TIRUVEMBAVAY-22

తిరువెంబావాయ్-22 *************** అరుణన్ ఇందిర దిశై అణుగీనన్ ఇరుళ్ పో అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్ కరుణను శూరియ యళయళ నయన కడిమలర్ మలరమర తణ్ణనల్ కణ్ణా తిరనిరై అరుపదం మురల్వన్ ఇవైయో తిరుపెరున్ తిరైయురై శివపెరుమానే అరుళిరి తరువరం ఆనందమలయే అలైకడలే పళ్ళి ఎళుందరుళాయె. పూసలర్ పూజిత తిరువడిగళే పోట్రి. ************************ తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో పద్మములు ఏ విధముగా స్వామి అనుగ్రహకాంతిని స్వీకరించి సంతోషముతో పరవశిస్తు-వికసిస్తూ-ప్రకాశిస్తున్నాయో సంకీర్తించారు. ఈ పాశురములో స్వామి తన ముఖకాంతిని సూర్య కిరణములకు ప్రసాదించించి,జగములను చేతనవంతము చేస్తున్నాడో ప్రస్తుతిస్తున్నారు. శివపెరుమానే-మహాదేవా! ఇరుళ్-చీకట్లు నిష్క్రమించినవి. ఎందువలన? అరుణన్-నీ అనుగ్రహమనే ఎర్రని సూర్యుడు, చేరుకున్నాడు-ఎక్కడికి? ఇందిరన్ దిసై-తూరుపు దిక్కునకు. తత్ఫలితముగా మా హృదయపద్మములు వికసిస్తూ,తమోగుణమనే చీకట్లను తరిమివేస్తున్నాయి. ఆ అరుణోదయ భానురేఖల భాగ్యమును నేనేమనగలను?అవి ఎంత ధన్యతను పొందినవో-సాక్షాత్తు నీ...