TIRUVEMBAAVAAY-08

తిరువెంబావాయ్-08 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబు వెణ్ శంగం ఎంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పొరుళ్గళ్ పాడినో కేట్టిలైయో వాళి ఇదెన్న ఉరక్కుమో? వాయ్ తిరవాయ్! ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి ***************** తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో స్వామిని దేవతలకు-మానవులకు సర్వులకు రక్షకుడు తానొక్కడే అని కీర్తించినాడు. ఈ పాశురములో స్వామిని ప్రళయ సాక్షిగా ప్రస్తుతించుచున్నాడు. ఊళి-ప్రళయ సమయమున జలగర్భముకానిది ఒరువన్-ఒక్కరే, అది మన స్వామి. ఆ సమయమునందు స్వామి నిరాకార-నిర్గుణ -నిరంజన -నిస్తుల ప్రకాశము. అయినప్పటికిని మన కోరకు స్వామి, కేళిల్-అసమానమని/దేనితో పోల్చలేని,అధికము లేని, పరం జోది-బృహత్ జ్యోతి.దాని కన్నా అధికమైన ప్రకాశము లేదు.ఇది నిస్సందేహము. ప్రకాశము మాత్రమే కాదు.ప్రపన్నుల పట్ల శరణుకోరిన వారి యందు ప్రసన్నతయు కలిగి...