meedushulu.

నః ప్రయచ్చంతి సౌఖ్యం-17 **************************** భగవంతుడు- భక్తుడు మీడుష్టులే సంపదలను వర్షించువారే. "మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ" మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు. " నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు. కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం. " ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్." కుబెరుని అసలుపేరు వైశ్రవణుడు.యక్షులకు రాజు.రావణునిచే ఓడింపబడిన వాడు. కు అనగా వక్రము/వంకర.బాహ్యములో ఇతడు వంకర శరీరముకల వికారస్వరూపుడు బేరము అను పదమును శరీరమునకు అన్వయించుకుంటే.ఒకవిధముగా కుబ్జ వలె సరైన శరీరసౌష్ఠవము లేవి వికారరూపుడైనప్పటికిని విశ్వేశ్వర కృపాపాత్రుడు.గుణనిధి జన్మపరంపరలలో కుబేరునిది ఒకటి అని పెద్దల అభిప్రాయము. జన్మతః లభించిన జంగమదేవ...