి స్వామి నేత్రములతో పోల్చుటకు సమానమైనవి కావు.వాటితో పోల్చుటకు అర్హత కలిగినవేవి లేవు కనుక స్వామి నీ మేల్కాంచునపుడు ప్రభవించు నీ నేత్ర సౌందర్యమును దర్శించి,మా శాపములను పోగొట్టుకుందమని ప్రార్థించుచున్న గోపికలతో పాటుగ నున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము నేత్ర సౌందర్య భాగ్యమునకై వేచియుందాము.


  ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..





 



 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...