అర్థనారీశ్వరయే పోట్రి
********************
ఓ చెలి కన్నులు తెరిచి చూడు.
కోళి శిలంబ-తెల్లవారినదని కోడి సకేతముగా కూయగానే,
శిలంబ-కూస్తున్నాయి ఏవి అంటే?
కురంగు ఎంగుం-మిగిలిన పక్షులన్నీ కోడి ఇచ్చిన సంకేతమును అర్థముచేసుకొని తామును మేల్కొన్నామని కూస్తూ సూచిస్తున్నాయి.(స్వామిసేవకై)
కోవెలలో,
ఎళి లియంబ-వీణా నాదము ప్రాంభమూఅగానే దానిని విని,తామును సిధ్ధమే అని సనేతముగా,
వేణ్ సంగం-తెల్లని శణములన్నీ నాదార్చనను ప్రారంభించినవి.
అవి నీకు వినబడలేదా? ఇంకా నిదురించుచున్నావు.
మేమందరము కలిసి బిగ్గరగా స్వామిని,
కేళి-అసమాన పరంజోది-బృహత్ జ్యోతి యని,
కేళి పరం కరుణై-అవ్యాజ కరుణామూర్తియని,
కేళి తిరుప్పొరుళ్-అరూపా/బహురూపధారియని కీర్తించాము.
అంతేకాదు ఆనందపారవశ్యముతో స్వామిని,
ఊళి-ప్రళయ సమయమున/అంతా జలముతో కప్పివేయబడిన సమయమున,
ఒరువన్-తానిక్కడే,
ప్రళయసాక్షియై నిలిచిన స్వామిని(సమస్తమును తనలో దాచుకొని)తానొక్కడుగా ప్రళయసాక్షిగా నిలబడిన స్వామిని ఆర్ద్రత నిండిన మనసుతో దర్శిస్తూ,ఇప్పుడు మనకొరకు,ఇక్కడ,
ఏనై పంగళనయే-ఎడమవైపు అమ్మతో దర్శనమిస్తున్న నిన్ర-నిలబడిన స్వామిని కీర్తిస్తున్నను నీవు నిద్రను వీడలేకౌన్నావు.నీది ఎంత విచిత్రమైన నిద్ర చెలి.మాకొరకు బహిర్ముఖివై మమ్ములను కూడి,శివనోమునకు రమ్ము.
అంబే శివే తిరువడిగళే శరణం.