ADITYAHRDAYAM-SLOKAM-09

ఆదిత్యహృదయం-శ్లోకము-09 ********************* ప్రార్థన ****** ' జయతు జయతు సూర్యం-సర్వ లోకైకదీపం హిరణ సమిత పాపద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వ రంగము *********** రశ్మిమంతుడు లోకరక్షణావిధానమునకై కొన్ని శక్తులను-వాటికి సహాయకారులగు మరికొన్ని బృందశక్తులను తన కిరణముల ద్వారా ప్రసరనముచేస్తూ,వాయు-వహ్ని రూపములతో తాను ప్రాణశక్తిగా ప్రకాశించుచున్నాడు. ప్రస్తుత శ్లోకము 'మరీచిమాన్" అన్న , మారయతి యత్ మరీచి అంటు,సంహారము చేసే శక్తి మరీచి అని,అందులో శ్రేష్ఠుడు కనుక మరీచిమాన్ అంటూ సంహారకుడు కూడా సూరెయశక్తియే అని స్తుతిస్తున్నది. శ్లోకము. ****** " హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్ త్మిరః ఉన్మథనః శంభుః త్వష్టా మార్తాండ-అంశుమాన్" పరమాత్మ మార్తాండుడు.ఈ శబ్దమును రెండు విధములుగా అలంకారికులు అన్వయిస్తారు. అదితి తన గర్భములో పెరుగుతున్న పరమాత్మను స్తుతిస్తూ,ఉపవాసాది నియమన...