NIRVAANA SHATKAMU.
నిర్వాణషట్కము 1. హృదయమునకు శ్వాసనందించు ప్రాణవాయువును కాను ఊపిరితిత్తులను పనిచేయించు అపాన వాయువును కాను సంకోచ వ్యాకోచ కారియైన వ్యానవాయువును కాను వాగ్రూప విలసితమైన ఉదాన వాయువును నేనుకాను జీర్ణావస్థను నిర్వహించు సమాన వాయువును కాను పంచ వాయువులు కాని నిరాకార నిరంజనమును నేను 2.త్రేణుపుగా వెలువడు గాలియైన నాగ ను నేనుగాను కనురెప్పకదలిక కారణమైన కూర్మ గాలిని గాను తుమ్ముటకు సహాయకారియైన కృకల వాయువును గాను మూసి-తెరచు హృదయ నాడుల ధనంజయ గాలిని గాను ఆవులింతలో దాగినదేవత్త దేవదత్త గాలిని గాను పంచోప వాయువులు కాని చిదానందమును నేను. 3..నయన-కర్ణ-జిహ్వ-చర్మ -నాసికను నేనుకాను శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులును నేనుకాను అన్నమయ-ప్రాణమయాది పంచకోశములును రక్త-మాంస-చర్మాదులైన సప్తధాతువులను కాను నవరంధ్ర సహిత శరీరమును నేను కాను దశేంద్రియములకు అధీనుడను నేను కాను ఇంద్రియావస్థలు లేని శివస్వరూపమును నేను. 4.అరిషడ్వర...